నారాయణపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నారాయణపేట
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో నారాయణపేట మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో నారాయణపేట మండలం యొక్క స్థానము
నారాయణపేట is located in Telangana
నారాయణపేట
తెలంగాణ పటములో నారాయణపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°44′N 77°30′E / 16.73°N 77.5°E / 16.73; 77.5
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము నారాయణపేట
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 97,838
 - పురుషులు 48,769
 - స్త్రీలు 49,069
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.10%
 - పురుషులు 58.62%
 - స్త్రీలు 35.78%
పిన్ కోడ్ 509210

నారాయణపేట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. పిన్ కోడ్: 509210. మహబూబ్ నగర్ జిల్లా లోని 4 మున్సీపాలటీలలో నారాయణ పేట ఒకటి. ఇది హైదరాబాదుకు 160 కిలో మీటర్ల దూరములో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇది పట్టు చీరలకు మరియు బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి. ఒకప్పుడు జిల్లా లోనే ప్రముఖ వ్యాపార కేంద్రంగా విలసిల్లిననూ ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా లేదు. జిల్లా లోనే మొట్టమొదటి మున్సీపాలటీగా నారాయణ పేట ప్రారంబించబడిననూ ప్రస్తుతం మూడో గ్రేడు మున్సీపాలటీగా కొనసాగుతోంది. జిల్లాలోని 5 డివిజన్లలో ఒకటైన నారాయణ పేట రెవెన్యూ డివిజన్ లో 15 మండలాలు ఉన్నాయి.

జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 97,838 - పురుషులు 48,769 - స్త్రీలు 49,069.

అక్షరాస్యుల సంఖ్య 50110.[1] మండలంలో పట్టణ జనాభా 41539 కాగా, గ్రామీణ జనాభా 56235.

పురపాలక సంఘం[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పురపాలక సంఘాన్ని నారాయణపేటలో 1945-46లో ఏర్పాటుచేశారు. మధ్యలో కొంతకాలం నగరపంచాయతీగా కొనసాగి ప్రస్తుతం రెండో గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది.

రవాణా సదుపాయాలు[మార్చు]

నారాయణపేట పట్టణానికి హైదరాబాదు నుండి మహబూబ్ నగర్ మీదుగా మంచి బస్సు సౌకర్యము ఉంది. రంగారెడ్డి జిల్లా తాండూరు నుండి కోస్గి, మద్దూరుల మీదుగా మరియు కర్ణాటక రాష్ట్రం నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రస్థానమైననూ రైలు సౌకర్యం లేదు. సమీపంలోని రైలుస్టేషను దేవరకద్ర. ఇది నారాయణపేట నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాండూరు రైల్వే స్టేషను 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటకలోని యాద్గిర్ రైల్వే స్టేషను నారాయణపేట నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విద్యాసంస్థలు[మార్చు]

  • డిగ్రీ కళాశాలలు--2
  • జూనియర్ కళాశాలలు--5
  • ఇంజనీరింగ్ కళాశాలలు--0
  • బిఇడి కళాశాలలు--3

బ్యాంకులు[మార్చు]

ప్రధాన సంఘటనలు[మార్చు]

  • 2005, ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మావోయిస్టుల తూటాలకు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, మక్తల్ శాసనసభ్యుడు అయిన చిట్టెం నర్సిరెడ్డితో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు[2]. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరణించినవారిలో నర్సిరెడ్డితో పాటు పురపాలక సంఘం కమీషనర్ రాంమోహన్, నర్సిరెడ్డి కుమారుడు చిట్టెం వెంకటేశ్వరరెడ్డి ప్రముఖులు.
16 అక్టోబరు 2000 లో సినియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అద్వరయములో వార్తతరంగాలు తెలుగు దినపత్రిక ప్రరంబించడము జరిగింది.అప్పటి మంత్రి యెల్కొటి యల్లరెడ్ది, మాజి యెమ్మెల్యె చిట్టం నర్సిరెడ్డి,కొదంగల్ యెమ్మెల్యె సుర్యనారాయణ,బిజెపి నాయకుడు నాగురవు నామజి,అప్పటీ ముంసిపల్ చైర్మన్ గడ్డం సాఇబన్న తదితరులు పాల్గొన్నరు.

నారాయణపేట వెబ్ సఇత్

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008
"https://te.wikipedia.org/w/index.php?title=నారాయణపేట&oldid=2173349" నుండి వెలికితీశారు