దాసరి మనోహర్ రెడ్డి
దాసరి మనోహర్ రెడ్డి | |||
| |||
నియోజకవర్గం | పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కాసులపల్లి, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ | 1954 ఫిబ్రవరి 25||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రాంరెడ్డి - మధురవ్వ | ||
జీవిత భాగస్వామి | పుష్పలత | ||
సంతానం | ప్రశాంత్ రెడ్డి |
దాసరి మనోహర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] ట్రినిటి విద్యాసంస్థలను కూడా స్థాపించాడు.[2]
విద్యాభ్యాసం
[మార్చు]మనోహర్ రెడ్డి 1954, ఫిబ్రవరి 25న రాంరెడ్డి - మధురమ్మ[3] దంపతులకు తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామంలో జన్మించాడు.[4] ఇతనిది వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం.సుల్తానాబాద్ మండలం, గర్రెపల్లిలో పాఠశాల విద్యను, సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, మంచిర్యాలలో డిగ్రీ, 1978లో నాగార్జున యూనివర్సిటీలో బీఈడీ, 1980లో మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఎంఏ (ఎకనామిక్స్) పూర్తి చేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]మనోహర్ రెడ్డికి పుష్పలతతో వివాహం జరిగింది.[5] వారికి ఒక కుమారుడు (ప్రశాంత్ రెడ్డి).
రాజకీయ విశేషాలు
[మార్చు]2010లో టీఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2012 నుంచి టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరించాడు. 2014 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి బరిలోకి దిగి 62686 వేల భారీ మెజారిటీతో గెలుపొందాడు.[6][7][8] తిరిగి 2018 ఎన్నికల్లో రెండవసారి బరిలోకి దిగి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడు.[9][10] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[11]
ఇతర వివరాలు
[మార్చు]చైనా, ఇజ్రాయెల్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్ మొదలైన దేశాలు సందర్శించాడు. కరీంనగర్ జిల్లాలోని తన అసెంబ్లీ సెగ్మెంట్‌లో పండ్ల మొక్కల పెంపకం, కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడినందుకు రాష్ట్ర స్థాయి తెలంగాణ హరిత మిత్ర అవార్డును అందుకున్నాడు.[12]
మూలాలు
[మార్చు]- ↑ "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-03.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Trinity DC". www.trinitydcpdpl.com. Retrieved 2021-09-03.[permanent dead link]
- ↑ "పెద్దపల్లి ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. ఈ ఏడాది ఆరంభం నాటి ఘటన మరువక ముందే." Samayam Telugu. Retrieved 2021-09-03.
- ↑ admin (2019-01-07). "Peddapalli MLA Dasari Manohar Reddy". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-09-03.
- ↑ Eenadu (21 November 2023). "ప్రచార భాగస్వాములు". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
- ↑ Eenadu (25 November 2023). "ఓట్లు కొల్లగొట్టారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ "IndiaVotes AC: Peddapalle 2014". IndiaVotes. Retrieved 2021-09-03.[permanent dead link]
- ↑ Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Sakshi. Archived from the original on 7 జూన్ 2021. Retrieved 7 June 2021.
- ↑ "Peddapalle Assembly constituency (Telangana): Full details, live and past results". News18. Retrieved 2021-09-03.
- ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.
- ↑ "Dasari Manohar Reddy | MLA | Peddapalli | Telangana | theLeadersPage". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-28. Retrieved 2021-09-03.
- All articles with dead external links
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- 1954 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- పెద్దపల్లి జిల్లా వ్యక్తులు
- పెద్దపల్లి జిల్లా రాజకీయ నాయకులు
- పెద్దపల్లి జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- రెండవ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా వ్యక్తులు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు