Jump to content

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

వికీపీడియా నుండి
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 సెప్టెంబర్ 6
ముందు రేవంత్ రెడ్డి

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 జనవరి 2024 - 21 నవంబర్ 2027

వ్యక్తిగత వివరాలు

జననం 24 మే 1966
రహత్‌నగర్, భీంగల్ మండలం నిజామాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు బొమ్మ గంగాధర్‌ గౌడ్
జీవిత భాగస్వామి సంధ్యారాణి
సంతానం రిత్విక్ గౌడ్, ప్రణవ్ గౌడ్
నివాసం హైదరాబాద్

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పేరును తెలంగాణ శాసనమండలికి 2024 జనవరి 29న ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగా,[1][2] ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు అసెంబ్లీ కార్యదర్శి 2024 జనవరి 22న ప్రకటించాడు.[3]

ఆయన 2024 సెప్టెంబరు 6 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[4]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్లో జన్మించి గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పనిచేశాడు.[5]

మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.[6] మహేష్ కుమార్ 2018 సెప్టెంబరు 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుడయ్యాడు.[7]

బి. మహేష్ కుమార్ గౌడ్ 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా[8], 2022 డిసెంబరు 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా[9],  2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[10][11] మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.[12]

ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో  మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు అసెంబ్లీ కార్యదర్శి 2024 జనవరి 22న ప్రకటించాడు.[3] ఆయన జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[13][14]

మహేష్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 2024 సెప్టెంబరు 6న కాంగ్రెస్ అధిష్టానం నియమించగా[15], సెప్టెంబరు 15న బాధ్యతలు చేపట్టాడు.[16]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (17 January 2024). "కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  2. The Hindu (17 January 2024). "Congress springs surprise by picking up Mahesh Goud, Balamoor Venkat as MLC candidates" (in Indian English). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  3. 3.0 3.1 Mana Telangana (22 January 2024). "బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్‌ ఏకగ్రీవ ఎన్నిక". Archived from the original on 22 January 2024. Retrieved 22 January 2024.
  4. "టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ | Congress Senior Leader Mahesh Goud As TPCC Chief | Sakshi". web.archive.org. 2024-09-06. Archived from the original on 2024-09-06. Retrieved 2024-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Sakshi (18 January 2024). "కాంగ్రెస్‌ మార్క్‌ సెలక్షన్‌!". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  6. Eenadu (18 January 2024). "విధేయతకు అవకాశం". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  7. The Hindu (19 September 2018). "Cong. announces 9 committees for State elections" (in Indian English). Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  8. NDTV (26 June 2021). "A Revanth Reddy Appointed New Telangana Pradesh Congress Chief". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  9. The Economic Times (10 December 2022). "Cong sets up political affairs, executive committees in Telangana, appoints 24 VPs, 84 gen secys in Telangana unit". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  10. Hindustantimes Telugu (20 June 2023). "టార్గెట్ 'తెలంగాణ'.. ఎన్నికల టీమ్ ఖరారు, ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  11. Andhrajyothy (21 July 2023). "26 మందితో టీపీసీసీ ఎన్నికల కమిటీ". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  12. Sakshi (18 January 2024). "మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు ఎమ్మెల్సీ". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  13. NTV Telugu (31 January 2024). "ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన బల్మూరి వెంకట్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌". Archived from the original on 31 January 2024. Retrieved 31 January 2024.
  14. Andhrajyothy (1 February 2024). "ఎమ్మెల్సీలుగా మహేశ్‌గౌడ్‌, వెంకట్‌ ప్రమాణం". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  15. Eenadu (6 September 2024). "తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌గౌడ్‌". Archived from the original on 6 September 2024. Retrieved 6 September 2024.
  16. NTV Telugu (15 September 2024). "టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్". Retrieved 17 September 2024.