పి.అంకమ్మ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

న్యాయమూర్తి జస్టిస్ పి.అంకమ్మ చౌదరి. హేతువాది, మానవతావాది.మానవతా విలువలున్న న్యాయమూర్తి .గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సాయపాలెంలో జన్మించారు. అనారోగ్యంగా ఉన్నా పెద్ద వయసులోనూ ఇటీవల ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లారు.. బతికినంతకాలం స్వయం నిర్ణయాధికారం గురించి సైద్ధాంతిక సూత్రాలను వివరించి చరిత్ర సంఘటనలతో రంగరించి తెలియజెప్పారు. స్వయంపాలనాధికారం కోసం జనం పోరాటాన్ని సమర్థించే వారు.స్వయం పాలన సూత్రాన్ని ఆధారం చేసుకుని ఒక ప్రాంతంలోని తెలివైన వారు మరొక ప్రాంతంలోని అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వనరులను వాడుకోవడం న్యాయం కాదనే సార్వజనిక న్యాయసూత్రాన్ని వివరించారు. కుల, మత, ప్రాంత, యాస, ఆర్థిక దోపిడీ వాదాల ఆధారంగా మరొక ప్రాంతాన్ని వాడుకో చూసే వారికి జస్టిస్ చౌదరి మాట ఓ పాఠం, గుణపాఠం. రాజ్యాంగసూత్రం, ధర్మనియమం, ( మే 18 2014 /18.5.2014 న హైదరాబాదులో మరణించారు.

== మంచి తీర్పరి ==.

  • భార్యలంటే ఆస్తీ పాస్తీ కాదు. భార్యలూ మనుషులే.నన్ను పెళ్ళి చేసుకున్నావు కనుక నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు పడకెక్కాలని భార్యను బలవంతం చేసే హక్కు భర్తకు ఇవ్వడం ఎక్కడి న్యాయం?

విడాకుల కోసం కోర్టులో పోరాడుతున్న భార్యను బలవంతంగా అనుభవించడం నేరం కాదన్న తీర్పుకు వ్యతిరేకంగా ఆనాడే గొప్ప తీర్పు చెప్పిన న్యాయమూర్తి .

  • రాజ్యాంగానికి సంబంధించి ఆయన రాయని అంశం లేదు. ఓ వంద దండల పెళ్ళిళ్లు చేసిన యువకుడాయన. మహిళలకు ఆస్తిలో సమానహక్కులు ఇవ్వడం ద్వారా మాత్రమే వరకట్న నేరాలను పరిష్కరించవచ్చని ఆయన వాదించే వారు. సమానత ఆయనకు ప్రాణప్రథమైన సిద్ధాంతం.