సత్యవతి రాథోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యవతి రాథోడ్
సత్యవతి రాథోడ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2009 - 2014
నియోజకవర్గము డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబరు 31, 1969
గుండ్రాతిమడుగు, కురవి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, 2014 నుండి తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి గోవింద రాథోడ్
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరపున డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది. 2014, మార్చి 2న తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరింది.[1] [2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

సత్యవతి రాథోడ్ 1969, అక్టోబరు 31న లింగ్యానాయక్, దశమి దంపతులకు వరంగల్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు లో జన్మించింది. ఏడవ తరగతి వరకు చదువుకుంది.

వివాహం - పిల్లలు[మార్చు]

1982, మే 5న గోవింద రాథోడ్ తో సత్యవతి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సునీల్, సతీష్). 2009, జూలై 20న గోవింద్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.[3]

రాజకీయరంగ ప్రస్థానం[మార్చు]

సత్యవతి 1984లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఎన్నికెంది. 1988 నుండి 1991 వరకు పంచాయితీ రాజ్ పరిషత్ సభ్యరాలుగా పనిచేసింది. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్ గా ఉన్నారు.

1989లో తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్, కాంగ్రెస్ పార్టీ నుండి డిఎస్ రెడ్యా నాయక్ పోటీచేయగా... డిఎస్ రెడ్యా నాయక్ గెలుపొందాడు.

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సత్యవతి రాథోడ్,[4] కాంగ్రెస్ పార్టీ నుండి డిఎస్ రెడ్యా నాయక్, భారతీయ జనతా పార్టీ తరఫున పరశురాం నాయక్, ప్రజారాజ్యం పార్టీ తరఫున బానోతు సుజాత పోటీచేయగా...సత్యవతి రాథోడ్ గెలుపొందింది.[5]

మూలాలు[మార్చు]

  1. తెలుగు వి6. "టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి!". Retrieved 15 May 2017.
  2. తెలుగు వన్ ఇండియా. "టిడిపికి, పదవికి సత్యవతి రాథోడ్ రాజీనామా: తెరాసలోకి". telugu.oneindia.com. Retrieved 15 May 2017.
  3. తెలుగు వెబ్ దునియా. "డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి భర్త మృతి". telugu.webdunia.com. Retrieved 15 May 2017.
  4. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  5. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009

ఇతర లంకెలు[మార్చు]