నెపోలియన్

వికీపీడియా నుండి
(నెపోలియన్ బోనపార్టె నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


నెపోలియన్
Portrait of Napoleon in his forties, in high-ranking white and dark blue military dress uniform. In the original image He stands amid rich 18th-century furniture laden with papers, and gazes at the viewer. His hair is Brutus style, cropped close but with a short fringe in front, and his right hand is tucked in his waistcoat.
The Emperor Napoleon in His Study at the Tuileries
(by Jacques-Louis David, 1812)
పరిపాలనా కాలం 18 మే 1804 – 6 ఎప్రిల్ 1814
ఫ్రాన్స్ దేశ మొదటి కౌన్సిల్,చక్రవర్తి {{{Coronation}}}
తర్వాతివారు లూయిస్ XVIII
ముందువారు లూయిస్ XVIII
జీవిత భాగస్వామి మూస:జోసెఫిన్ డి బౌహర్నైస్
మేరీ లూయిస్ (వి. 2018)
సంతతి
నెపోలియన్II
పూర్తి పేరు
నెపోలియన్ బోనపార్టీ
తండ్రి కార్లో బోనపార్టీ
తల్లి లెటిజియా రామోలినో
జననం (1769-08-15)15 ఆగస్టు 1769
కోర్సికా, ఫ్రాన్స్
మరణం 5 మే 1821(1821-05-05) (వయసు 51)
సెయింట్ హెలీనా
ఖననం పారిస్, ఫ్రాన్స్
సంతకం
మతం see religion section
Imperial coat of arms

నెపోలియన్ బోనపార్టీ (ఆగష్టు 15, 1769 - మే 5, 1821) ఫ్రాన్స్ కు చెందిన సైన్యాధ్యక్షుడు మరియు రాజకీయ నాయకుడు. ఐరోపా చరిత్రపై బలమైన ముద్ర వేశాడు.

జననం[మార్చు]

నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియా లో , ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు.నెపోలియన్, పారిస్ లో చదువుకున్నాడు. అతనికి చరిత్ర, రాజనీతి శాస్త్రము,గణితం,తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద రూసో ప్రభావం అధికంగా వుండేది.1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్ గా నియమితుడయ్యాడు.

సైనిక జీవితం[మార్చు]

1792 లో ఫ్రెంచి విప్లవం జరుగుతున్న రోజుల్లో నెపోలియన్, విప్లవాత్మకమయిన అరాచకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు.ఫ్రెంచి విప్లవాన్ని అంతం చేయడానికి యూరోపియన్ దేశాలు చేసిని ప్రయత్నాల్లో భాగంగా 1793 వ సంవత్సరంలో నౌకదళం టేలర్ను పట్టుకొవడానికి ఆంగ్ల నౌకాదళం ఫ్రాన్స్ మీద దాడి చేసింది.నెపోలియన్ వారిని సమర్దవంతంగా నిలవరించాడు. ఈ విజయం తరువాత అతనిని బ్రిగేడియర్ జనరల్ గా పదొన్నతిని కల్పించారు.1795 అక్టోబరు లో ఫ్రాన్స్ ప్రజలు జాతీయ సమావేశానికి కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, విప్లవ,రాజరిక వాదుల నుండీ రాజ్యాంగమును రక్షించుటలో మరొకసారి విజయం సాధించాడు. నెపోలియన్ సాధించిన ఈ విజయం వల్ల అతనిని సైనికాధిపతి గా నియమించారు.

