Jump to content

శస్త్ర చికిత్స

వికీపీడియా నుండి
శస్త్రచికిత్సలో నిమగ్నమైన వైద్యనిపుణులు

శస్త్ర చికిత్స అనేది వైద్యశాస్త్రంలో ఒక ప్రత్యేక నైపుణ్యం. శస్త్ర చికిత్స ద్వారా ఏదైనా వ్యాధినీ, గాయాన్ని, అవాంఛిత భాగాలను తొలగించి నయం చేస్తారు.

సాధారణంగా శస్త్రచికిత్సలో కనీసం ఇద్దరు నిపుణులు ఉంటారు. చికిత్స చేసేవారు ఒకరైతే వారికి సహాయం చేసేందుకు మిగతావారు ఉంటారు. అధునాతన శస్త్రచికిత్సల్లో అయితే ఒక బృందమే ఉంటుంది. సర్జన్లు, వారి సహాయకులు, మత్తుమందు నిపుణుడు, నర్సులు మొదలైనవారు ఈ బృందంలో ఉంటారు. శస్త్రచికిత్సలన్నీ శరీరానికి కొద్దిగానైనా గాయం చేసేవే కాబట్టి వీటిని నయం చేయడానికి చికిత్సానంతర పద్ధతులు ఉంటాయి. శస్త్రచికిత్స సంక్లిష్టతను బట్టి, రోగి పరిస్థితిని బట్టి, శరీర భాగాలను బట్టి అది కొన్ని నిమిషాల నుండి కొన్ని గంటలపాటు జరగవచ్చు.

చరిత్ర

[మార్చు]

చరిత్ర పూర్వకాలం నుంచే శస్త్రచికిత్సలు జరిగాయని ఆధారాలున్నాయి. ఇందులో అత్యంత ప్రాచీనమైనది కపాలాన్ని పగలగొట్టి చేసే చికిత్స.[1]

భారతదేశంలో చరిత్రపూర్వకాలానికి చెందిన సింధు నాగరికతలో సుమారు 9000 సంవత్సరాల వయసున్న అస్థిపంజరాన్ని పరిశీలించగా అందులో దంతంలో రంధ్రం వేసినట్లు గుర్తించారు.[2] సుశ్రుత సంహిత శస్త్రచికిత్సల గురించి ప్రస్తావించిన పురాతన గ్రంథాల్లో ఒకటి.[3] ఇది అనేక వ్యాధుల పరీక్ష, రోగ నిర్ధారణ, చికిత్స, అలాగే వివిధ రకాలైన కాస్మెటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, రినోప్లాస్టీ విధానాలను వివరిస్తుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. Capasso, Luigi (2002). Principi di storia della patologia umana: corso di storia della medicina per gli studenti della Facoltà di medicina e chirurgia e della Facoltà di scienze infermieristiche (in ఇటాలియన్). Rome: SEU. ISBN 978-88-87753-65-3. OCLC 50485765.
  2. "Stone age man used dentist drill". BBC News. 6 ఏప్రిల్ 2006. Archived from the original on 22 ఏప్రిల్ 2009. Retrieved 24 మే 2010.
  3. Singh PB, Rana PS (2002). Banaras Region: A Spiritual and Cultural Guide. Varanasi: Indica Books. p. 31. ISBN 978-81-86569-24-5.
  4. Rana, R. E.; Arora, B. S. (1 January 2002). "History of plastic surgery in India". Journal of Postgraduate Medicine. 48 (1): 76–78. PMID 12082339. Archived from the original on 1 March 2009 – via www.jpgmonline.com.