అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు కొప్పుల ఈశ్వర్
నియోజకవర్గం ధర్మపురి

వ్యక్తిగత వివరాలు

జననం 1967
పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
తల్లిదండ్రులు అడ్లూరి నాగయ్య
జీవిత భాగస్వామి కాంతాకుమారి

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయనను 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగాప్రకటించగా [2], ఆయన ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం[మార్చు]

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1982 నుండి 85 వరకు గోదావరిఖని జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, 1986 నుండి 94 వరకు ఎన్‌ఎస్‌యూఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1996 నుండి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2006లో ధర్మారం (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచాడు. ఆయన 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2010 నుండి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. లక్ష్మణ్ కుమార్ 2013 నుండి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ తరువాత జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడిగా నియమితుడై, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[3][4][5], 2023 డిసెంబర్ 9న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[6]

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను 2023 డిసెంబర్ 15న ప్ర‌భుత్వ విప్‌గా ప్ర‌భుత్వం నియ‌మించింది.[7]

మూలాలు[మార్చు]

  1. Eenadu (10 November 2023). "పట్టు వదలని విక్రమార్కులు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  2. TV9 Telugu (15 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పోటీలో నిలిచేది వీరే." TV9 Telugu. Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అధ్యక్షా..!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Eenadu (4 December 2023). "ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టింది". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  6. Namaste Telangana (10 December 2023). ".. అనే నేను శాసనసభ సభ్యుడిగా!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  7. Namaste Telangana (15 December 2023). "ప్ర‌భుత్వ విప్‌లుగా న‌లుగురు ఎమ్మెల్యేలు.. నియమించిన ప్రభుత్వం". Archived from the original on 15 December 2023. Retrieved 15 December 2023.