నారాయణపేట పురపాలకసంఘం
నారాయణపేట పురపాలకసంఘం, 2019 ఫిబ్రవరి 17 న ఏర్పడిన నారాయణపేట జిల్లాకు చెందిన పురపాలక సంఘం.గతంలో ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేది. మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదటగా అవతరించింది. ఈ పురపాలక సంఘం తెలంగాణలోనే హైదరాబాదు తర్వాత రెండవ పురాతన పురపాలక సంఘంగా ఘనతకెక్కింది. 1947లో అవతరించిన ఈ పురపాలక సంఘానికి సమరయోధుడిగా ప్రసిద్ధి చెందిన రామచందర్ రావు కళ్యాణి తొలి చైర్మెన్ గా వ్యవహరించగా ఇప్పటివరకు 10 మంది ఈ విధులను నిర్వహించారు.ప్రస్తుతం ఇది మూడవశ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతుంది. 2014 మార్చి నాటికి ఈ పురపాలక సంఘం పరిధిలో 33 వార్డులు, 48825 ఓటర్లు కలరు. 2014 మార్చి 30న జరగబోయే ఎన్నికలకై చైర్మెన్ స్థానాన్ని బీసి (మహిళ) కు కేటాయించారు.
జనాభా వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘం పరిధి 11.87 చకిమీ. 2001 ప్రకారం జనాభా 37,563 ఉండగా, 2011 నాటికి 41,539కు పెరిగింది. 2010-11 నాటికి ఈ పురపాలక సంఘం ఆదాయం 19.5, వ్యయము 19.27 కోట్ల రూపాయలు.
సదుపాయాలు
[మార్చు]పురపాలక సంఘం పరిధిలో సుమారు 3400 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 67 కిమీ పొడవైన రహదారులు, 71 కిమీపొడవైన మురికి కాల్వలు, ఒక పార్కు, ఒక మార్కెట్, ఒక వధశాల, 11 కమ్యూనిటి భవనాలు ఉన్నాయి.
ఆదాయ వనరులు
[మార్చు]పురపాలక సంఘానికి ఇంటిపన్ను, నీటిపన్ను, అనుమతి ఫీజు ప్రధాన ఆదాయవనరులు. పురపాలక సంఘం నిర్మించిన 98 దుకాణాల ద్వారా వచ్చే ఆదాయము, ప్రభుత్వం నుంచి వచ్చే పలు గ్రాంటుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
2005 ఎన్నికలు
[మార్చు]2005లో నిర్వహించిన పురపాలక సంఘం ఎన్నికలలో చైర్-పర్సన్‌గా వై.శశికళ, వైస్-చైర్‌పర్సన్‌గా శిల్లా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.
2020 ఎన్నికలు
[మార్చు]2020లో నిర్వహించిన పురపాలక సంఘం ఎన్నికలలో చైర్-పర్సన్‌గా అనసూయ, వైస్-చైర్‌పర్సన్‌గా హరినారాయణ్ బట్టడ్ ఎన్నికయ్యారు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 22 March 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 22 March 2021.