సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల భవనం
రకంప్రభుత్వ
స్థాపితంజూన్ 3, 2018
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
స్థానంసిద్ధిపేట, తెలంగాణ, భారతదేశం 502114
18°05′32″N 78°49′17″E / 18.0921599°N 78.8213375°E / 18.0921599; 78.8213375
కాంపస్Sub-urban
జాలగూడుhttp://gmcsiddipet.org
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల is located in Telangana
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల
Location in Telangana
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల is located in India
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల
సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల (India)

సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల తెలంగాణలోని సిద్దిపేటలో ఉన్న వైద్య కళాశాల. దీనికి 2018 జనవరిలో భారత వైద్య మండలి (ఎంఐసి) నుండి అనుమతి లభించింది. ఈ కళాశాల కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.[1][2]

చరిత్ర

[మార్చు]

2016, అక్టోబరు 11న ఉదయం గం. 11.13 ని.లకు సిద్ధిపేట పట్టణంలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ప్రాంరంభించి,సిద్ధిపేట జిల్లాను అధికారికంగా ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందించడానికి సిద్ధిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు.

2016, అక్టోబరు 22 సిద్దిపేటలో కొత్త వైద్య కళాశాల స్థాపనకు సంబంధించి మొదటి ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అప్పటి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మా రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీశ్ రావు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పాల్గొని కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ తరువాత సిద్ధిపేటలో వైద్య కళాశాల, ఆసుపత్రి స్థాపన కోసం భూమిని సేకరించడం, బడ్జెట్ కేటాయింపులు మంజూరు, బోధన, బోధనేతర, పారా మెడికల్, ఇతర సహాయక సిబ్బంది నియామకానికి పోస్టుల అనుమతులు జరిగాయి.[3]

ఐదున్నర నెలల రికార్డు సమయంలో ఐదు అంతస్తుల భవనం నిర్మాణం పూర్తి చేసుకొని 2018, జూన్ 3న ఈ వైద్య కళాశాల ప్రారంభించబడింది. ఎంఐసి 150 సీట్లకు అనుమతి ఇచ్చి 2018-19లో తొలి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది.[4][5][6] 50 ఎకరాలలో విస్తరించి ఉన్న కళాశాల, ఆసుపత్రి నిర్మాణానికి 700 కోట్లు ఖర్చు అయింది.[7]

2020 డిసెంబరు 10న సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించి, 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశాడు.[8]

ఆసుపత్రి

[మార్చు]

సిద్ధిపేటలోని 100 పడకల ఆసుపత్రిని 300 పడకల అసుపత్రిగా మార్చారు. ఈ ఆసుపత్రి వైద్య కళాశాలలో భాగంగా ఉంటుంది. ఇందులో తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం ఉన్నాయి.

కోర్సులు - శాఖలు

[మార్చు]
 • అనాటమీ
 • బయోకెమిస్ట్రీ
 • ఫిజియోలాజీ
 • బయోకెమిస్ట్రీ
 • మైక్రోబయోలాజీ
 • ఫోరెన్సిక్ మెడిసిన్
 • పాథాలజీ
 • ఫార్మాలజీ
 • పిఎస్ఎం
 • జెనరల్ సర్జరీ
 • జనరల్ మెడిసిన్
 • కమ్యూనిటీ మెడిసిన్
 • గైనకాలజీ
 • ఆర్థోపెడిక్స్
 • ఈ.ఎన్.టి.
 • ఆప్తాల్మోలజీ
 • సైకియాట్రీ
 • పీడియాట్రిక్స్
 • అనస్థీషియాలజీ

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Siddipet gets a medical college; 150 seats on offer". The Times of India. 5 June 2018. Archived from the original on 2018-06-09. Retrieved 2020-09-05.
 2. The Times of India (2018-05-22). "Telangana to get two new govt medical colleges in Suryapet, Nalgonda". www.timesofindia.indiatimes.com. Archived from the original on 2018-05-23. Retrieved 2020-09-05.
 3. "Siddipet Government Medical College History" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-05.
 4. TelanganaToday (2018-06-04). "Laxma Reddy inaugurates Siddipet Medical College". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-08-11. Retrieved 2020-09-05.
 5. Telangana Today, Gopal M Sai (2018-06-02). "Centre nods to establish medical college in Siddipet". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-01. Retrieved 2020-09-05.
 6. The Hans India, Telangana (2018-05-17). "Telangana to get 300 more MBBS seats this year". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-05-17. Retrieved 2020-09-05.
 7. The Times of India, Preeti Biswas (2018-01-13). "Siddipet: 150 new MBBS seats for T, Siddipet college loses out". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-01-13. Retrieved 2020-09-05.
 8. Telugu, TV9 (2020-12-10). "CM KCR Siddipet tour: సిద్ధిపేట పేదల కల నెరవేరబోతోంది.. అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం". TV9 Telugu. Retrieved 2023-06-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు

[మార్చు]