సైనికాధిపతిగా నెపోలియన్ విజయాలు[మార్చు]

నెపోలియన్ ఆస్ట్రియా,ఇటలీ (సార్డీనియా) దేశాలమీద దాడిచేసి విజయం సాధించాడు. నెపోలియన్ ఇటలీ మీద చేసిన దాడి ఇటలీ కూడా ఫలఫ్రదం గా ఉపయోగపడింది. అప్పటివరుకు అనేక ప్రాంతాలుగా విడివడి వున్న ఇటలీ లో రాజకీయపుర్వకమయిన ఐక్యత లోపించివుండింది. అయితే, నెపోలియన్ తన సంస్కరణలతో ఇటలీ రిపబ్లిక్ ను ఎర్పాటుచేసాడు. ఆ పద్దతిలో ఇటలీ లో జాతీయవాదాన్ని ప్రేరేపించాడు. ఆస్ట్రీయా, ఇటలీ (సార్డీనియా) యుద్దాలు నెపోలియన్ యొక్క వ్యక్తిగత ఘనతను పెంచాయి.నెపోలియన్ యొక్క అద్భుతవిజయాల వల్ల అతనిని ఫ్రెంచి ప్రజలు గొప్పనాయకుడిగాను గౌరవించారు. ఫ్రాన్స్ యొక్క శత్రువయిన ఇంగ్లాండు ను ఓడించాడానికి సిద్దపరిచిన సైన్యానికి నెపోలియన్ ను అధిపతి గా డైరెక్టరీ నియమించింది. విస్తృతమయిన నౌకబలం లేకుండా ఇంగ్లాండు ఓడించడం కష్టమని, ఇంగ్లాండు కు కీలకమయిన ఈజిప్టు మీద 1798 మే లో దాడిచేసాడు. పిరమిడ్ యుద్దంలో విజయం సాధించినప్పటికి , ఇంగ్లాండు నౌకధిపతి నెల్సన్ చేతిలో పరాజయం చెందాడు. నెపోలియన్ ఫ్రాన్స్ కు తిరిగివచ్చాడు. ఆ సమయంలో ఫ్రాన్స్ ను 5 సభ్యులతో కూడిన డైరెక్టరీ పాలకమండలి పరిపాలించేది. ఈ పాలకమండలి లో ఐక్య కొరవడింది. శక్తివంతమయిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటలో విఫలం చెందింది. డైరెక్టర్ల మధ్య కాని , డైరెక్టరీ కిఅ శాశనసభ కు మధ్య కాని సరిగా సంబంధాలు లేవు. తగాదాలు, కుట్రలతో పాటుగా సాంఘీక ఆర్ధిక అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. డైరెక్టరీ విధానం ప్రజల మద్దతును పొందలేకపోయింది. ఫ్రాన్స్ యొక్క అంతరంగిక పరిస్థితి దెబ్బతింది. ఖర్చు మితిమీరిపొయింది. ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు. పటిష్టమయిన , సమర్దవంతమయిన పరిపాలన కోసం ఎదురుచూశారు. అదే సమయానికి నెపోలియన్ ఫ్రాన్స్ చేరి సైన్యం తో పాటు శాశనసభ లోకి ప్రవేశించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నడు. నెపోలియన్ అధికారాన్ని చేపట్టిన తరువాత, కాన్సులేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసాడు. ఈ ప్రభుత్వం 1799-1804 ల మధ్య కొనసాగింది.

మొదటి కౌన్సిల్ గా నెపోలియన్ సంస్కరణలు[మార్చు]

నెపోలియన్ ఫ్రాన్స్ కు వ్యతిరేకంగా వున్న ఇంగ్లాండు,ఆస్ట్రియా దేశాలతో సంధులు కుదుర్చుకొని యుద్దాలనుండి ఫ్రాన్స్ ను కాపాడి శాంతి ఏర్పరిచాడు.అనంతరం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని పునర్మించడానికి తన కాలాన్ని వినియోగించాడు. ప్రజల మధ్య సాంఘీక, ఆర్దిక సమానత్వాన్ని కల్పించుటకు ప్రయత్నించాడు. కాని స్వేచ్చ సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. నెపోలియన్ దృష్టీ లో "ఫ్రాన్స్ ప్రజలకు కావలిసినది సమానత్వం కాని స్వేచ్చ కాదు". దేశ శాంతిభద్రతల కోసం బలమయిన కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయుటకు ప్రయత్నించాడు.

సంస్కరణలు[మార్చు]

మత సంస్కరణలు[మార్చు]

"ప్రజలకు కావలిసినది మతం, కాని ఆ మతం ప్రభుత్వ ఆధినంలో వుండాలి" విప్లవకాలంలో రూపొందించిన రాజ్యాంగం కారణంగా సమాజంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుందని గ్రహించి రోమన్ కేథలిక్ చర్చి యొక్క మతాధికారి అయిన పోప్ తో ఒప్పందం కుదుర్చుకొని ఫ్రాన్స్ లో మతాచార్యుల నిర్వాహణ భాద్యతలను నెపోలియన్ స్వీకరించాడు. చర్చి ఆస్తులను ప్రభుత్వం స్వాధినపరుచుకొనుటకు పోప్ అంగీకరించాడు. మతాచార్యులను ప్రభుత్వం నియమిస్తే వారిని పోప్ అనుమతిస్తాడు. వారంతా ప్రభుత్వానికి విధేయత ప్రకటించాలి.

న్యాయ సంస్కరణలు[మార్చు]

ఫ్రెంచి విప్లవం కు మునుపు ఫ్రాన్స్ లో నిర్ణీత న్యాయవ్యవస్థ లేదు. విభిన్న న్యాయవిధానములు అమలులో ఉండేవి. నెపోలియన్ విటన్నింటిని క్రోడికరించి, ప్రఖ్యాత న్యాయవేత్తల సహాయంతో నెపోలియన్ న్యాయస్మృతిని రూపొందించాడు. దీనిని సివిల్,క్రిమినల్, వాణిజ్య స్మృతులుగా విభజించారు. నెపోలియన్ రూపొందించిన న్యాయస్మృతి వల్ల ప్రజలకు స్థిరమయిన, క్రమమయిన న్యాయం లభించుటకేగాక, త్వరగాను,తక్కువ ఖర్చుతోనూ, విశ్వాసపాత్రమయినదిగాను లభించింది.

ఆర్ధిక సంస్కరణలు[మార్చు]

ఫ్రెంచి విప్లవం సంభవించుటకు ఆర్ధిక సమస్య ముఖ్యకారణమని నెపోలియన్ గుర్తించాడు.ఫ్రాన్స్ దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుటకు ప్రయత్నించాడు. దేశ మొత్తానికి క్రమబద్ధమయిన శిస్తు వసులు చేయు విధానాన్ని ప్రవేశపెట్టి,అవినీతి ఉద్యోగులను కఠినంగా శిక్షించాడు.వ్యయం లో దుబారా తగ్గించాడు. దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించాడు. నదులమీద ఆనకట్టలు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసాడు. 1800 వ సంవత్సరం లో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ను స్థాపించాడు. నాణాల చెలమణీని క్రమబద్దం చేసాడు.

నెపోలియన్ చక్రవర్తి అగుట[మార్చు]

మొదటి కౌన్సిల్ గా అధికారం చేపట్టిన తరువాత నెపోలియన్ తన స్థానమును భద్రపరచుకొనుటకు వీలుగా అనేక చర్యలు చేపట్టాడు.క్రమక్రమంగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.డిసెంబరు2, 1804 న పోప్ చేత నెపోలియన్ చక్రవర్తి గా పట్టాభిషక్తుడైనాడు. ఫ్రాన్స్ లో తిరిగి రాజరికం పునరుద్దరింబడినప్పటికీ,ఫ్రెంచి విప్లవ ఫలితాలు ప్రజలకు అందించబడినవి.

చక్రవర్తి గా నెపోలియన్ సైనిక విజయాలు[మార్చు]

