శాంతికుమారి
శాంతికుమారి | |
---|---|
జననం | 1965, ఏప్రిల్ 17 |
వృత్తి | ఐఏఎస్ అధికారి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి |
పదవీ కాలం | 2023 జనవరి 11 - ప్రస్తుతం |
అంతకు ముందు వారు | సోమేశ్ కుమార్ |
శాంతికుమారి, తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శి.[1] 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శాంతికుమారి, 2023 జనవరి 11న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టింది.[2] ఈమె 2025 ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగనుంది.
జీవిత విషయాలు
[మార్చు]శాంతికుమారి 1965, ఏప్రిల్ 17న ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జన్మించింది. ఉన్నత విద్య దరకు విశాఖపట్నంలో చదివింది. ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబీఏ పూర్తిచేసింది.[3]
ఉద్యోగ జీవితం.
[మార్చు]ఐఏఎస్‌గా గత మూడు దశాబ్దాలుగా విద్య, వైద్యారోగ్య రంగాలు, పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసింది. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో శాంతికుమారి మెదక్ జిల్లా కలెక్టర్‌గా (1999 నవంబరు నుండి 2001 జూన్ వరకు) పనిచేసింది. ఐక్యరాజ్యసమితిలో రెండేళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖ్యమంత్రి కార్యాలయంలో నాలుగేళ్ళు (2015–2018), టీఎస్‌ఐపాస్‌లో ఇండస్ట్రీ చేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా సేవలు అందించింది.[4]
ఐఏఎస్ అధికారిగా మొదటగా భువనగిరి సబ్ కలెక్టర్‌గా నియమితురాలై 1992 ఆగస్టు 25 నుండి 1993 జూన్ 14 వరకు భువనగిరి డివిజన్‌లో విధులు నిర్వహించంది. భువనగిరిలో ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి విడిపించింది. వలిగొండ మండలంలోని ఎం.తుర్కపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న భూమస్యను అప్పట్లో క్షేత్రస్థాయికి వెళ్ళి పరిష్కరించింది.[5]
రాష్ట్ర తొలి మహిళా సీఎస్
[మార్చు]ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు శాంతికుమారిని సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి. శేషాద్రి 2023 జనవరి 11న ఉత్తర్వులు (జీవో నంబర్ 71) జారీచేయగా, శాంతికుమారి తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా చరిత్రకెక్కింది.[6] ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం తర్వాత శాంతికుమారి బీఆర్‌కేఆర్ భవన్‌లోని రాష్ట్ర సచివాలయం చేరుకుని సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించింది.[7]
అసిస్టెంట్ కలెక్టర్ నుంచి స్పెషల్ సీఎస్ వరకు..
[మార్చు]కాలవ్యవధి | హోదా |
---|---|
1991 ఆగస్టు 23 - 1993 జూన్ 18 | అసిస్టెంట్ కలెక్టర్ |
1993 మే 1 - 1995 జనవరి 1 | జాయింట్ కలెక్టర్ (జేసీ) |
1995 జనవరి 1 - 1995 ఆగస్టు 1 | జేసీ మెదక్ |
1996 జనవరి 29 - 1997 అక్టోబరు 22 | ఇంధన శాఖ ఉప కార్యదర్శి |
1997 అక్టోబరు 22 - 1998 జూన్ 1 | నిజామాబాద్ జిల్లా జేసీ |
1998 జూన్ 1 - 1999 ఏప్రిల్ 1 | వీసీ, ఎండీ, సాంఘిక సంక్షేమం |
1999 ఏప్రిల్ 1 - 1999 నవంబరు 1 | అరుణాచల్ ప్రదేశ్ లోని చంగ్లాంగ్ జిల్లా కలెక్టర్ |
1999 నవంబరు 1 - 2001 జూన్ 1 | మెదక్ జిల్లా కలెక్టర్ |
2001 ఆగస్టు 1 - 2003 జూలై 1 | సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి |
2005 జూన్ 1 - 2006 సెప్టెంబరు 18 | సర్వే సెటిల్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ |
2006 సెప్టెంబరు 18 - 2010 జనవరి 4 | గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్, సెల్ప్ అదనపు సీఈఓ |
2010 జనవరి 4 - 2011 ఆగస్టు 30 | గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ |
2011 ఆగస్టు 30 - 2013 ఆగస్టు 28 | రాజీవ్ గాంధీ మిషన్ డైరెక్టర్ |
2013 ఆగస్టు 28 - 2015 మే 11 | యూఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సీవోవో |
2015 మే 11 - 2018 మార్చి 31 | సీఎంఓ ముఖ్యకార్యదర్శి |
2018 జనవరి 22 - 2020 మార్చి 31 | వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి |
2020 మార్చి 31 - 2023 జనవరి 11 | అటవీ శాఖ స్పెషల్ సీఎస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Office - Sri K. Chandrashekar Rao (Smt. A. Santhi Kumari, IAS)". www.cm.telangana.gov.in/. Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-13.
- ↑ Andhra Jyothy (11 January 2023). "తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి". Archived from the original on 11 January 2023. Retrieved 11 January 2023.
- ↑ ABN (2023-01-12). "A. Santikumarini: తెలంగాణ ఆవిర్భవించాక మొదటి మహిళా సీఎస్". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-13.
- ↑ Desk, HT Telugu (2023-01-11). "Telangana Chief Secretary : తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి". Hindustantimes Telugu. Archived from the original on 2023-01-11. Retrieved 2023-01-11.
- ↑ "ఐఏఎస్ అధికారిగా మొదటి పోస్టింగ్ భువనగిరిలోనే". Sakshi. 2023-01-12. Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-12.
- ↑ Namasthe Telangana (12 January 2023). "తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి తొలి మహిళా సీఎస్". Archived from the original on 12 January 2023. Retrieved 12 January 2023.
- ↑ "శాంతికుమారి.. అసిస్టెంట్ కలెక్టర్ నుంచి స్పెషల్ సీఎస్ దాకా". Sakshi. 2023-01-11. Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-12.