సెప్టెంబర్ 1
స్వరూపం
సెప్టెంబర్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 244వ రోజు (లీపు సంవత్సరములో 245వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 121 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.
- 1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది.
- 1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా లోని జకర్తా లో ప్రారంభమైనది.
- 1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
- 2006: పద్దెనిమిదవ లా కమిషన్ ను, (ఆర్డర్ నంబర్ A.45012/1/2006-Admn.III) తేది 2006 సెప్టెంబర్ 1 న ఏర్పాటు చేసారు. ఇది 2009 ఆగష్టు 31 వరకు అమలులో ఉంటుంది. 2007 మే 28 వరకు జస్టిస్ ఎమ్. జగన్నాధరావు అధ్యక్షుడు. ఆ తరువాత ఎ.ఆర్. లక్ష్మణన్ ను నియమించారు.
- 2008: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు.
- 2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
జననాలు
[మార్చు]- 1945: గుళ్ళపల్లి నాగేశ్వరరావు, నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- 1947: పి.ఎ.సంగ్మా, భారతదేశ లోక్ సభ మాజీ సభాపతి. (మ.2016)
- 1950: టీ.కృష్ణ, తెలుగు సినీ దర్శకుడు .(మ.1986)
- 1973: రామ్ కపూర్, భారతీయ టెలివిజన్ నటుడు.
- 1975: యశస్వి, కవిసంగమం కవి.
- 1985: ముమైత్ ఖాన్ , తెలుగు,తమిళ ,హిందీ, కన్నడ, నటి.మోడల్, ఐటెం సాంగ్ లోగుర్తింపు.
మరణాలు
[మార్చు]- 1904: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (జ.1860)
- 1990: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (జ.1914)
- 1992: ఎస్.వి.జోగారావు, సాహిత్యవేత్త. (జ.1928)
- 2002: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (జ.1929)
- 2020: మాతంగి నర్సయ్య, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి.
స్థాపనలు
[మార్చు]- 1901: శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, తెలంగాణలో మొదటి గ్రంథాలయం
- 1956: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- * - ఎల్.ఐ.సి. ఫార్మేషన్ డే
- * - ఉజ్బేకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం
- పోషక పదార్థాల వారోత్సవం
- ప్రపంచ కొబ్బరి దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-03-09 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 2 - ఆగష్టు 31 - ఆగష్టు 1 - అక్టోబర్ 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |