Jump to content

సిద్దిపేట

Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
వికీపీడియా నుండి
  ?సిద్ధిపేట
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 36.03 కి.మీ² (14 చ.మై)[1]
జిల్లా (లు) సిద్దిపేట జిల్లా
జనాభా
జనసాంద్రత
1,13,358[1][2] (2011 నాటికి)
• 3,146/కి.మీ² (8,148/చ.మై)
పురపాలక సంఘం సిద్ధిపేట పురపాలకసంఘం


సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన పట్టణం. సిద్దిపేట జిల్లా పరిపాలన, రెవెన్యూ డివిజన్ కేంద్రం. ఈ పట్టణానికి పూర్వం సిద్దిక్ పేట అని పేరు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2021 అవార్డుకు జాతీయస్థాయిలో సిద్ధిపేట ప‌ట్ట‌ణం ఎంపికైంది. తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ, వీటి ప్రక్రియ‌, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ యాప్ ఉపయోగించడం వంటి కార్య‌క్ర‌మాల‌ను సంపూర్ణంగా అమ‌లు చేయ‌డంతో సిద్ధిపేటకు ఈ అవార్డు వచ్చింది. 2021 నవంబరు 20న ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్ మంజుల రాజనర్సు, క‌మిష‌న‌ర్ ర‌మ‌ణాచారి ఈ అవార్డును అందుకున్నారు.[3]

సిద్ధిపేట నామధేయం

[మార్చు]

సిద్ధిపేట అనే పట్టణం పేరుకు సంబంధించిన మూలం గురించి పలు స్థానిక చారిత్రక కథనాలు ఉన్నాయి. సాధారణంగా "సిద్ధి" లేదా "సిద్ధులు" అనే పదం నుండి ఈ పేరు ఏర్పడిందని భావించబడుతుంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో యోగులు మరియు సిద్ధులు నివసించి తపస్సు చేసేవారని, అందువల్ల ఈ ప్రాంతాన్ని మొదట "సిద్ధుల పేట" అని పిలిచారని స్థానికంగా చెప్పబడుతుంది. కాలక్రమేణా ఆ పేరు మారుతూ "సిద్ధిపేట"గా మారింది.[4]

మరో అభిప్రాయం ప్రకారం, నిజాం పాలన కాలంలో ఈ ప్రాంతంలో నివసించిన ఒక ప్రముఖ వ్యక్తి పేరు ఆధారంగా ఈ పట్టణానికి "సిద్ధిపేట" అనే పేరు ఏర్పడినట్లు కూడా చెప్పబడుతుంది. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం "సిద్ధి" లేదా "సిద్దిక్" అనే వ్యక్తి పేరు మరియు "పేట" అనే పదం కలిపి ఈ ప్రాంతానికి "సిద్ధిపేట" అనే పేరు ఏర్పడిందని భావిస్తారు.[5]

ఇంకొక అభిప్రాయం ప్రకారం, పూర్వకాలంలో ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది. "పేట" అనే పదం తెలుగు భాషలో వ్యాపార కేంద్రం లేదా మార్కెట్ ప్రాంతాన్ని సూచిస్తుంది. అందువల్ల ఈ ప్రాంతంలో నివసించిన ప్రజల సమూహం లేదా స్థానిక నాయకుని పేరు ఆధారంగా "సిద్ధి + పేట" అనే కలయికతో "సిద్ధిపేట" అనే పేరు ఏర్పడినట్లు కూడా కొన్ని స్థానిక కథనాలు పేర్కొంటాయి.[6]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన సిద్ధిపేట పట్టణ మండలంలోకి చేర్చారు.[7]

గణాంక వివరాలు

[మార్చు]

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669

రాజకీయాలు

[మార్చు]

పార్లమెంట్ సభ్యులు

[మార్చు]
  • 1952–1966: నియోజకవర్గం ఉనికిలో లేదు
లోక్ సభ వ్యవధి M.P. పేరు పార్టీ అనుబంధం
నాల్గవ 1967–71 జి. వెంకటస్వామి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఐదవ 1971–77 జి. వెంకటస్వామి తెలంగాణ ప్రజా సమితి
ఆరవ 1977–80 నంది యెల్లయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఏడవ 1980–84 నంది యెల్లయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఎనిమిదవ 1984–89 జి. విజయ రామారావు తెలుగు దేశం పార్టీ
తొమ్మిదవ 1989–91 నంది యెల్లయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
పదో 1991–96 నంది యెల్లయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
పదకొండవ 1996–98 నంది యెల్లయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
పన్నెండవ 1998–99 మల్యాల రాజయ్య తెలుగు దేశం పార్టీ
పదమూడవ 1999-04 మల్యాల రాజయ్య తెలుగు దేశం పార్టీ
పద్నాల్గవ 2004-09 సర్వే సత్యనారాయణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
  • 2008 నుండి: నియోజకవర్గం ఉనికిలో లేదు

2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు[8]

[మార్చు]
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
BRS తన్నీరు హరీశ్ రావు 1,05,514 58.17
INC పూజల హరి కృష్ణ 23,206 12.79
BJP దూది శ్రీకాంత్ రెడ్డి 23,201 12.79
BSP గాధగోని చక్రధర్ గౌడ్ 16,610 9.16
స్వతంత్ర పిల్లి సాయి కుమార్ 4,970 2.74
స్వతంత్ర ఇతరులు 6,602 3.64
నోటా పై వ్యక్తులలో ఎవరూ కారు 1,300 0.72
మెజారిటీ 82,308 100.00
మొత్తం పోలైన ఓట్లు 1,81,403
BRS hold Swing


ఫలితాలు వివరముగా

క్ర.సంఖ్య అభ్యర్థి పార్టీ మొత్తం ఓట్లు % ఓట్లు
1 గాథగోని చక్రధర్ గౌడ్ బహుజన్ సమాజ్ పార్టీ 16,610 9.16
2 తన్నీరు హరీశ్ రావు భారత రాష్ట్ర సమితి 1,05,514 58.17
3 దూది శ్రీకాంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ 23,201 12.79
4 పూజల హరి కృష్ణ భారత జాతీయ కాంగ్రెస్ 23,206 12.79
5 నర్సింహారెడ్డి అదుల్లా భరత చైతన్య యువజన పార్టీ 206 0.11
6 బాబు కర్రోల్ల ధర్మ సమాజ్ పార్టీ 218 0.12
7 రొమాలా బాబు దుర్గయ్య భారత ప్రజా బంధు పార్టీ 164 0.09
8 వతరికరి నగరాని ఆబాద్ పార్టీ 478 0.26
9 ఎక్కల్దేవి లింగం స్వతంత్ర 358 0.2
10 ఏటీ ఆంజనేయులు స్వతంత్ర 675 0.37
11 గుమ్మడి శ్రీశైలం స్వతంత్ర 443 0.24
12 గువ్వల సంతోష్ కుమార్ స్వతంత్ర 291 0.16
13 ధర్మాజీపేట ప్రతాప్ రెడ్డి స్వతంత్ర 227 0.13
14 పశికాంతి శంకర్ స్వతంత్ర 543 0.3
15 పిల్లి సాయి కుమార్ స్వతంత్ర 4,970 2.74
16 పైసా రామకృష్ణ స్వతంత్ర 881 0.49
17 పోతుగంటి నర్సింహారెడ్డి స్వతంత్ర 504 0.28
18 బర్రె మల్లయ్య స్వతంత్ర 928 0.51
19 రజినీకర్ చడా స్వతంత్ర 152 0.08
20 వరికోలు శ్రీనివాస్ స్వతంత్ర 338 0.19
21 శ్రీకాంత్ పెద్దసాయిగారి స్వతంత్ర 196 0.11
22 నోటా పైవేవీ లేవు 1,300 0.72
మొత్తం 1,81,403

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం

[మార్చు]

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రానికి సమీపంలోని దుద్దాడలోని 50 ఎకరాలలో 63.6 కోట్ల రూపాయలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2021, జూన్ 20న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు.[9] కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టి. హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ లతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[10]

1972 జూన్ 3న సిద్దిపేటలో జన్మించిన తన్నీరు హరీశ్ రావు చిత్రం. (తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు)

చెరువులు

[మార్చు]

సిద్ధిపేటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు. దీనినే మిని టాంక్ బండ్ అందరు సిద్ధిపేటలో మరిన్ని చెరువు కలవు వాటిలో ఎర్ర చెరువు నర్సాపూర్ చెరువు చింతల్ చెరువు కలవు

ఆరోగ్యం

[మార్చు]

2018లో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయింది.[11]

భరోసా, సఖి, ఓల్డ్ ఏజ్ హోమ్‌లు

[మార్చు]

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్‌లో రూ.48.69 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవనం, సికింద్రాబాద్‌కు చెందిన గౌరా పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మహిళలు, బాలల భరోసా సెంటర్ భవనానికి 2022 మార్చి 17న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[12]

భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రం

[మార్చు]

భారతదేశంలోనే తొలిసారిగా సిద్ధిపేట పట్టణంలో నిర్మించిన భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని 2022 ఏప్రిల్ 20న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. 300కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తారు.[13][14]

బస్తీ దవాఖాన

[మార్చు]

డబుల్ బెడ్‌రూం కేసీఆర్‌ నగర్‌లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖాన నూతన భవనాన్ని 2022 జూన్ 10న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు ప్రారంభించాడు. తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందిస్తుండగా, 18 లక్షల రూపాయలతో పక్కా భవనం నిర్మించారు. ఈ దవాఖానాలో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడంపాటు బీపీ, షుగర్‌తో సహా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తున్నారు. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తున్నారు.[15]

పారిశుధ్యం

[మార్చు]

సిద్దిపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణను స్థానిక మున్సిపల్ పరిపాలన నిర్వహిస్తుంది. పట్టణంలో చెత్త సేకరణ, వీధుల శుభ్రత, డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ వంటి సేవలను మున్సిపాలిటీ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి చెత్తను వేరు చేసి సేకరించడం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.[16]

తాగు నీరు

[మార్చు]

సిద్దిపేట పట్టణానికి తాగునీటి సరఫరా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా జరుగుతోంది. ఈ పథకం ద్వారా పట్టణాలు మరియు గ్రామాలకు సురక్షితమైన తాగునీటిని పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.[17]

సమాచార సౌకర్యాలు

[మార్చు]

సిద్దిపేట పట్టణంలో సమాచార మరియు కమ్యూనికేషన్ సౌకర్యాలు విస్తృతంగా అభివృద్ధి చెందాయి. టెలికమ్యూనికేషన్ సేవలు, మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సేవలు మరియు పోస్టల్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తో పాటు ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలు కూడా సేవలు అందిస్తున్నాయి.[18]

