ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచ అనస్థీషియా దినోత్సవం
జరుపుకొనే రోజు16 అక్టోబరు
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ అనస్థీషియా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 16న నిర్వహించబడుతుంది. తొలిసారిగా అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చి శస్త్రచికిత్స చేసిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

చరిత్ర[మార్చు]

పూర్వకాలంలో శస్త్ర చికిత్స చేయించుకునే రోగికి చాలా నొప్పి ఉండేది. వైద్యులు, నర్సులు కాకుండా వేరే పదిమంది మనుషులు గట్టిగా పట్టుకుంటే శస్త్రచికిత్స చేసేవారు. 1846, అక్టోబరు 16న అమెరికాలోని మసాచుసెట్స్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో విలియమ్స్‌ థామస్‌ గ్రీన్‌ మార్టన్‌ అనే వైద్యుడు, దంత వైద్యుడు జాన్‌కొలిన్స్‌తో కలిసి గిల్బర్ట్‌ అంబార్టు గొంతుకు శస్త్రచికిత్స చేసేందుకు తొలిసారిగా ఈథర్‌ మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.[1]

లక్ష్యం[మార్చు]

సదస్సులు, సమావేశాలు, కార్యశాలలు నిర్వహించి ప్రజలు, విద్యార్థులు, వైద్యరంగంలో ఉన్నవారికి అనస్థీషియా గురించి అవగాహన కలిపించడం

కార్యక్రమాలు[మార్చు]

  1. 2015, అక్టోబరు 16న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరంలోని ఫోర్ట్ సిటీ పారశాలలో అనస్థీషియాపై అవగాహన కార్యక్రమం జరిగింది.[2]
  2. 2019, అక్టోబరు 16న కర్నూలు సర్వజన వైద్యశాలలోని పాత సీఎల్జీలో వైద్య విజ్ఞన సదస్సు నిర్వహించబడింది.[3]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, జిల్లా (16 October 2019). "ఆయువు పోసే అనస్థీషియా". చంద్రమౌళి. మూలం నుండి 16 October 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 October 2019. Cite news requires |newspaper= (help)
  2. వైద్యరంగంలో కీలకపాత్ర వహిస్తున్న అనస్థీషియా, విశాలాంధ్ర, ఉత్తరాంధ్ర, 17 అక్టోబరు 2015, పుట. 8
  3. ఈనాడు, కర్నూలు (16 October 2019). "ఏటా 30 వేల శస్త్రచికిత్సలు". www.eenadu.net (ఆంగ్లం లో). మూలం నుండి 16 October 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 16 October 2019.