Jump to content

మాతంగి నర్సయ్య

వికీపీడియా నుండి
మాతంగి నర్సయ్య
మాతంగి నర్సయ్య

మాతంగి నర్సయ్య


మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి
నియోజకవర్గం మేడారం (1983 - 1994, 1999 -2004)

వ్యక్తిగత వివరాలు

మరణం సెప్టెంబరు 1, 2020
హైదరాబాదు
రాజకీయ పార్టీ తెలుగుదేశం (1982 - 2014)
కాంగ్రెస్ పార్టీ (2014 - 2020)
జీవిత భాగస్వామి జోజమ్మ
నివాసం కాకతీయగనర్‌, గోదావరిఖని
మతం హిందూ

మాతంగి నర్సయ్య తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983,[1] 1989,[2] 1999 [3] లలో మేడారం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో నెలరోజుల పాటు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశాడు.

జీవిత విషయాలు

[మార్చు]

నర్సయ్య కరీంనగర్ జిల్లా, గోదావరిఖనిలో జన్మించాడు. ఎల్.ఎల్.బి. పూర్తిచేసి, బ్యాంక్‌ క్యాషియర్‌గా పనిచేశాడు.

రాజకీయ ప్రస్థనం

[మార్చు]

నర్సయ్య కరీంనగర్‌ జిల్లా మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 1983లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి జి. ఈశ్వర్ పై 14608 ఓట్ల ఆధిక్యంతో ఎన్నికై, నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రి నెలరోజులు సంక్షేమ మంత్రిగా పనిచేశాడు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి టిడిపి అభ్యర్థి మాలెం మల్లేశంపై 3,110 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. 1999లో మళ్ళీ టీడీపీ తరపున పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై 28928 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. 2004, 2009లో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా పోటీచేసి ఓడిపోయాడు.[4] ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయిన అనంతరం టీడీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు.[5]

ఇతర వివరాలు

[మార్చు]

ఎస్సీల్లో మాదిగలు, ఉప కులాలకు హక్కులకోసం అరుంధతి మహాసభ పేరిట ఆందోళనలు చేపట్టాడు. అఖిల భారత గుడిసె (హట్స్‌)ల సంఘం స్థాపించి పేదలకు ఇళ్ల స్థలాల మంజూరుకు పోరాడాడు.

మరణం

[మార్చు]

2020, జూలై నెలలో కరోనా వ్యాధి రావడంతో ఆసుపత్రిలో చేరి, ఆగస్టు 17వ తేదీన నెగిటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. వృద్యాప్యం నేపథ్యంలో శరీరంలో ఇన్ఫెక్షన్లు పెరగడంతో మళ్ళీ ఆగస్టు 26న హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరి చికిత్సపొందుతూ 2020, సెప్టెంబరు 1న మరణించాడు.[6] ఇతని భార్య జోజమ్మ 2020, ఆగస్టు 15న కరోనా వ్యాధితో మరణించింది.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (2020-09-02). "మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మృతి". www.andhrajyothy.com. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-03.
  5. వి6 వెలుగు, తెలంగాణ (2020-09-01). "క‌రోనాతో మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మృతి". www.v6velugu.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-03. Retrieved 2020-09-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The New Indian Express, Telangana (2020-09-02). "Ex-ministet Matangi Narsaiah, dies of cardiac arrest". www.newindianexpress.com. Archived from the original on 2020-09-03. Retrieved 2020-09-03.