విద్యుత్తు

[మార్చు]

సిద్దిపేట పట్టణంలో విద్యుత్తు సరఫరాను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ అయిన తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) నిర్వహిస్తుంది. ఈ సంస్థ ద్వారా గృహ, వ్యవసాయ మరియు వాణిజ్య అవసరాలకు విద్యుత్తు అందించబడుతోంది.[19]

ఐటీ టవర్

[మార్చు]

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో సిద్దిపేట పట్టణంలో 1,72,645 చదరపు అడుగుల విస్తీర్ణంలో 63 కోట్ల వ్యయంతో 718 సీటింగ్‌ కెపాసిటీతో జీప్లస్‌ 4 అంతస్తులతో తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట ఐటీ టవర్‌ను నిర్మించింది. ఈ ఐటీ టవర్‌ను 2023, జూన్ 15న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలిసి ప్రారంభించి, అందులోని వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశారు.[20][21] 2020, డిసెంబరు 10న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఐటీ టవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాడు.[22]

పోలీస్ కమిషనరేట్

[మార్చు]

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అనేది సిద్దిపేట పట్టణంలో చట్టాన్ని అమలుచేయడానికి, నేర దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న నగర పోలీసు విభాగం. దసరా పండుగ సందర్భంగా 2016 అక్టోబరు 11న రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబడిన 21 జిల్లాలు, 4 కొత్త కమిషనరేట్‌లతోపాటు సిద్దిపేట కమిషనరేట్ కూడా అధికారికంగా ఏర్పాటుచేయబడింది.

అవార్డులు

[మార్చు]

సిద్ధిపేట పట్టణానికి జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి.[3]

  1. 2012: రాష్ట్ర స్థాయిలో క్లీన్ సిటీ ఛాంపియన్ షిప్ అవార్డు
  2. 2015: జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ అవార్డు (సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్)
  3. 2016: జాతీయ స్థాయిలో ఎక్స్ లెన్స్ అవార్డు పారిశుద్ధ్య నిర్వహణ
  4. 2016: రాష్ట్ర స్థాయిలో హరిత మిత్ర అవార్డు
  5. 2016: చెత్త సేకరణ, 100% మరుగుదొడ్ల నిర్మాణంలో జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డు
  6. 2016: జాతీయ స్థాయిలో ఓడీఎఫ్ సర్టిఫికెట్
  7. 2016: రాష్ట్ర స్థాయిలో ఎక్స్ లెన్స్ అవార్డు
  8. 2017: జాతీయ స్థాయిలో రాష్ట్రీయ స్వచ్ భారత్ పురస్కారం
  9. 2017: సీఎం చే రాష్ట్ర స్థాయి బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు
  10. 2017: జాతీయ స్థాయిలో ఐఎస్వో అవార్డు
  11. 2018: జాతీయ స్థాయిలో సాలీడ్ మేనేజ్మెంట్ లో స్కాచ్ అవార్డు
  12. 2018: జాతీయ స్థాయిలో స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు
  13. 2018: 6 పద్ధతులు అమలులో ఉన్నందున జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు
  14. 2018: స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం
  15. 2019: జాతీయ స్థాయిలో స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు
  16. 2019: జాతీయ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డు (దక్షిణ భారత దేశంలో రెండవ స్థానంలో)
  17. 2021: సిద్ధిపేట పట్టణంలో 100% ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగు నీటి సరఫరా నిర్వహణకు రెండు స్కాచ్ అవార్డులు
  18. 2021: దేశ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డుకు ఎంపిక

రవాణా సౌకర్యం

[మార్చు]

ఇది కరీంనగర్, హైదరాబాదు ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్, మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది.ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది. సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది. దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

ప్రముఖులు

[మార్చు]

కోటిలింగాల దేవాలయం

[మార్చు]

కోటిలింగాల దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఉన్న ఒక ప్రముఖ శైవ దేవాలయం. ఈ దేవాలయం ప్రాంతీయ ప్రజల ఆధ్యాత్మిక ఆరాధనకు ముఖ్య కేంద్రంగా నిలిచింది. దేవాలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి మరియు ఇతర శైవ పండుగల సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.[23]

శరభేశ్వరాలయం

[మార్చు]

జిల్లాకేంద్రం సిద్ధిపేట పట్టణంలో రాష్ట్రకూటుల కాలం నుంచి 16,17వ శతాబ్దాలదాక నిర్మాణమైన ఆలయాలు అగుపిస్తాయి. చరిత్రపూర్వయుగం, సాతవాహనకాలం ఆనవాళ్ళు కూడా చరిత్రబృందానికి ఇక్కడ లభించాయి. పట్టణంలో ఆరాధ్యశైవుల దేవాలయం శరభేశ్వరాలయం.[24] ఈ ఆలయచరిత్రను తెలిపే ఇత్తడిరేకు శాసనం దేవాలయ ధ్వజస్తంభం మీద తాపడం చేయడం జరిగింది.

