1844
స్వరూపం
1844 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1841 1842 1843 - 1844 - 1845 1846 1847 |
దశాబ్దాలు: | 1820లు 1830లు - 1840లు - 1850లు 1860లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జూన్ 15: 'ఛార్లెస్ గుడ్ ఇయర్', రబ్బరును వల్కనైజింగ్ చేసే పద్ధతికి పేటెంట్ పొందాడు
- ఆగస్టు 28: కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌లు పారిస్‌లో కలిసారు.
- సెప్టెంబరు 25 – 27: న్యూ యార్కులో తొట్టతొలి అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - అమెరికా - కెనడియన్ ప్రావిన్సెస్ మధ్య
- అక్టోబర్ 2: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు.
- తేదీ తెలియదు: స్వీడనుకు చెందిన రసాయన శాస్త్ర ప్రొఫెసరు గుస్టాఫ్ ఎరిక్ పాష్ అగ్గిపుల్లను కనుక్కున్నాడు.
- తేదీ తెలియదు: రుథేనియం మూలకమేనని నిర్ధారించి ఆ పేరు పెట్టారు
- తేదీ తెలియదు: అలెగ్జాండర్ డ్యుమాస్ లే కోమ్టే డి మోంటే-క్రిస్టో అనే ఫ్రెంచి నవలను రచించాడు.
- తేదీ తెలియదు: బెర్లిన్ జూలాజికల్ గార్డెన్ మొదలైంది
- తేదీ తెలియదు: మహారాజా చందూలాల్ హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి పదవి నుండి విరమించాడు.
- తేదీ తెలియదు: పరవస్తు చిన్నయ సూరి సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము రచించాడు
- తేదీ తెలియదు: అలెక్సాండర్ డఫ్ కలకత్తాలో ఫ్రీ చర్చ్ ఇన్స్టిట్యూషన్ స్థాపించాడు
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 20: లుడ్విగ్ బోల్ట్జ్మన్, ఆస్ట్రియా భౌతిక శాస్త్రవేత్త (మ. 1906)
- అక్టోబరు 15: ఫ్రెడెరిక్ నీషె, జర్మనీ తత్వవేత్త (మ. 1900)
- నవంబరు 25: కార్ల్ బెంజ్, జర్మన్ ఇంజిన్ డిజైనర్, కారు ఇంజనీర్, అంతర్గత దహన ఇంజన్ శక్తితో నడిచే ఆటోమొబైల్ ఆవిష్కర్త (మ. 1929)
- డిసెంబర్ 29: ఉమేష్ చంద్ర బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ తొలి అధ్యక్షుడు.
- తేదీ తెలియదు: సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, భారతీయ ప్రభుత్వ అధికారి, రాజకీయనాయకుడు, అఖిల భారత ముస్లిం లీగు తొలి నాయకుల్లో ఒకడు. (మ. 1926)
మరణాలు
[మార్చు]- జూలై 27:జాన్ డాల్టన్, ఆధునిక పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త, (మ. 1766)