Jump to content

సోమేశ్ కుమార్

వికీపీడియా నుండి
సోమేశ్ కుమార్

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు
పదవీ కాలం
12 మే 2023 – ప్రస్తుతం

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
2019 డిసెంబర్ 31 – 10 జనవరి 2023
ముందు శైలేంద్ర కుమార్ జోషి (ఎస్.కె.జోషి)
తరువాత శాంతికుమారి

రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌

వ్యక్తిగత వివరాలు

జననం 1963 డిసెంబర్ 22
బీహార్ రాష్ట్రం, భారతదేశం.
తల్లిదండ్రులు మీనాక్షిసింగ్‌
వృత్తి ఐఏఎస్‌ అధికారి

సోమేశ్ కుమార్‌ భారతదేశానికి చెందిన 1995 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2019 డిసెంబర్ 31 నుండి 2023 జనవరి 10 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి[1] స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

సోమేశ్ కుమార్‌ ఐఏఎస్ పూర్తి చేసి బోధన్ & నిజామాబాద్ సబ్ -కలెక్టర్‌గా పని చేసి ఆ తరువాత అనంతపూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేశాడు. 2014లో రాష్ట్ర విభజించినప్పుడు ఏపీ క్యాడర్ కు కేటాయించిన కేంద్రం పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులతో ఆయన తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించాడు. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ తొలి చీఫ్ కమిషనర్‌గా నియమితుడయ్యాడు.

సోమేశ్ కుమార్‌ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, 5 రూపాయలకు భోజనం వంటి పథకాలతో మంచి పేరు సంపాదించాడు. ఆయన 2015లో జీహెచ్ఎంసీ పరిధిలో 7 లక్షల ఓట్లు గల్లంతైన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది. సోమేశ్ కుమార్‌ను ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయన అదనపు సీఎస్ హోదాలో ఉన్న సమయంలో 2023 డిసెంబర్ 31న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు.[3]

తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును 2023 జనవరి 10న రద్దు చేసింది. ఆయనను తెలంగాణ క్యాడర్ నుండి రిలీవ్ చేసి జనవరి 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. డీవోపీటీ పిటిషన్ పై హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ ఉత్తర్వులు జారీ చేశాడు.[4]

క్యాడర్ వివాదం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో సోమేష్‌ కుమార్‌ను ఏపీకీ కేటాయించడంపై ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగుతానంటూ కేంద్ర పరిపాలన ట్రైటునల్ (సీఏటీ)ను కోరగా సీఏటీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఏటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరాల నేపథ్యంలో చీఫ్‌జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా నేతృత్వంలో విచారణ జరిపారు.

అఖిలభారత సర్వీసు అధికారుల కేటాయింపు నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌ రెడ్డి హైకోర్టులో వాదించాడు. కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు ఆలిండియా సర్వీస్‌ అధికారుల విభజన చేపట్టినందున సోమేష్‌ కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌ వెళ్లాల్సిందేనని ఆయన అవసరం అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డిప్యూటేషన్‌పై తీసుకోవాలని సూచించాడు.

2018 విళంబి నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సోమేష్ కుమార్

రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన 2014 జూన్‌ 2కు ముందు రోజు పీకేమహంతి రిటైర్ అయ్యారని, ఆయన పేరును విభజన జాబితాలో చేర్చి ఉంటే తాను తెలంగాణ క్యాడర్‌లో ఉండేవాడినని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ వాదించారు. సోమేష్ కుమార్ వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. అన్ని వాదనలు విన్న తరువాత తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపును 2023 జనవరి 10న రద్దు చేసింది. ఆయనను తెలంగాణ క్యాడర్ నుండి రిలీవ్ చేసి జనవరి 12 లోపు ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాలని హైకోర్టు ఆదేశించింది.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. 10TV Telugu (10 January 2023). "తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు.. ఏపీకి వెళ్లిపోవాలంటూ హైకోర్టు ఆదేశం". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (12 May 2023). "సీఎం కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్‌ కుమార్‌". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  3. The Hindu (31 December 2019). "Somesh Kumar is new Chief Secretary of Telangana" (in Indian English). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  4. The New Indian Express (11 January 2023). "Somesh Kumar relieved as Telangana Chief Secreatary, transferred to AP cadre". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  5. V6 Velugu (10 January 2023). "ఆంధ్రాకు వెళ్లండి.. సీఎస్ సోమేశ్కు హైకోర్ట్ ఆదేశం". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (14 May 2023). "తెలంగాణకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కేటాయింపు రద్దు: హైకోర్టు కీలక తీర్పు". EENADU. Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  7. Andhra Jyothy (11 January 2023). "సోమేశ్‌ ఔట్‌". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.