ఈ శాసనంలో క్రీ.శ. 1877 జూన్ 16వ తేదీన, శాలివాహన శకం 1798, ఈశ్వరనామ సం. జ్యేష్ట శుద్ధ పంచమినాడు త్రిలోకగురు మల్లికార్జునపండితారాధ్యుని వంశంలో పుట్టిన ఘట్టెపల్లి శరభారాధ్యులవారు సిద్ధిపేటలో త్రిలోకగురు చెన్నమల్లికార్జునపీఠం ప్రతిష్టించాలని సంకల్పించుకొని, 12 సంవత్సరాలపాటు నిరశనవ్రతం చేసి కాశీకి వెళ్లి నర్మదానదిలో లభించే బాణలింగాన్ని తెచ్చి ఆలయనిర్మాణం చేసి అందులో 1889 జూన్ 18న శాలివాహన శకం 1811, విరోధినామ సం. జ్యేష్ట బహుళ పంచమి రోజున పరివారదేవతలతో కలిసి ‘శ్రీ అన్నపూర్ణ విశాలాక్షీ సమేత శ్రీవిశ్వేశ్వరస్వామిని’ ప్రతిష్టించారు.

తర్వాత కొంతకాలానికి ఏ కారణంవల్లనో దేవాలయంలో నైవేద్య, దీపారాధనలు ఐదేళ్లపాటు నిలిచిపోగా సిద్ధిపేట గ్రామప్రజలలో కొంతమంది భక్తులు విశ్వేశ్వర బాలభక్తసమాజాన్ని స్థాపించి ప్రతిసోమవారం ఆలయంలో భజనలు చేస్తూ గ్రామ ప్రముఖుల ప్రోత్సాహంతో శాలివాహన శకం 1858 ధాతనామ సం. వైశాఖ శుద్ధ తదియనాడు వృషభలగ్నంలో అంటే 1936 ఏప్రిల్ 24 శుక్రవారంనాడు దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేశారు.

గుడికి ధ్వజస్తంభాన్ని మూర్తి లక్ష్మయ్య కొడుకు అనంతం చేయించి ఇచ్చాడు.[24]

భోగేశ్వరాలయం

[మార్చు]

సిద్ధిపేటలో మాతంగి నది ఒడ్డున పెద్ద దేవాలయాల ప్రాంగణముంది.[24] భోగేశ్వరాలయ ప్రాంగణంలో నైరుతిలో మట్టిదిబ్బమీద త్రికూటాలయం ఉంది. రాష్ట్రకూటుల కాలంలో ముందు జైన త్రికూటంగా ఉన్న గుడిని తర్వాత కాలంలో పునరుద్ధరణ చేసినపుడు శైవ త్రికూటంగా మార్చినట్టున్నారు. ఈ మూడు గుడుల అంతరాలయ స్తంభాలన్నీ రాష్ట్రకూట శిల్పశైలిలో చెక్కినవే. ప్రస్తుతం శివలింగం మిగిలివున్న పడమటి గుడిలో 3 అడుగుల ఎత్తున్న దుర్గాదేవి విగ్రహం ఉంది. అంతరాళంలో కాకతీయ శైలిలో ప్రాణపట్ట సహిత శివలింగం ఉంది. చాళుక్య శైలిలో చెక్కిన నాలుగు చేతుల వినాయకుని శిల్పం ఉంది.

తూర్పు గుడి ముందర అసంపూర్ణంగా చెక్కిన రెండు చేతుల వినాయకుని శిల్పం ఉంది. దక్షిణాన ఉన్న గుడి పూర్తిగా శిథిలస్థితిలో ఉంది. గర్భాలయ ద్వారానికి ఇరువైపుల కలశాలు ఉన్నాయి, ఇవి జైన దేవాలయాలలో సాధారణంగా కనిపిస్తాయి.

మిగతా రెండు గుడులలో శైవ ద్వారపాలకులు ఉన్నారు.అంతరాళంలో గుడి కప్పురాయి కూలిపోయి దానిపై అష్టదళ, అష్టకోణ యంత్రం చెక్కబడి ఉంది.ఇది కాకతీయ శైలికి చెందినది.

మూడు గుళ్ల మధ్య చతురస్రాకార రంగమంటపం ఉంది. రాష్ట్రకూటులనాటి జైన త్రికూటం తరువాత కాకతీయుల కాలంలో శైవ సంప్రదాయమైన భోగేశ్వరాలయంగా మారింది.[24]

పోచమ్మ

[మార్చు]

మాతంగి నది ఒడ్డున మట్టిదిబ్బపై పోచమ్మ (చాముండి శిల్పం) అమ్మదేవత విగ్రహం ఉంది.[24] చాముండి శిల్పాలు సాధారణంగా గ్రామాల వద్ద కనిపిస్తాయి. శిల్పశాస్త్రం ప్రకారం చాముండి రూపం భయంకరంగా ఉంటుంది. ఆమె వెనుక ఎడమచేతిలో త్రిశూలం, వెనుక కుడిచేతిలో ఢమరుకం, ముందు కుడిచేతిలో ఖడ్గం, ముందు ఎడమచేతిలో పానపాత్ర ధరించి ఉంటుందని చెప్పబడింది. ఈ దేవతను చాముండి లేదా చండి అని కూడా అంటారు. వాహనంగా నక్క లేదా శవం చూపబడుతుంది. సిద్ధిపేటలో ఈ దేవతను “పెండ్లిల్ల పోచమ్మ” అని పిలుస్తారు.ఇక్కడ మొక్కుకుంటే ఆడపిల్లలకు పెండ్లి జరుగుతుందని స్థానిక విశ్వాసం ఉంది.

