మే 18
స్వరూపం
మే 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 138వ రోజు (లీపు సంవత్సరములో 139వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 227 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1642: కెనడా దేశంలోని రెండవ పెద్ద నగరమైన మాంట్రియల్ స్థాపించబడింది.
- 1804: ఫ్రెంచ్ సెనేట్ నెపోలియన్ బోనపార్టెను చక్రవర్తిగా ప్రకటించింది
- 1830 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబరు 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
- 1860: చికాగోలో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశం లో, అబ్రహం లింకన్ని అమెరికా అధ్యక్షుడుగా ప్రతిపాదించారు (నామినేటెడ్ ).
- 1910: హేలీ తోకచుక్క భూమి మీద నుంచి కనిపించి, సూర్యుని వైపు తరలిపోయింది.
- 1914: పనామా కాలువ ద్వారా కార్గో (సరుకు/సామాను) తో ప్రయాణించిన మొట్ట మొదటి స్టీం బోటు (ఆవిరితో నడిచే పడవ) పేరు మారినర్ .
- 1933: టెన్నెసీ వేలీ అథారిటీ (టి.వి.ఏ) ని ఏర్పాటు చేసారు., దీని ఉద్దేశాలు.. టెన్నేస్సీ నది వలన వచ్చే వరదలను కట్టడి చేయటానికి, టెన్నెస్సీ లోయ లోని భూములలో అడవులను పెంచటము, గ్రామాలకు విద్యుత్తును అందించటము. టెన్నెసీ వేలీ అథారిటీ ఏడు రాష్ట్రాలలో పనిచేస్తుంది.
- 1953:: జాక్వెలిన్ కోచ్రన్ నార్త్ అమెరికన్ ఎఫ్-86 కనడేర్ విమానం రోజర్స్ డ్రై లేక్ (కాలిఫోర్నియా) మీదగా నడిపిన మొట్టమొదటి మహిళ. ఎఫ్-86 చేసే శబ్దానికి స్త్రీలు తట్టుకోలేరన్న వాదనను పటాపంచలు చేసింది.
- 1969: రోదసీ నౌక అపొలో 10 ని, ముగ్గురు రోదసీ యాత్రికుల (1. యూజీన్ ఎ. సెమన్, 2. థామస్ పి. స్టాఫర్డ, 3. జాన్ డబల్ యు. యంగ్) తో రోదసీ లోకి ప్రయోగించారు.
- 1980: 93 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న, 9,677-అడుగుల ఎత్తున్న మౌంట్ సెయింట్ హెలెన్స్ అగ్నిపర్వతం (వాషింగ్టన్ రాష్ట్రము) పేలింది. అగ్నిపర్వతం పేలుడు హిరోషిమా పై వేసిన అణుబాంబు కంటే ఐదు వందల రెట్లు అధిక శక్తివంతమైనది. అగ్ని పర్వతం చిమ్మిన, ఆవిరి, బూడిద ఆకాశంలో 11 మైళ్ళఎత్తు దాటి, 160-మైళ్ళ వ్యాసార్ధములో ఆకాశం అంతా చీకటి మయం అయింది. అగ్నిపర్వతం చుట్టూ ఉన్న అడవులు అంటుకుని, ఆర్పటానికి సాధ్యం కాలేదు. ఈ పేలుడులోను, తరువాత మరణించిన వారు 67 మంది.. ఈ పేలుడు, 1300 అడుగుల ఎత్తున పర్వతం మీద జరిగి, 57 మంది మరణించటమో, కనపడకుండా పోవటమో జరిగింది
- 1991: సోవియట్ సోయుజ్ అంతరిక్ష నౌకలో హెలెన్ షర్మన్ (మొట్ట మొదటి బ్రిటన్ మహిళ) అంతరిక్షంలోకి వెళ్ళింది.
- 1995: నటి ఎలిజబెత్ మాంట్ గోమెరి, లాస్ ఏంజిల్స్లో మరణించింది.
- 2005: కువాయిట్ పార్లమెంట్ ఆడవారికి ఓటు హక్కు ఇచ్చింది.
- 2006: నేపాల్ రాజు యొక్క అధికారాలను తగ్గించటానికి, నేపాల్ పార్లమెంట్ ఒక తీర్మానం చేసింది
- 2006: అంగోలాలో కలరా వ్యాపించింది.
- 2006: భారత దేశపు, స్టాక్ మార్కెట్ అధఃపాతాళాన్ని తాకింది. సెన్సెక్స్ 826 పాయింట్లు, నిఫ్టీ 246 పాయింట్లు కోల్పోయాయి.
- 2007: అంటార్కిటిక్ సముద్రంలో 700 కొత్త జీవులను కనుగొన్నారు.
- 2011: స్పేస్ షటిల్ ఎండీవర్ ఆఖరి సారిగా (చివరి ప్రయాణం) రోదసీలోకి వెళ్ళింది.
- 2012: అమెరికాకు చెందిన నాస్ డాక్ స్టాక్ ఎక్స్చేంజీలో, ఫేస్ బుక్ (సోషల్ నెట్ వర్క్ సంస్థ) 2012 మే 18 నాడు నమోదు అయింది.
- 2012: రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 54.90 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.
జననాలు
[మార్చు]- 1850: ఆలివర్ హీవిసైడ్, భౌతిక శాస్త్రవేత్త. అయనోస్పియర్ అనేది ఒకటి ఉందని, అది రేడియో తరంగాలను పరావర్తింప చేస్తుందని ఊహించి చెప్పిన శాస్త్రవేత్త.
- 1877: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (మ.1923)
- 1883: జర్మన్ ఆర్కిటెక్ట్ (భవన నిర్మాత) వాల్టర్ గ్రోపియస్, బౌహౌస్ స్కూలు స్థాపకుడు జననం.
- 1914: సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు. (మ.2010)
- 1916: సి.ఆర్.సుబ్బరామన్, తెలుగు సంగీత దర్శకుడు, నిర్మాత(మ.1952)
- 1928: చలం(కోరాడ సింహాచలం), తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత.
- 1932: దూపాటి సంపత్కుమారాచార్య, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని
- 1949: నరాల రామిరెడ్డి, సుప్రసిద్ధ తెలుగు అవధానీ.
- 1959: బేతా సుధాకర్ , చలన చిత్ర నటుడు, నిర్మాత.
మరణాలు
[మార్చు]- 1886: అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (జ.1820)
- 1986: కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (జ.1902)
- 2007: జ్యోతి, దక్షిణ భారత చలన చిత్ర నటి(జ.1963)
- 2013: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (జ.1915)
- 2014: పి.అంకమ్మ చౌదరి, హేతువాది, మానవతావాది. మానవతా విలువలున్న న్యాయమూర్తి.
- 2017: కె.కె.శర్మ, తెలుగు సినిమా నటుడు, రంగస్థల నటుడు.
- 2018: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (జ.1938)
- 2018: యద్దనపూడి సులోచనారాణి, నవలా రచయిత్రి. (జ.1940)
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మే 17 - మే 19 - ఏప్రిల్ 18 - జూన్ 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |