పెద్దపల్లి
?పెద్దపల్లి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 16°22′29″N 78°24′14″E / 16.3748°N 78.4040°ECoordinates: 16°22′29″N 78°24′14″E / 16.3748°N 78.4040°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 26.19 కి.మీ² (10 చ.మై)[1] |
జిల్లా (లు) | పెద్దపల్లి జిల్లా |
జనాభా • జనసాంద్రత |
41,171[2] (2011 నాటికి) • 1,572/కి.మీ² (4,071/చ.మై) |
భాష (లు) | తెలుగు |
పురపాలక సంఘం | పెద్దపల్లి నగర్ పంచాయత్ |
పెద్దపల్లి, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలానికి చెందిన జనగణన పట్టణం.[3] ఇది పెద్దపల్లి జిల్లాకు ముఖ్య కేంద్రం. 2011లో పెద్దపల్లి పురపాలకసంఘంగా ఏర్పడింది.
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]
లోగడ పెద్దపల్లి పట్టణం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దపల్లి మండలాన్ని (1+22) ఇరవై మూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]
మాతాశిశు కేంద్రం[మార్చు]
పెద్దపల్లి పట్టణ కేంద్రంలో 18 కోట్ల ఖర్చుతో 100 పడకల సామర్థ్యంతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని 2022 మే 4న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు, సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్సీలు టి. భానుప్రసాద్ రావు, ఎల్.రమణ, పెద్దపల్లి ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]
మూలాలు[మార్చు]
- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 June 2016. Retrieved 28 June 2016.
- ↑ "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 50. Retrieved 9 June 2016.
- ↑ 3.0 3.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ telugu, NT News (2022-05-04). "ఏ ముఖం పెట్టుకొని రాహుల్ తెలంగాణకు వద్దామనుకుంటున్నాడు : మంత్రి హరీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-04. Retrieved 2022-05-04.