Jump to content

ప్లాస్టిక్ సర్జరీ

వికీపీడియా నుండి

ప్లాస్టిక్ సర్జరీ లేదా విరూప సవరణ శస్త్రచికిత్స (Plastic Surgery) అనేది శస్త్ర చికిత్స పద్ధతుల్లో ఒక ప్రత్యేకమైనది. దీని ద్వారా మానవ శరీరాన్ని పునరుద్ధరణ, పునర్నిర్మాణం లేదా మార్పు చేయవచ్చు. ప్లాస్టిక్ సర్జరీ పరిధి చాలా విస్తృతమైనది. స్థూలంగా దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి పునర్నిర్మాణ శస్త్రచికిత్స (Reconstructive Surgery), రెండవది సౌందర్య సాధక శస్త్రచికిత్స (Cosmetic Surgery). మొదటి రకం చికిత్స ద్వారా పుట్టుకతో ఏర్పడ్డ వికృతులను, కాలిన గాయాలను కొంతమేరకు రూపమాపవచ్చు. సౌందర్య సాధక శస్త్ర చికిత్సలో సాధారణంగా అందాన్ని ఇనుమడింపచేయడానికి చేస్తుంటారు.[1][2]

చరిత్ర

[మార్చు]

విరిగిన ముక్కును బాగు చేసే చికిత్సలు మొదట సా.శ.పూ 1600లోనే ఎడ్విన్ స్మిత్ పాపిరస్ అని పిలువబడే గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి.[3][4] ప్రాచీన భారతదేశంలో సుశ్రుతుడు, చరకుడు రాసిన వైద్య గ్రంథాలలో ప్లాస్టిక్ సర్జరీ గురించిన ప్రస్తావన ఉంది. ఈ పుస్తకాలు సా.శ 750 లో అబ్బసిద్ ఖలీఫత్ కాలంలో అరబిక్ భాషలోకి తర్జుమా చేయబడ్డాయి.[5] ఇవి మరికొంత మధ్యవర్తిత్వంతో ఐరోపా భాషల్లో కూడా అనువదించబడ్డాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. "What is Cosmetic Surgery". Royal College of Surgeons. Retrieved 15 January 2013.
  2. "Plastic Surgery Specialty Description". American Medical Association. Retrieved 13 July 2020.
  3. Shiffman M (2012-09-05). Cosmetic Surgery: Art and Techniques. Springer. p. 20. ISBN 978-3-642-21837-8.
  4. Holland, Oscar (30 May 2021). "From ancient Egypt to Beverly Hills: A brief history of plastic surgery". CNN (in ఇంగ్లీష్). Retrieved 2021-10-03.
  5. 5.0 5.1 Lock, Stephen etc. (200ĞďéĠĊ1). The Oxford Illustrated Companion to Medicine. US: Oxford University Press. ISBN 0-19-262950-6. (page 607)