పసునూరి దయాకర్
పసునూరి దయాకర్ | |||
![]()
| |||
నియోజకవర్గం | వరంగల్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967 ఆగస్టు 2 బొల్లికుంట సంగెం మండలం: వరంగల్ జిల్లా: | ||
రాజకీయ పార్టీ | టీఆర్ఎస్ | ||
తల్లిదండ్రులు | కమలమ్మ, ప్రకాశం | ||
జీవిత భాగస్వామి | జయవాణి ( 1995 డిసెంబర్ 4) | ||
సంతానం | రోని భరత్, ప్రీతమ్ |
పసునూరి దయాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 2015 వరంగల్ లో ఉప ఎన్నికలలో గెలిచిన లోకసభ సభ్యుడు. వరంగల్లు (ఎస్.సి) వరంగల్ నుండి 16వ లోక్ సభకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున నుండి ప్రస్తుత 17వ లోక్ సభ ఎన్నికలలో 2వ సారి విజయం సాధించిన లోక్‌సభ సభ్యుడు.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన వరంగల్ జిల్లా సంగెం మండలం లోని బొల్లికుంట గ్రామంలో పసునూరి కమలమ్మ, ప్రకాశం దంపతులకు 1967 ఆగస్టు 2 న జన్మించారు. ఆయన హైదరాబాద్ జేఎన్టీయూలో బీఏ ఫైన్ ఆర్ట్స్ చదివారు. ఆయన వృత్తి రీత్యా చిత్రకారుడు, తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్త. దయాకర్‌కు 1995 డిసెంబర్ 4న జయవాణితో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు కుమారులు రోని భరత్, ప్రీతమ్ ఉన్నారు.[1]
వృత్తి,సేవ[మార్చు]
గ్యాస్ ఏజెన్సి ముందు వృత్తి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణా ఉద్యమంలో తొలి నుంచి సేవలందిస్తున్నారు.[2].
రాజకీయ జీవితం[మార్చు]
టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి క్రియాశీలకంగా పార్టీలోనూ, రాఫ్ల ఏర్పాటుకు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 2001 నుంచి 2009 వరకు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకు జిల్లా టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగారు[3]. వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్టీగా బాధ్యతలు నిర్వర్తించారు. అరూరి రమేశ్ టీఆరెస్ లోకి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానం దయూకర్ ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయన పెద్దగా బయటికి రానప్పటికీ పార్టీ పట్ల పట్టుసడలని విధేయతతో ఉంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొదట తయారు చేయించిన నేతగా పసునూరి దయాకర్ కు టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది.
భారీ మేజారిటీ[మార్చు]
పసునూటి దయాకర్ 2015 వరంగల్ ఉపఎన్నిక పోరు ఓ రికార్డు. రాష్ట్ర చరిత్రలో భారీ మేజారిటీ నమోదు అయ్యింది. పసునూటికి 6,15, 403 ఓట్లూ రాగ. కాంగ్రేస్కు సర్వే సత్యనారాయణకు 1, 56, 315 ఓట్లూ వచ్చినవి . భారతీయ జనతా పార్టీ డా|| పగిడిపాటి దేవయ్యకు 1,30, 178 ఓట్లూ వచ్చినవి, కాగా పసునూటి ఓట్లూ 4,59,092 భారీ మేజారిటీ నమోదు అయ్యింది[4].
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (26 May 2019). "'తల్లి' విగ్రహం ప్లాన్ సార్‌దే...: ఎంపీ దయాకర్". Archived from the original on 21 సెప్టెంబర్ 2021. Retrieved 21 September 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ యూట్యూబ్ లో విషయాలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-11-24. Retrieved 2015-11-24.
- ↑ http://www.prajasakti.com/BreakingNews/1717815[permanent dead link]
బయటి లింకులు[మార్చు]
- http://www.telanganastateinfo.com/pasunuri-dayakar-trs-mp-candidate-for-warangal-by-polls/ Archived 2015-12-06 at the Wayback Machine
- https://web.archive.org/web/20151101222321/http://www.andhraheadlines.com/news/politics/152918/its-official-kcr-gives-b-form-to-dayakar
- http://www.thehindu.com/news/national/telangana/trs-congress-candidates-file-nominations-for-bypoll/article7835346.ece
- http://www.telanganastateinfo.com/pasunuri-dayakar-profile-wiki/ Archived 2015-11-20 at the Wayback Machine
- http://www.telangananewspaper.com/pasunuri-dayakar-as-warangal-mp-profile/
- http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/warangal-trs-candidate-pasunuri-dayakar-1-2-493172.html Archived 2015-12-13 at the Wayback Machine
- All articles with dead external links
- Articles with dead external links from డిసెంబర్ 2021
- Articles with permanently dead external links
- 16వ లోక్‌సభ సభ్యులు
- 1967 జననాలు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- చిత్రకారులు
- వరంగల్లు పట్టణ జిల్లా రాజకీయ నాయకులు
- వరంగల్లు పట్టణ జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- వరంగల్లు పట్టణ జిల్లా చిత్రకారులు