పూండ్ల రామకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూండ్ల రామకృష్ణయ్య

పూండ్ల రామకృష్ణయ్య(జూలై 14, 1860 - 1904) ప్రముఖ పండితుడు, విమర్శకుడు. అముద్రిత గ్రంథ చింతామణి అనే తెలుగు మాసపత్రికను నెల్లూరు నుండి వెలువరించాడు. తాళపత్రాల రూపంలో ఉన్న తెలుగు ప్రబంధలను సేకరించి పరిష్కరించి ప్రచురించడంకోసమే ఈ పత్రికను నిర్వహించాడు. దాదాపు ఇరవై ప్రాచీన పద్యరచనలు ఆయన కృషివల్ల వెలుగులోకి వచ్చాయి. కొందరు సంపన్నులు,జమీందార్లు ఈ పత్రిక పోషకులు. రామకృష్ణయ్య గ్రాంథికభాషావాది. వేదం వేంకటరాయశాస్త్రి, మండపాక పార్వతీశ్వరకవి, కొక్కొండ వెంకటరత్నం పంతులు వంటి ఆనాటి ప్రసిద్ధపండితుల రతనలు ఈయన పత్రికలలో ప్రచురించబడ్డవి. అముద్రిత గ్రంథచింతామణి సాటి సాహిత్య పత్రికలతో సాహిత్య విషయాలపై వాదవివాదాలు జరిపింది. మూడు సంవత్సరాలు నడిచిన తర్వాత అముద్రితగ్రంథచింతామణి ఆర్థిక కారణాలవల్ల సంపాదకుల అనారోగ్యంతో, ఆయన కోర్ట్ వ్యాజ్యాలవల్ల కొంతకాలం నిలిచింది. ధర్మవరం రామకృష్ణ మాచారి,మండపాక వంటి పండితులు ఒకవైపు, వేదం వెంకరాయశాస్త్రి, రామకృష్ణయ్య మొదలైన వారు ఒకవర్గంగా ఉండి సాహిత్య వాదవివాదాలు కొనసాగించారు. ఈ వాగ్జన్యాలకు ఆన పత్రికల.వేదికైంది. పూఃడ్ల రామకృష్ణయ్య1904 సెప్టెంబరు 4వతేది పక్షవాతం తో జబ్బపడి 46వ యేట మరణించారు. జీవితమంతా సాహిత్య సేవలో గడిపిన ధన్యజీవి.

  ఆనాటి అనేక తెలుగు పత్రికల పేర్లు తప్ప ఆపత్రికలు లభించడం లేదు. అముద్రితగ్రంథచింతామణి సంచికలు మాత్రం ఈనాటికీ అనేక గ్రంథాలయాల్లొ భద్రపరచబడి ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్యపరిశోధనిసంస్థ, హైదరాబాదు వారు అముద్రితగ్రంథచింతామణి సంపుటాలనుంచి ఎంపిక చేసిన రచనలను "అలనాటి సాహిత్య విమర్శ" పేరుతో 2008లో ఒక పుస్తకం ప్రచురించారు. 
"పూండ్ల రామకృష్ణయ్య అముద్రితగ్రంథచింతామణి-ఆనాటి సాహిత్య దృక్పథాలు" అనే విషయం మీద పరిశోధించి, సిద్ధాంతవ్యాసం సమర్పించినందుకు శ్రీ మాచవోలు శివరామప్రసాద్ గారికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పి.హెచ్.డి ప్రదానంచేసింది. 
2019లో డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ రామకృష్ణయ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సేకరించి"పూండ్ల రామకృష్ణయ్య సాహిత్యలేఖలు" పేరుతో ఒక పుస్తకం వెలువరించారు.
 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, ఇతర సంస్థలు రామకృష్ణయ్య ప్రచురణలకు పునర్ముద్రణలను తెచ్చాయి. శతాబ్దకాలం దాటిపోయినా ఆయన సాహిత్యసేవను తెలుగు వారు గుర్తుంచుకొన్నారు.       
 ఆకరాలు. Sources:
1అముద్రితగ్రంథచింతామణి సంపుటాలనుంచి సేకరించిన విషయాలు.
2.రామకృష్ణయ్య ప్రచురణలు.
3.సమకాలీన పత్రికలలో సమాచారం
4. ఈ రచయిత సేకరించిన మౌఖికచరిత్ర.
5 డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ పి.హెచ్.డి పరిశోధన గ్రంథం.
6. ఒంగోలు వెంకటరంగయ్య "కొందరు నెల్లూరు గొప్పవారు సంపుటాలు
7.తెలుగు భాషాసమితి ప్రచురణ సంస్ర్కుతి మూడోసంపుటం.
 నెల్లూరులోని ఆనాటి ఇతరపత్రికలు.

జీవిత విశేషాలు

[మార్చు]

రామకృష్ణయ్య జూలై 14, 1860 (రౌద్రి నామ సంవత్సర ఆషాఢ బహుళ ద్వాదశి)న నెల్లూరు జిల్లాలోని దువ్వూరు లో జన్మించాడు[1].

