మహబూబాబాద్‌

వికీపీడియా నుండి
(మహబూబాబాద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?మహబూబాబాద్‌
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167Coordinates: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 44.99 కి.మీ² (17 చ.మై)
జిల్లా (లు) మహబూబాబాద్ జిల్లా
భాష (లు) తెలుగు
పురపాలక సంఘం మహబూబాబాద్


మహబూబాబాద్‌, తెలంగాణ రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన జనగణన పట్టణం, అదే పేరు గల జిల్లాకు ప్రధాన కేంద్రం,మండల కేంద్రం.[1].

మహబూబాబాద్ ను మానుకొట అని కూడా అంటారు.మహబూబాబాద్ జిల్లాలో పెద్ద పట్టణం.ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరం. ఎన్నో విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయాలు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,812 - పురుషులు 56,424 - స్త్రీలు 57,388..పిన్ కోడ్ నం.506 101.,ఎస్.టి.డి.కోడ్ = 08719. మ్రానుకోట నుంచి మానుకోటగా ఆ తరువాత మహబూబాబాద్ గా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అడవిని కలిగి ఉండేదని పెద్దలు చెబుతుంటారు. ఆ ప్రాంతం మైదాన, మన్యం ప్రాంతాల క లయికతో విభిన్న వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటికీ మానుకోటగాను, మహబూబాబాద్ గాను, మహబాద్ గాను పిలుస్తుంటారు. గిరిజన జనాభా అధికంగా ఉండే ప్రాంతంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జనాభా పెరుగుతున్నప్పటికీ దానికి తగినట్టుగా రెవెన్యూ జనరేట్ అయ్యే పరిస్థితులు ఇక్కడ లేవు. కేవలం భవన నిర్మాణ రంగంపైనే చాలా మంది ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ ప్రాంతం కావడంతో ఇక్కడ పల్లెలలో ఖరీఫ్, రబీ సమయాల్లో వ్యవసాయ పనులతో ఉపాధి లభిస్తుంది. గ్రానైట్ రంగం అభివ్రుద్ధి చెందుతుండటంతో కొందరికి అది ఉపాధిని ఇస్తోంది. 461 గ్రామపంచాయతీలతో జిల్లాగా ఉన్న మహబూబాబాద్ ప్రజలు ఇప్పటికీ విద్యా, ఉద్యోగ, ఇతర అవసరాల కోసం వరంగల్, ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్ నగరాలకు వెళుతుంటారు. జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినా కూడా మహబూబాబాద్లో ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలు లేవు...

వరంగల్ జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ మహబూబాబాద్ వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణం, రెవిన్యూ డివిజన్,మండల కేంద్రం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రంగా, మండలం కేంద్రంగా (1+19) ఇరవై గ్రామాలుతో ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

రవాణా సదుపాయాలు[మార్చు]

మహబూబాబాదుకు బస్సు, రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. కాజీపేట్ - విజయవాడ రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉంది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన వరంగల్లు నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిమీ దూరంలో ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

ప్రదేశాలు జలపాతంలు[మార్చు]

1.B.N గుప్తా(తులారం)జలపాతం,2.ఏడుబావుల జలపాతం,3.బయ్యారం చెరువుశాసనం ,4.భీమునిపదం జలపాతం,5.కంబాలపల్లి చెరువు,6.కురవి వీరభద్రస్వామి ,7.అనంతరం (అనంత్రద్రీ), 8.డోర్నకల్ చర్చీ, బాలనాయక్స్స సొనో

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]