Jump to content

1813

వికీపీడియా నుండి

1813 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1810 1811 1812 - 1813 - 1814 1815 1816
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
  • జనవరి 24:లండన్‌లో ఫిలార్మోనిక్ సొసైటీని స్థాపించారు. తరువాత ఇదే రాయల్ ఫిలార్మోనిక్ సొసైటీగా మారింది.
  • జనవరి 28: జేన్ ఆస్టిన్ రాసిన ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ను తన పేరు లేకుండా ప్రచురించింది.
  • మార్చి 4: ఫ్రెంచి సైన్యం బెర్లిన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో రష్యా సేనలు యుద్ధం చెయ్యకుండానే నగరాన్ని ఆక్రమించాయి
  • మార్చి 28: 1813-14 నాటి మాల్టా ప్లేగు మహమ్మారి ఏజిప్టు నుండి వ్యాపించడం మొదలైంది
  • జూలై 21: బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ చట్టము 1813 కి రాజముద్ర పడింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో మతప్రచారం చేసుకోవచ్చని ఈ చట్టం అనుమతించింది.
  • సెప్టెంబరు 10: ఆలివర్ హజార్డ్ పెర్రీ నేతృత్వంలోని అమెరికన్ స్క్వాడ్రను బ్రిటిషు స్క్వాడ్రన్ను ఓడించింది.
  • అక్టోబరు 4: హేస్టింగ్సు భారత గవర్నరు జనరల్ అయ్యాడు. (విరమణ. 1823)
  • అక్టోబరు 16-19: లీప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ సంకీర్ణ సైన్యాల చేతిలో ఓడిపోయాడు. యుద్ధంలో పాల్గొన్న 6 లక్షల మంది సైనికుల్లో 60 వేల మంది మరణించడమో, గాయపడ్డమో జరిగింది. ఈ యుద్ధం తరువాత నెపోలియన్‌ పక్షాన ఉన్న అనేక జర్మను రాజ్యాలు సంకీర్ణ సైన్యాల వైపుకు మారిపోయాయి.
  • తేదీ తెలియదు: షాజహాన్‌పూర్ జిల్లాను ఏర్పరచారు.
  • తేదీ తెలియదు: ఆరవ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపత్యం స్వీకరించాడు.

జననాలు

[మార్చు]
Swathi Thirunal of Travancore

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=1813&oldid=3049205" నుండి వెలికితీశారు