రచనా వ్యాసంగం

[మార్చు]

అముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రికను రామకృష్ణయ్య 1885లో ఒడయారు వీరనాగయ్య సహాయ సంపాదకతతో ప్రారంభించాడు. 1888లో వీరనాగయ్య తప్పుకొనగా శ్రీ వేంకటగిరి రాజా గోపాలకృష్ణ యాచేంద్ర దీనికి పోషకుడిగా ఉన్నాడు. ఆయన సహాయంతో రామకృష్ణయ్య ఈ పత్రికను 1904లో నిర్యాణం వరకు విభిన్న రీతుల్లో కొనసాగించాడు.

అప్పటి విమర్శనా పత్రికల్లో ఈ పత్రిక బాగా పేరుగాంచినది. రామకృష్ణయ్య ఈ పత్రిక ద్వారా ప్రాచీన గ్రంథాలు ప్రచురించాడు.మండపాక పార్వతీశ్వరశాస్త్రి, వేదము వేంకటరాయశాస్త్రి ప్రభృతుల పాండిత్య ప్రకర్ష ఈ పత్రిక ద్వారానే వెలుగుచూపినది.

అముద్రిత గ్రంథ చింతామణి

[మార్చు]
అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక ముఖచిత్రం

నెల్లూరు జిల్లా గెజిట్ తరువాత ఇప్పుడు లభ్యమయ్యే నెల్లూరు ప్రాచీన పత్రిక ’అముద్రిత గ్రంథ చింతామణి’. 19వ శతాబ్ద చివరిపాదంలో ఆంధ్రదేశంలో సాగిన భాషాకృషికి, సారస్వత వ్యాసంగానికి, చెలరేగిన పండిత వివాదాలకూ అముద్రిత గ్రంథ చింతామణి నిలువుటద్దం. అప్పటి విమర్శనాపద్ధతులకు, సాహిత్యసంప్రదాయాలకూ ఇది ఒక సజీవసాక్ష్యం. ఆనాటి సాహితీపరులంతా ఏదో ఒక విధంగా ఈ పత్రికా సంపాదకులతో సంబంధం ఉన్నవాళ్ళే. ఆముద్రిత గ్రంథ చింతమణి దాదాపు రెండు దశాబ్దాలపాటు జీవించింది. ఈపత్రిక సంపాదకులు పుండ్ల రామకృష్ణయ్య.ఆయన దీని నిర్వహణ తన జీవితాశయంగా భావించారు. తన 23వ ఏట పత్రిక ప్రారంభించి, చనిపోయేరోజువరకు పత్రిక కొనసాగిస్తూ వచ్చారు. [2],[3]


తొలి నాలుగుపుటలలో వ్యాకరణాది శాస్త్ర విచారం. గ్రంథవిమర్శ, సమస్యాపూరణం, వసుచరిత్ర,మనుచరిత్ర వంటి ప్రాచీన ప్రబంధాలలోని కఠిన పద్యాలకు అర్థనిరూపణ, భిన్నప్రతులలోని పాఠాంతరాలను చర్చించి కవి హృదయాన్ని ఆవిష్కరించడం, లక్షణ విరుద్ధమైన రచనలమీద ఆక్షేపణలతో పాటు పద్యాల ప్రచురణ, విద్యావిషయకమైన లేఖలుండేవి. తక్కిన పుటలను అముద్రిత గ్రంథాలను పరిష్కరించి ప్రకటించడానికి కేటాయించేవారు. నిరాదరణతో నశించిపోతున్న తాళపత్ర గ్రంథాలను సేకరించి ప్రచురించడం అముద్రిత గ్రంథ చింతామణి ప్రధానాశయం. వేదం వెంకటరాయశాస్త్రి, మండపాక పార్వతీశ్వరశాస్త్రి వంటి వారి కీర్తి దశదిశలా వ్యాప్తి చెందేందుకు అముద్రిత గ్రంథ చింతామణి గొప్ప సాధనం అయింది.[4]

మరణం

[మార్చు]

ఇతడు 1904 సెప్టెంబరు 1వ తేదీన మరణించాడు[1].

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 అడవి శంకరరావు (1 November 1931). "పూండ్ల రామకృష్ణయ్య గారు". భారతి. 8 (11): 761–762. Retrieved 23 May 2020.[permanent dead link]
 2. "పుస్తకం.కాం నుండి అముదిర్య గ్రంథ చింతామణి". Archived from the original on 2013-07-22. Retrieved 2014-04-16.
 3. వేదం వెంకటరాయశాస్త్రి జీవిత చరిత్ర[permanent dead link]
 4. "పుస్తకం.కాం నుండి అముద్రిత గ్రంథ చింతామణి". Archived from the original on 2013-07-22. Retrieved 2014-04-16.

ఇతర లింకులు

[మార్చు]