దేవాలయ ప్రాంగణంలో త్రికూటాలయానికి ఆగ్నేయాన 14×8×4 అంగుళాల కొలతలున్న ఇటుకల పరుపు కనిపిస్తుంది. అక్కడక్కడ ఇటుకలు కూడా కనిపిస్తాయి. మాతంగి నది ఈ ప్రాంగణానికి ఉత్తరవాహినిగా ప్రవహించినట్లయితే ఇక్కడ బౌద్ధ స్తూపం ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని తవ్వి పరిశోధిస్తే కొత్త చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశం ఉంది. ఈ దేవాలయాలకు సమీపంలో దేవాలయ ధ్వజస్తంభం, దేవాలయ శిథిలాలు మరియు భైరవ విగ్రహం ఉన్నాయి.నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు దిక్కులలో సమాన ఎత్తులో ఉండేవని స్థానికంగా చెబుతారు. శరభయ్య గుడివరకు ఈ దేవాలయ ప్రాంగణం విస్తరించి ఉండేదని కూడా చెప్పబడుతుంది.[24]

శిల్పారామం

[మార్చు]

పట్టణంలోని కోమటి చెరువు ప్రాంతం బైపాస్ రోడ్డులో 25 కోట్ల రూపాయలతో సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా సిద్దిపేట శిల్పారామం పేరిట పర్యాటక కేంద్రం నిర్మించబడుతోంది.

కోమటి చెరువు

[మార్చు]

కోమటి చెరువు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఉన్న ప్రముఖ చెరువులలో ఒకటి. ఇది పట్టణంలోని ముఖ్యమైన నీటి వనరుగా ఉండటమే కాకుండా పర్యాటక ఆకర్షణగా కూడా అభివృద్ధి చేయబడింది.[25] చెరువు చుట్టూ ఉద్యానవనాలు, నడక మార్గాలు, వినోద సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇటీవల కాలంలో చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జ్, గ్లో గార్డెన్, మ్యూజికల్ ఫౌంటెన్ వంటి ఆకర్షణలు నిర్మించబడడంతో ఇది స్థానిక ప్రజలకు మరియు పర్యాటకులకు విశ్రాంతి ప్రదేశంగా మారింది.[26]

ఆక్సిజన్ పార్క్

[మార్చు]

ఆక్సిజన్ పార్క్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేయబడిన ఒక పర్యావరణ పార్క్. పట్టణంలో పచ్చదనం పెంపొందించడం, ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించడం మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కోసం ఈ పార్క్ అభివృద్ధి చేయబడింది.[27] పార్క్‌లో నడక మార్గాలు, వివిధ రకాల చెట్లు మరియు మొక్కలు, పిల్లల ఆట స్థలాలు, విశ్రాంతి కోసం కూర్చునే ప్రదేశాలు వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది స్థానిక ప్రజలకు ఉదయం మరియు సాయంత్రం నడకకు, విశ్రాంతికి అనువైన ప్రదేశంగా ఉపయోగపడుతోంది.[28]

సుడా పార్క్

[మార్చు]

సుడా పార్క్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఉన్న ఒక ప్రజా వినోద పార్క్. దీనిని సిద్ధిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (SUDA) అభివృద్ధి చేసింది. పార్క్‌లో నడక మార్గాలు, పచ్చని తోటలు, పిల్లల ఆట స్థలాలు మరియు విశ్రాంతి కోసం కూర్చునే ప్రదేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది స్థానిక ప్రజలకు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో విశ్రాంతి మరియు వ్యాయామానికి అనువైన ప్రదేశంగా ఉపయోగపడుతోంది.[29]

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల

[మార్చు]

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఉన్న ఒక ప్రభుత్వ వైద్య విద్యాసంస్థ. ఇది తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఈ కళాశాల ద్వారా వైద్య విద్య (MBBS) అందించబడుతుంది మరియు దీనికి అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా పనిచేస్తుంది.[30]

కేంద్ర జిల్లా గ్రంథాలయం

[మార్చు]

కేంద్ర జిల్లా గ్రంథాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఉన్న ఒక ప్రజా గ్రంథాలయం. ఇది జిల్లా ప్రజలకు పుస్తకాలు, పత్రికలు మరియు అధ్యయనానికి అవసరమైన సమాచారం అందించే ముఖ్యమైన విద్యాసంస్థగా పనిచేస్తుంది. విద్యార్థులు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ముఖ్యమైన అధ్యయన కేంద్రంగా ఉపయోగపడుతుంది.[31]

విపంచి

[మార్చు]

విపంచి తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఏర్పాటు చేయబడిన ఒక సాంస్కృతిక వేదిక. ఇక్కడ సంగీత, సాహిత్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. ఇది స్థానిక కళాకారులు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇచ్చే ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది.[32]

స్వచ్ఛ బడి

[మార్చు]

స్వచ్ఛ బడి తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట ప్రాంతంలో ప్రారంభించబడిన ఒక పాఠశాల శుభ్రత కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, విద్యార్థుల్లో శుభ్రతపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉంది.[33]

లాల్ కమన్

[మార్చు]