ఫ్రాన్స్ చక్రవర్తిగా నెపోలియన్ పట్టాభిషక్తుడైన తరువాత తన విజయవంతమయిన దాడుల ద్వారా ఐరోపా చిత్రపటమును తిరిగి గీయించాడు. ఇంగ్లాండును అణచివేయడానికి అనేకమార్లు ప్రయత్నించాడు. పరోక్ష యుద్దంలో ఇంగ్లాండు ను ఓడించడానికి ప్రసిద్ద ఖండాంతర విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానం ద్వారా ఇంగ్లాండు వర్తకాలను ధ్వంసం చేయాలని భావించాడు. తమ ఓడరేవులలో ఇంగ్లాండు ఓడల ప్రవేశాన్ని నిషేధించమని తన సామంత రాజ్యాలను కోరాడు.ఫలితంగా వివిధ రకాల వస్తువుల ధరలు పేరిగిపోయాయి. పేద ప్రజలు తమ నిత్యావసరాలకు కూడా కష్టాలను ఎదుర్కోవలసివచ్చింది. అందువల్ల ప్రజలు తమ కష్టాలకు నెపోలియన్ కారకుడిగా భావించి నిందించడం ప్రారంభించారు. తన ఖండాంతర విధానాన్ని సమర్ధవంతంగా అమలుపరచడానికి రష్యా,పోర్చుగల్, స్పెయిన్ దేశాలమీద యుద్దాలు ప్రకటించవలసి వచ్చింది. ఈ విధాన్నాన్ని విజయవంతం చేయడానికి అతడు చేప్పట్టిన చర్యలన్ని అతని పతనానికి కారణం అయ్యాయి. నెపోలియన్ ను అణచివేయడానికి ఇతర ఐరోపా దేశాలన్ని కూటమిగా ఏర్పడటం ద్వారా ప్రయత్నాలు చేసాయి.స్వీడన్,రష్యా,ఆస్ట్రియా లతో అప్పటి ఇంగ్లాండు ప్రధానమంత్రి పిట్ ఒక నూతన కూటమిని ఏర్పరిచాడు. ఈ విధంగా ఫ్రాన్స్ వ్యతిరేకంగా మూడవ కూటమి ఏర్పడింది. కూటమి విషయం తెలిసిన వెంటనే నెపోలియన్ ఆస్ట్రియా మీదకు సైన్యాలను పంపించి ఆస్టర్ విడ్జీ వద్ద రష్యా, ఆస్ట్రియా సైన్యాల మీద ఘనవిజయం సాధించాడు. ఈ యుద్దం తో మూడవ కూటమి విచ్చిన మగుటయే కాక ఆస్ట్రియా అవమానకరమైన ప్రెస్ బర్గ్ సంధికి అంగీకరించవసివచ్చింది. ఈ సంధి తో నెపోలియన్ ఖ్యాతి మరింత విస్తరించింది. ఈ యుద్ద విజయం తరువాత నెపోలియన్ తన దృష్టిని రష్యా మీద నిలిపి 1807 లో ఫ్రీడ్ లాండ్ యుద్దంలో రష్యన్ సైన్యాలపై గప్ప విజయం సాధించి, నాటి రష్యా చక్రవర్తి జార్ తో టిల్ సిట్ సంధి కుదుర్చుకున్నాడు. ఈ సంధి అనంతరం నెపోలియన్ రాజ్యం గణనీయముగా అభివృద్ధి చెందింది. ఖండాంతర విధానాన్ని వ్యతిరేకించిన కారణంగా నెపోలియన్ తన సోదరుడైన లూయి నెపోలియన్ ను హాలెండ్ రాజ్య సింహాసనం నుండి తిలగించి హాలెండ్ ను స్వాధీనం చేసుకున్నాడు.ఉత్తర జర్మనీ లో బాల్టిక్ సముద్రం వరకు గల విశాల ప్రాంతాన్ని ఆక్రమించాడు.స్పెయిన్,ఫ్రాన్స్ కు సామంత రాజ్యంగా కుదించబడింది. స్పెయిన్ పాలకునిగా నెపోలియన్ సోదరుడు జోసఫ్ నియమింపబడినాడు.పోర్చుగల్ కూడా స్పెయిన్ ను అనుసరించింది. ఆస్ట్రియా కూడా బలహీనంగా మారింది.జర్మనీ కూడా ఫ్రాన్స్ కు లోబడివుండు విధంగా రైన్ సమఖ్య ను ఏర్పాటుచేసి తాను దానికి సంరక్షకుడిగా తన అధికారాన్ని స్థాపించాడు. ఈ విధంగా నెపోలియన్ యూరప్ మొత్తానికి అధిపతి అయినాడు. ఫ్రాన్స్, యూరప్ కు రాజకీయ రాజధాని అయింది.

పతనం[మార్చు]

1808 నాటికి నెపోలియన్ యొక్క అధికారం ఫ్రాన్స్ లోనే గాక యూరప్ మొత్తానికి విస్తరించింది.నాటి యూరప్ రాజ్యాలన్ని నెపోలియన్ పట్ల భయం తో కూడిన గౌరవాన్ని ప్రదర్శించాయి.ఆ తరువాత అతికొద్ది కాలంలోనే నెపోలియన్ పతనం ఆరంభమయింది.

భూఖండ విధాన వైఫల్యం[మార్చు]

ఇంగ్లాండు అధికారాన్ని ,ఐశ్వర్యాన్ని ధ్వంసం చేయలంటే భూఖండ విధానాన్ని అన్ని వేళల,అన్ని చోట్ల అమలుచేయాలి.ఇంగ్లాండు సరుకులు ఐరోపా చేరకుండా గస్తీ ఏర్పరిచాలి.ఈ విధానం అమలులో ఎటువంటి అలసత్వం కనిపించిన ఇంగ్లాండు ను ఆర్ధికంగా ఇబ్బంది కలిగించలేడు.దీని ఫలితంగా ఇతర దేశాల మీద దురాక్రమణలు చేయవసివచ్చింది.

పోర్చుగల్,స్పెయిన్ లతో యుద్దము[మార్చు]

భూఖండ విధాన అమలులో నెపోలియన్ పోర్చుగల్,స్పెయిన్ లతో వినాశకమైన యుద్దము చేయవలసి వచ్చింది.పోర్చుగల్ కు మొదటినుండి ఇంగ్లాండు తో గల రాజకీయ,ఆర్దిక సంబంధాల వల్ల భూఖండ విధానమును వ్యతిరేకించింది.ఆ కారణంగా నెపోలియన్ పోర్చుగల్ను జయించి స్పెయిన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.పోర్చుగల్ ఆక్రమణ సందర్బంగా నెపోలియన్ తన సైన్యాలను స్పెయిన్ లో ప్రవేశపెట్టాడు.స్పెయిన్ యొక్క రాజు బలహీనతను గుర్తించి స్పెయిన్ ఆక్రమణ కొరకు ప్రయత్నాలు చేసి దానిని జయించి,తన సోదరుడైన జోసఫ్ ను స్పెయిన్ రాజుగా ప్రకటించాడు.స్పెయిన్ లో ఫ్రాన్స్ అధికారానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. వీటిని అణచుటకు నెపోలియన్ తన సైన్యాన్ని అధికంగా వినియోగించవసివచ్చింది.అయినా వైఫల్యం తప్పలేదు.సముద్రాదిపత్యం లేకపోవడం కూడా నెపోలియన్ పతనానికి కారణం అయింది.

జాతీయతా భావ అవిర్భావం[మార్చు]

జాతీయతా భావం ఫ్రెంచి విప్లవం నుండి ఐరోపా అంతటికి విస్తరించింది. నెపోలియన్ ఈ జాతీయతా భావాన్ని నిరోధించలేకపోయాడు.మేధావులు,కవులు,వేదాంతులు,అధ్యాపకులు జాతీయ తత్వ ప్రేరణ కు నిరంతర కృషి సలిపారు.జాతీయ అవమానపు లోతులనుండి ఓ చైతన్య భావము ఆవిద్భవించి ప్రతికార సమయం కోసం వేచివున్నది.

