కొప్పుల ఈశ్వర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొప్పుల ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి
పదవీ కాలము
2019 - ప్రస్తుతం
నియోజకవర్గము ధర్మపురి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-20) 1959 ఏప్రిల్ 20 (వయస్సు: 60  సంవత్సరాలు)
గోదావరి ఖని
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానము నందిని

కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 2019 నుండి ఎస్సీ, గిరిజన, బిసీ, మైనారిటీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈయన 20 ఏప్రిల్ 1959న గోదావరిఖనిలో జన్మించారు. బీఏ వరకు అభ్యసించి సింగరేణిలో బొగ్గుగని కార్మికుడిగా జీవనం ఆరంభించారు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

2004లో తొలిసారిగా మేడారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందినారు. 2014 ఎన్నికలలో మళ్ళీ తెరాస తరఫున ధర్మపురి నుంచి గెలిచారు.[2] 2014, 2018 మధ్య శాసనసభలో ఛీఫ్‌విప్‌గా పనిచేసారు.

2018 లో ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుండి లక్ష్మణ కుమార్‌పై 441 వోట్ల తేడాతో విజయం సాధించి, రాష్ట్ర మంత్రి మండలిలో షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీలు, బలహీనవర్గాల సంక్షేమ మంత్రిగా స్థానం సంపాదించారు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.[3][4][5]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ దినపత్రిక, కరీంనగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 05-04-2014
  2. "కొప్పులకు మొదటిసారి పట్టం." నమస్తే తెలంగాణ. Retrieved 20 February 2019. Cite news requires |newspaper= (help)
  3. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)
  4. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)
  5. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". మూలం నుండి 24 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 24 July 2019. Cite news requires |newspaper= (help)