లాల్ కమన్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఉన్న ఒక చారిత్రక ఆర్చ్ (గేటు). ఇది పట్టణంలోని పాత నిర్మాణాలలో ఒకటిగా గుర్తించబడింది మరియు స్థానికంగా ముఖ్యమైన గుర్తింపుగా ఉంది. సిద్దిపేట చరిత్రలో ఈ నిర్మాణం ప్రస్తావన ఉండటంతో పాటు పట్టణంలోని పాత వీధి నిర్మాణాలతో సంబంధం ఉన్న చారిత్రక అవశేషంగా భావించబడుతుంది.[34]

తెలంగాణ టూరిజం హరిత హోటల్

[మార్చు]

తెలంగాణ టూరిజం హరిత తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహించే అతిథి గృహాలు మరియు రెస్టారెంట్ల శ్రేణి. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు మరియు పర్యాటక ప్రాంతాలలో పర్యాటకులకు వసతి మరియు భోజన సౌకర్యాలు అందించడానికి ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. సిద్ధిపేట పట్టణంలో కూడా తెలంగాణ టూరిజం హరిత అతిథి గృహం ఏర్పాటు చేయబడింది, ఇది పట్టణానికి వచ్చే పర్యాటకులకు మరియు సందర్శకులకు వసతి సౌకర్యాన్ని అందిస్తుంది.[35]

ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్

[మార్చు]

ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ (L V Prasad Eye Institute) తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో పనిచేస్తున్న కంటి వైద్య సేవా కేంద్రాలలో ఒకటి. ఇది హైదరాబాద్‌లో ప్రధాన కేంద్రం కలిగిన ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సంస్థకు చెందిన భాగంగా పనిచేస్తుంది. ఈ సంస్థ కంటి సంబంధిత వ్యాధుల నిర్ధారణ, చికిత్స మరియు కంటి ఆరోగ్య సేవలను ప్రజలకు అందిస్తుంది.

సిద్ధిపేటలోని కేంద్రం ద్వారా ప్రాథమిక కంటి పరీక్షలు, దృష్టి లోపాల నిర్ధారణ, అవసరమైన చికిత్సలు మరియు అవసరమైతే ఉన్నత స్థాయి వైద్య కేంద్రాలకు రిఫర్ చేసే సేవలు అందించబడుతున్నాయి. ఈ సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయబడ్డాయి.[36]

సిద్దిపేట క్రికెట్ స్టేడియం

[మార్చు]

సిద్దిపేట క్రికెట్ స్టేడియం తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఉన్న ఒక క్రీడా మైదానం. ఈ స్టేడియం ప్రధానంగా క్రికెట్ పోటీల నిర్వహణ కోసం ఉపయోగించబడుతుంది. స్థానిక స్థాయిలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్‌లు, పాఠశాలలు మరియు కళాశాలల క్రీడా పోటీలు ఇక్కడ జరుగుతుంటాయి. పట్టణంలోని యువ క్రీడాకారులకు ఇది ముఖ్యమైన సాధన వేదికగా ఉపయోగపడుతుంది.[37]

సిద్దిపేట కోర్టు

[మార్చు]

సిద్దిపేట కోర్టు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ఉన్న న్యాయస్థానం. ఇది సిద్ధిపేట జిల్లా పరిధిలోని పౌర మరియు క్రిమినల్ కేసులను విచారించే జిల్లా న్యాయ వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. ఈ కోర్టు ద్వారా స్థానిక ప్రజలకు న్యాయ సేవలు అందించబడుతున్నాయి.[38]

సిద్దిపేట కోర్టు తెలంగాణ న్యాయ వ్యవస్థలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. జిల్లా మరియు మండల ప్రాంతాల నుండి వచ్చే వివిధ న్యాయ వివాదాలు, పౌర కేసులు, క్రిమినల్ కేసులు ఇక్కడ విచారణకు వస్తాయి. ఈ కోర్టు ద్వారా న్యాయ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.[39]

మోడల్ రైతు బజార్, సిద్ధిపేట

[మార్చు]

మోడల్ రైతు బజార్, సిద్ధిపేట సిద్దిపేట పట్టణానికి సంబంధించిన ఒక ఆధునిక రైతు మార్కెట్ (Model Rythu Bazaar). ఇది స్థానిక రైతులకి తమ పంటను నేరుగా విక్రయించుకునేందుకు, వినియోగదారులకు తాజా కూరగాయలు మరియు పళ్ళు ఎంతో తక్కువ మధ్యవర్తిత్వంతో అందించేందుకు ఏర్పాటుచేశారు. ఈ మోడల్ బజార్‌లో LED స్క్రీన్ల ద్వారా ధరలు చూపించడం, ప్రత్యేక స్టాల్స్, శీఘ్ర శైలిలో లాజిస్టిక్ సౌకర్యాలు, మరియు రక్షణ/పోలీసుల కమాండ్-కంట్రోల్ సెంటర్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.[40]

ఈ మోడల్ బజార్‌లో అనేక స్టాల్స్ ఏర్పాటు చేసి (ఉదాహరణకు కొన్నిసూట్ల నివేదికల ప్రకారం ~108 స్టాల్స్ ఉన్నాయి) వేలాది రైతులు తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను అమ్మేందుకు వస్తారు. ఇది నగరపు మార్కెట్ సరఫరా వ్యవస్థకును కూడా బలోపేతం చేసింది మరియు స్థానిక కౌలు విలువలకు పారదర్శకతను కల్పించింది.[41]

తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ విధానాలలో ఇది ఒక నమూనా (model) గా గుర్తింపబడి ఇతర ప్రాజెక్టులకి సూచనగా నిలిచింది; రాష్ట్ర/జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం మార్కెట్ నిర్వహణ, సెల్-ప్లానింగ్ మరియు ఫార్మర్ బెనిఫిట్ విధానాలు అమలు చేస్తుంది.[42]

రైలు రవాణా

[మార్చు]

సిద్దిపేట పట్టణానికి రైలు రవాణా సౌకర్యం ఇటీవల సంవత్సరాలలో అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించడానికి భారతీయ రైల్వేలు చేపట్టిన పలు ప్రాజెక్టులలో భాగంగా గజ్వేల్–సిద్దిపేట–కరీంనగర్ రైల్వే మార్గం అభివృద్ధి చేయబడుతోంది. ఈ మార్గం ద్వారా సిద్దిపేట పట్టణం సమీప జిల్లాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానం పొందుతోంది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వరకు రైలు ప్రయాణాలు మొదలయ్యాయి.. [43]

విద్య

[మార్చు]

సిద్దిపేట పట్టణం విద్యా రంగంలో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా గుర్తించబడింది. పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు మరియు వృత్తిపరమైన విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవి స్థానిక విద్యార్థులకు ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అవకాశాలను కల్పిస్తున్నాయి.[44]

సిద్దిపేటలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా విద్యను అందిస్తున్నాయి. జిల్లా స్థాయిలో ఉన్న పలు డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలు విద్యార్థులకు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ఈ విద్యాసంస్థలు ప్రాంతీయ విద్యాభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.[45]

సంస్కృతి

[మార్చు]

సిద్దిపేట పట్టణం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రాంతంగా గుర్తించబడింది. ఇక్కడి ప్రజలు తెలంగాణ జానపద సంప్రదాయాలు, పండుగలు మరియు కళారూపాలను ఎంతో ఆదరిస్తారు. స్థానికంగా జరిగే జాతరలు, పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.[46]

సిద్దిపేట ప్రాంతంలో ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగలు స్థానిక ప్రజల ఆచారాలు, విశ్వాసాలు మరియు సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తాయి. అదనంగా జానపద కళారూపాలు, పాటలు మరియు సంప్రదాయ నృత్యాలు కూడా ఈ ప్రాంత సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్నాయి.[47]

థియేటర్లు, సిద్దిపేట

[మార్చు]

సిద్దిపేట పట్టణంలో పలు సినిమా థియేటర్లు ఉన్నాయి, ఇవి స్థానిక ప్రజలకు వినోదం అందిస్తాయి. కొన్ని ప్రసిద్ధ థియేటర్లు:

  • ఆసియన్ బాలాజీ సినిమా – ప్రధానంగా తెలుగు చిత్రాలు ప్రదర్శించబడుతుంది.
  • శ్రీనివాస సినిమా – వివిధ భాషల సినిమాలను ప్రదర్శిస్తుంది.
  • వెంకటేశ్వర సినిమా – కుటుంబ మరియు యువకుల సమూహాల కోసం ప్రసిద్ధి.

[48]

షాపింగ్ మాల్స్

[మార్చు]

సిద్దిపేట పట్టణంలో ప్రసిద్ధ షాపింగ్ మాల్‌లు:

  • మాంగళ్య షాపింగ్ మాల్
  • సుఖీభవ షాపింగ్ మాల్
  • CMR షాపింగ్ మామాల్
  • వైభవం షాపింగ్ మామాల్
  • అనుపమ షాపింగ్ మాల్
  • చెన్నై షాపింగ్ మాల్

మరికొన్ని ప్రముఖ షాపింగ్ మాల్స్ సిద్దిపేట బస్టాండ్ పరిధిలో, మరికొన్ని సిద్దిపేట వీధుల్లోనూ ఉన్నాయి.

