Jump to content

జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్

వికీపీడియా నుండి
లెగ్రాంజ్ చిత్రపటం

జోసెఫ్-లూయిస్ లెగ్రాంజ్ [a] ( 1736 జనవరి 25 - 1813 ఏప్రిల్ 10) ఒక ఇటాలియన్ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. పుట్టినపుడు గియుసేప్ లుయిగి లాగ్రానియా [5] [b] లేదా గియుసేప్ లుడోవికో డి లా గ్రాంజ్ టోర్నియర్; [6] [c] అని పేరు పెట్టారు. గియుసేప్ లుయిగి లాగ్రేంజ్ [7] లేదా లాగ్రాంజియా అని కూడా అంటారు.[8] తరువాత ఫ్రెంచి పౌరుడయ్యాడు. విశ్లేషణ, సంఖ్య సిద్ధాంతం, సాంప్రదాయ యాంత్రికశాస్త్రం, ఖగోళ మెకానిక్స్ రంగాలలో గణనీయమైన కృషి చేశాడు.

రెండు ఖగోళ వస్తువుల వ్యవస్థలో సాపేక్షికంగా స్థిరంగా ఉండే బిందువులైన L4, L5 లను కనుగొన్నాడు. ఆ బిందువులకు ఇతని పేరు మీదనే లాగ్రాంజియన్ బిందువులు అనే పేరు వచ్చింది.

1766 లో, స్విస్ ఆయిలర్, ఫ్రెంచ్ డి అలంబెర్ట్ ల సిఫారసు మేరకు, లాగ్రేంజ్ ఐలర్ తరువాత బెర్లిన్‌లోని ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో గణితశాస్త్ర డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. అక్కడ ఇరవై సంవత్సరాలు పనిచేసాడు. అనేక విజయాలు సాధించాడు. ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బహుమతులు పొందాడు. లాగ్రేంజ్ గ్రంథం, ఎనలిటికల్ మెకానిక్స్ ( మెకానిక్ అనలిటిక్, 4. ed., 2 వాల్యూమ్స్. పారిస్: గౌతీర్-విల్లర్స్ ఎట్ ఫిల్స్, 1788–89) బెర్లిన్‌లో ఉండగా రాసాడు. ఇది 1788 లో మొదట ప్రచురించబడింది. న్యూటన్ తరువాత క్లాసికల్ మెకానిక్స్‌లో అత్యంత సమగ్రమైన పరిష్కారాలను అందించాడు. పంతొమ్మిదవ శతాబ్దంలో గణిత భౌతిక శాస్త్ర అభివృద్ధికి ఒక ఆధారాన్ని ఏర్పాటు చేసింది.

1787 లో, 51 సంవత్సరాల వయస్సులో, అతను బెర్లిన్ నుండి పారిస్ వెళ్లి ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడయ్యాడు. అప్పటి నుండి తన జీవితాంతం వరకు ఫ్రాన్స్‌లోనే ఉన్నాడు. అతను ఫ్రాన్స్‌లో దశాంశీకరణలో గణనీయంగా పాల్గొన్నాడు. 1794 లో ఎకోల్ పాలిటెక్నిక్ ఏర్పాటైనపుడు మొదటి విశ్లేషణ ప్రొఫెసర్ అయ్యాడు. బ్యూరో డెస్ లాంగిట్యూడ్స్ వ్యవస్థాపక సభ్యుడు, 1799 లో సెనేటర్ అయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. మూస:Cite Oxford Dictionaries
  2. "Lagrange". Random House Webster's Unabridged Dictionary.
  3. మూస:Cite American Heritage Dictionary
  4. మూస:Cite Merriam-Webster
  5. Joseph-Louis Lagrange, comte de l’Empire, Encyclopædia Britannica
  6. Angelo Genocchi. "Luigi Lagrange". Il primo secolo della R. Accademia delle Scienze di Torino (in Italian). Accademia delle Scienze di Torino. pp. 86–95. Retrieved 2 January 2014.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. Luigi Pepe. "Giuseppe Luigi Lagrange". Dizionario Biografico degli Italiani (in Italian). Enciclopedia Italiana. Retrieved 8 July 2012.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  8. [1] Encyclopedia of Space and Astronomy.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు