Coordinates: 16°44′48″N 77°29′45″E / 16.746688°N 77.495815°E / 16.746688; 77.495815

నారాయణపేట జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణపేట జిల్లా
మాగనూర్ సమీపంలోని కృష్ణ నది ఒడ్డున ఉన్న పొలాలు
మాగనూర్ సమీపంలోని కృష్ణ నది ఒడ్డున ఉన్న పొలాలు
తెలంగాణ రాష్ట్ర పటంలో నారాయణపేట జిల్లా స్థానం
తెలంగాణ రాష్ట్ర పటంలో నారాయణపేట జిల్లా స్థానం
Coordinates (నారాయణపేట): 16°44′48″N 77°29′45″E / 16.746688°N 77.495815°E / 16.746688; 77.495815
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లా స్థాపన2019 ఫిబ్రవరి, 17
Founded byకల్వకుంట్ల చంద్రశేఖరరావు
ప్రధాన పరిపాలనా కేంద్రంనారాయణపేట
మండలం,13
Government
 • జిల్లా కలెక్టరుహరి చందన దాసరి (ఐఎఎస్)
 • లోక్‌సభ నియోజక వర్గంమహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం
Area
 • Total2,336 km2 (902 sq mi)
Population
 (2011)[1]
 • Total5,66,874
 • Density240/km2 (630/sq mi)

నారాయణపేట జిల్లా, తెలంగాణలోని జిల్లాలలో ఒకటి. 2019 ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ప్రకారం ఈ జిల్లా కొత్తగా అవతరించింది.[2] ( 2019 ఫిబ్రవరి 17 నుంచి జిల్లా పాలన అమలులోకి వస్తుంది) 2022 జూలై 22న కొత్తగా రెండు మండలాలు ఏర్పడ్డాయి.దీని వల్ల 13 మండలాలు, 1 రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. తెలంగాణలోనే ప్రాచీన సంస్థానాలలో ఒకటైన లోకపల్లి సంస్థానకేంద్రంగా వర్థిల్లిన నారాయణపేట పట్టణం కొత్త జిల్లాకు కేంద్రస్థానం అయింది.ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లాలోనివే.

[3] 2022 జూలై 22న ప్రస్తుత మండలమైన మద్దూరు, కోస్గిని విభజించి కోస్గి నుండి గుండుమల్, మద్దూరు మండలాల నుండి కొత్తపల్లి కొత్త మండలాల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వబడింది.దీంతో మండలాల సంఖ్య 13కి చేరింది.

చరిత్ర[మార్చు]

పటం
నారాయణపేట జిల్లా

లోకపల్లి సంస్థానం పాలనాధీశులు చాలా కాలం పాటు నారాయణపేట కేంద్రంగా పాలించారు. మహారాష్ట్రీయులైన లోకపల్లి సంస్థానాధీశుల ప్రభావం ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉంది. సంస్థాన కాలం నాటి కోటలు, పురాతన భవనాలే కాకుండా ఇక్కడి ప్రజలపై మరాఠీ భాషా ప్రభావం కూడా ఉంది. 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమైన ఈ ప్రాంతం 8 సం.ల పాటు హైదరాబాదు రాష్ట్రంలో కొనసాగించి.1956 నవంబరు 1 నుంచి 2014 జూన్ 2 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ గా ఉంది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా ఈ ప్రాంతం మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించి. ప్రత్యేక జిల్లాగా చేయాలనే ప్రతిపాదన రావడంతో 2018 డిసెంబరు 31న నారాయణపేట రెవెన్యూ డివిజన్ లోని 11, కోయిలకొండ మండలంతో 12 మండలాలలో జిల్లా ఏర్పాటుకు ముసాయిదా ప్రకటన వెలువడింది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కోయిలకొండ మండలాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోనే కొనసాగిస్తూ మిగితా 11 మండలాలతో 2019 ఫిబ్రవరి 16న నారాయణపేట జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు విడుదల చేసింది.[4]

జిల్లా లోని మండలాలు[మార్చు]

  1. నారాయణపేట మండలం
  2. దామరగిద్ద మండలం
  3. ధన్వాడ మండలం
  4. మరికల్ మండలం
  5. కోస్గి మండలం
  6. మద్దూర్ మండలం
  7. ఊట్కూరు మండలం
  8. నర్వ మండలం
  9. మాగనూరు మండలం
  10. కృష్ణ మండలం
  11. మఖ్తల్ మండలం
  12. గుండుమాల్ మండలం
  13. కొత్తపల్లి మండలం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Demography | Narayanpet District, Government of Telangana | India". Retrieved 2020-09-15.
  2. "మరో 2 కొత్త జిల్లాలు నారాయణపేట, ములుగు జిల్లాల ఆవిర్భావం". Archived from the original on 2019-04-12. Retrieved 2019-04-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. dishadaily (2021-07-28). "నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు." www.dishadaily.com. Retrieved 2023-08-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 19, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019

వెలుపలి లంకెలు[మార్చు]