రష్యా దండయాత్ర[మార్చు]

1807 లో రష్యా ను ఫ్రాన్స్ ఓడించగా జరిగిన తిల్ సిట్ సంధి 5 సంవత్సారాలపాటు కొనసాగినప్పటికి ఈ రెండు రాజ్యాల మద్య అనేక అభిప్రాయ బేధాలు ఏర్పడినవి.నెపోలియన్ భూఖండ విధానము రష్యా కు తీవ్ర నష్టం కలిగించింది.ఈ కారణాల వల్ల రష్యా,ఫ్రాన్స్ ల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.భూఖండ విధానమును బలవంతముగా అమలుజరుపుటకు నెపోలియన్ ఆరు లక్షల సైస్యముతో రష్యా మీద దాడి చేసాడు.రష్యా సైన్యాలు ఎదురునిలువకుండా తిరోగమిస్తు గ్రామాలను పంటలను శత్రువుల వశం కాకుండా పాడు చేసారు.అనేక వ్యయ ప్రయాసలకొనర్చి నెపోలియన్ సైన్యం మాస్కో చేరింది.రష్యా సంధి కి వస్తుందని నెపోలియన్ భావించి,కొన్ని వారాలపాటు అక్కడే వేచి వున్న ప్రయోజనము లేక సైన్యాన్ని వెనక్కి రమ్మని ఆదేశించాడు.అయితే తీవ్రమయిన చలి,ఆహార పదార్దాల కొరత,రష్యా సైన్యాల గెరిల్లా దాడుల వల్ల నెపోలియన్ సైన్యాలు తీవ్రంగా నష్టపోయాయి.

బాటిల్ ఆఫ్ నేషన్[మార్చు]

రష్యా,ఆస్ట్రియా,ప్రష్యా దేశాలు కలిసి సంయుక్త సైనిక శక్తిని రూపొందించాయి.వీటికి ఇంగ్లాండు ఆర్ధికసహాయమును అందించింది.1813 లో నెపోలియన్ సేనలకు,సంయుక్త సైన్యాలకు మద్య లిప్ జిగ్ వద్ద యుద్దం జరిగింది. ఈ యుద్దంలో నెపోలియన్ సేనలు అధ్బుతంగా పోరాడినప్పటికి ఘోరంగా ఓడింపబడినాడు.నెపోలియన్ చక్రవర్తి బిరుదుతో ఎల్బా అను చిన్న దీవికి పాలకునిగా పంపివేశారు.ఫ్రాన్స్ కు లూయి 18 ని రాజుగా నియమించారు.

100 రోజుల నెపోలియన్ పాలన[మార్చు]

నెపోలియన్ తరువాత ఫ్రాన్స్ కు రాజైన లూయి 18తన తెలివి తక్కువ పనుల వల్ల అనతికాలంలో నే ప్రజ విశ్వాసాన్ని కోల్పోయాడు.విజేతలైన రాజ్యాలు భుభాగాల పంపకం లో కలహించుకోవడం ఆరంభించాయి.దీన్ని అవకాశంగా తీసుకొని నెపోలియన్ ఎల్బా నుండి తప్పించుకొని పారిస్,1815 మార్చి 1 చేరుకున్నాడు.వెంటనే లూయి 18 ఫ్రాన్స్ వదిలి పారిపోయాడు.నెపోలియన్ తననుతాను తిరిగి రాజుగా ప్రకటించుకున్నాడు.కాని ఇది 100 రూజులు మాత్రమే కొనసాగింది.మరలా ఐరోపా రాజ్యాలు అన్ని తిరిగి ఒక్కటై నెపోలియన్ తో వాటర్లు యుద్దం లో తలపడ్డాయి.ఈ యుద్దంలో నెపోలియన్ ఓడి సెయింట్ హెలినా అను దీవికి పంపబడినాడు.

మరణం[మార్చు]

సెయింట్ హెలినా అను దీవిలో అతనిపై అనేక నిర్భందాలు విధింపబడ్డాయి.కాన్సర్ వ్యాదితో భాదపడుతూ నెపోలియన్ తన 52వ ఏట మరణించాడు.నెపోలియన్ మృతదేహమును సెయింట్ హెలినా దీవిలో సమాధి చేసినప్పటికి తిరిగి అక్కడినుండి తీసుకువచ్చి పారిస్ లో ఖననం చేసారు

మూలాలు[మార్చు]

Biographical studies[మార్చు]

Primary sources[మార్చు]

Specialty studies[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నెపోలియన్&oldid=2355724" నుండి వెలికితీశారు