1846
స్వరూపం
1846 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1843 1844 1845 - 1846 - 1847 1848 1849 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 9:
- మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం, లాహోరు ఒప్పందం కుదరడంతో ముగిసింది.[1]
- కాశ్మీరు ఈస్టిండియా కంపెనీ హస్తగతమైంది.
- కోహినూర్ వజ్రం బ్రిటిషు రాణి విక్టోరియా వశమైంది.
- మే 12: కోలా శేషాచలం తన నీలగిరి యాత్రను మొదలు పెట్టాడు. దీన్ని నీలగిరి యాత్ర పేరుతో గ్రంథస్థం చేసాడు.
- జూన్ 10: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయసైన్యంతో కోయిలకుంట్ల లోని బ్రిటిషు వారి ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు. దాంతో అతడి తిరుగుబాటు మొదలైంది
- సెప్టెంబరు 10: ఎలియాస్ హోవ్ కు కుట్టుమిషను పేటెంటు లభించింది.[2]
- సెప్టెంబరు 23: జర్మను ఖగోళవేత్తలు యోహన్ గాట్ఫ్రీడ్ గాల్, హీఓంరిచ్ లూయీ డి అరెస్ట్లు నెప్ట్యూన్ గ్రహాన్ని కనుగొన్నారు.\
- తేదీ తెలియదు: హైదరాబాద్ మెడికల్ స్కూల్ పేరుతో ఉస్మానియా వైద్య కళాశాల మొదలైంది.
- తేదీ తెలియదు: అమెరికాలో స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ను స్థాపించారు.
- తేదీ తెలియదు: ఇంగ్లండులో కలరా అంటువ్యాధి వ్యాప్తి మొదలైంది
- అక్టోబరు 16: అమెరికా లోని మసాచుసెట్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో విలియమ్స్ థామస్ గ్రీన్ మార్టన్ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్కొలిన్స్తో కలిసి గిల్బర్ట్ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా ఈథర్ మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఇదే మత్తుమందు వాడడం మొదలైన ఈ రోజే ప్రపంచ అనస్థీసియా దినోత్సవం
జననాలు
[మార్చు]- తేదీ తెలియదు: అద్దేపల్లి కృష్ణశాస్త్రి, పండితుడు, పౌరాణికుడు. (మ. 1907)
- తేదీ తెలియదు: కార్యమపూడి రాజమన్నారు, శతావధాని. (మ. 1916)
- తేదీ తెలియదు: దాసు శ్రీరాములు, కవి, పండితుడు, న్యాయవాది (మ. 1908)
మరణాలు
[మార్చు]- మే 18: బాలశాస్త్రి జంబేకర్, సంఘ సంస్కర్త (జ. 1812)
- అగస్టు 1: ద్వారకానాథ్ టాగూర్, మొదటి భారతీయ పారిశ్రామికవేత్తలలో ఒకడు (జ. 1794) [3]
- డిసెంబరు 25: స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 0-14-102715-0.
- ↑ U.S. Patent 4,750
- ↑ Wolpert, Stanley (2009). A New History of India (8th ed.). New York, NY: Oxford UP. p. 221. ISBN 978-0-19-533756-3.