[49] [50]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
  1. 1.0 1.1 "Basic Information of Municipality". siddipetmunicipality.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 24 December 2015.
  2. "Siddipet municipal polls on April 6; counting on April 11". The Hindu (in Indian English). 20 March 2016. Retrieved 28 June 2016.
  3. 3.0 3.1 "జాతీయ స్థాయిలో మెరిసిన సిద్దిపేట‌.. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డుకు ఎంపిక‌". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-10. Archived from the original on 2021-11-10. Retrieved 2021-12-27.
  4. "History of Siddipet District". Siddipet District Official Website. Retrieved 9 March 2026.
  5. "Siddipet history and origin of name". Deccan Land. Retrieved 9 March 2026.
  6. "About Siddipet". Siddipet District Official Website. Retrieved 9 March 2026.
  7. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-08-18.
  8. "General Elections to Assembly Constituencies: Trends & Results Dec-2023 Assembly Constituency 33 - Siddipet (Telangana)". Election Commissioner of India. Retrieved 13 March 2024.
  9. "సిద్దిపేటలో కలెక్టరేట్,పోలీస్ కమిషరేట్ కార్యాలయాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్". telugu oneindia. 2021-06-20. Archived from the original on 2021-06-20. Retrieved 2023-02-23.
  10. Today, Telangana (2021-06-20). "CM KCR inaugurates newly constructed offices in Siddipet". Telangana Today. Archived from the original on 2021-06-24. Retrieved 2023-02-23.
  11. TelanganaToday (2018-06-04). "Laxma Reddy inaugurates Siddipet Medical College". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-08-11. Retrieved 2020-09-05.
  12. telugu, NT News (2022-03-17). "ఒకే కాంప్లెక్స్‌లో భరోసా, సఖి, ఓల్డ్ ఏజ్ హోమ్‌ల నిర్మాణం : మత్రి హరీశ్‌రావు". Namasthe Telangana. Archived from the original on 2022-03-17. Retrieved 2022-03-17.
  13. Velugu, V6 (2022-04-20). "సిద్ధిపేటను శుద్ధిపేటగా చూడాలనుంది". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-21. Retrieved 2022-04-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  14. telugu, NT News (2022-04-20). "సిద్దిపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో వారిదే కీలక పాత్ర : మంత్రి హరీశ్‌రావు". www.ntnews.com. Archived from the original on 2022-04-21. Retrieved 2022-04-21.
  15. telugu, NT News (2022-06-10). "కేసీఆర్‌ నగర్‌లో బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-06-10. Retrieved 2022-06-15.
  16. "Siddipet Municipality". Siddipet District Official Website. Retrieved 9 March 2026.
  17. "Mission Bhagiratha". Government of Telangana. Retrieved 9 March 2026.
  18. "Telecom Services in India". Department of Telecommunications, Government of India. Retrieved 9 March 2026.
  19. "Telangana State Southern Power Distribution Company Limited". TSSPDCL. Retrieved 9 March 2026.
  20. Naidu, Muvva Krishnama. "IT tower in Siddipet | తెలంగాణలో ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు". Hindustantimes Telugu. Archived from the original on 2023-06-15. Retrieved 2023-06-17.
  21. "Minister KTR - ఐటీ ట‌వ‌ర్ ఏర్పాటుతో 1500మందికి ఉపాధి". Prabha News. 2023-06-15. Archived from the original on 2023-06-15. Retrieved 2023-06-17.
  22. Telugu, TV9 (2020-12-10). "CM KCR Siddipet tour: సిద్ధిపేట పేదల కల నెరవేరబోతోంది.. అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం". TV9 Telugu. Archived from the original on 2023-06-12. Retrieved 2023-06-17.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  23. "సిద్ధిపేట చరిత్ర". Deccan Land (in Telugu). 1 April 2025. Retrieved 9 March 2026.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  24. 24.0 24.1 24.2 24.3 24.4 24.5 "సిద్ధిపేట చరిత్ర". Deccan Land (in Telugu). 1 April 2025. Retrieved 9 March 2026.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  25. "Komati Cheruvu Siddipet". Siddipet District Official Website. Retrieved 9 March 2026.
  26. "Komati Cheruvu tourism". Retrieved 9 March 2026.
  27. "Oxygen Park Siddipet". IndiaTour360. Retrieved 9 March 2026.
  28. "Oxygen Park Nacharpalle Siddipet". Justdial. Retrieved 9 March 2026.
  29. "SUDA Park Siddipet". Siddipet District Official Website. Retrieved 9 March 2026.
  30. "Government Medical College Siddipet". Directorate of Medical Education Telangana. Retrieved 9 March 2026.
  31. "District Library Siddipet". Telangana State Library Department. Retrieved 9 March 2026.
  32. "Vipanchi Siddipet Cultural Centre". Siddipet District Official Website. Retrieved 9 March 2026.
  33. "Swachh Badi Programme Telangana". Government of Telangana. Retrieved 9 March 2026.
  34. "సిద్ధిపేట చరిత్ర". Deccan Land (in Telugu). 1 April 2025. Retrieved 9 March 2026.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  35. "సిద్ధిపేట చరిత్ర". Deccan Land (in Telugu). 1 April 2025. Retrieved 9 March 2026.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  36. "LVPEI launches eye screening programme in Siddipet". The New Indian Express. 16 October 2023. Retrieved 9 March 2026.
  37. "Cricket Grounds in Siddipet". Justdial. Retrieved 9 March 2026.
  38. "District Courts of India – Siddipet". eCourts India. Retrieved 9 March 2026.
  39. "Siddipet District Court Information". eCourts India. Retrieved 9 March 2026.
  40. "Siddipet gets posh Model Rythu Bazaar". The Hans India. 6 February 2018. Retrieved 9 March 2026.
  41. "In a first, Siddipet market to sell all under one roof". Times of India. 7 February 2019. Retrieved 9 March 2026.
  42. "Agriculture Marketing". Siddipet District Official Website. Retrieved 9 March 2026. {{cite web}}: Text "Siddipet" ignored (help)
  43. "Kothapalli–Manoharabad railway line project". Indian Railways. Retrieved 9 March 2026.
  44. "Education in Siddipet District". Siddipet District Official Website. Retrieved 9 March 2026.
  45. "Educational Institutions in Siddipet". Government of Telangana. Retrieved 9 March 2026.
  46. "Culture of Telangana". Government of Telangana. Retrieved 9 March 2026.
  47. "Festivals of Telangana". Telangana Tourism. Retrieved 9 March 2026.
  48. "Cinema Theatres in Siddipet". Justdial. Retrieved 9 March 2026.
  49. "Shopping Centres in Siddipet". Justdial. Retrieved 9 March 2026.
  50. "Siddipet Shopping Malls Overview". 99acres. Retrieved 9 March 2026.