ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2023, సెప్టెంబరు 15
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు100
స్థానంఖమ్మం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాలగూడుకళాశాల వెబ్సైటు

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల.[1] గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. 2023 ఏప్రిల్ 10న నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2]

ఏర్పాటు

[మార్చు]

ఖమ్మం జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేయనున్నట్టు 2022 మార్చి7న అసెంబ్లీలో ప్రకటించబడింది. వైద్య కళాశాల ఏర్పాటుకు 2022 ఆగస్టు 6న ఉత్తర్వులు విడుదల చేసింది. వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం తొలివిడతగా 166 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. కళాశాల ఏర్పాటుకు 30ఎకరాల స్థలం అవసరం ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న కలెక్టరేట్‌ భవనం, ఆర్‌అండ్‌బీ కార్యాలయం స్థలాన్ని అధికారులు సర్వే చేశారు.[3]

నిర్మాణం, ప్రారంభం

[మార్చు]

8.5 కోట్ల రూపాయలతో పట్టణంలోని పాత కలెక్టరేట్‌ భవనాన్ని ఆధునీకరించి ప్రభుత్వ వైద్య కళాశాలగా మార్చబడింది. ఇందులో పరిపాలన విభాగం, లైబ్రరీ, పరీక్షా కేంద్రాలు, టీచింగ్‌ హాల్స్‌, మ్యూజియం, బయో కెమిస్ట్రీ, క్లినికల్‌ ఫిజియాలజీ, హెమటాలజీ, అంఫిబియా ల్యాబ్స్‌, డిసిక్షన్‌, లెక్చరర్‌ హాల్స్‌, బయోకెమిస్ట్రీ, అనాటమీశాఖలు, విద్యార్థినీ విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్స్‌ నిర్మించబడ్డాయి.[4]

2023 సెప్టెంబరు 14న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ లు కలిసి వైద్య కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోతు హరిప్రియ, రాములు నాయక్‌, మెచ్చా నాగేశ్వరరావు తదితరులతో ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.[5]

కోర్సులు - శాఖలు

[మార్చు]
 • అనాటమీ
 • ఫార్మాకాలజీ
 • ఫిజియోలాజీ
 • బయోకెమిస్ట్రీ
 • పాథాలజీ
 • మైక్రోబయోలాజీ
 • ఫోరెన్సిక్ మెడిసిన్
 • జెనరల్ సర్జరీ
 • ఆర్థోపెడిక్స్
 • ఓటో-రైనో-లారిగోలజీ
 • ఆప్తాల్మోలజీ
 • జనరల్ మెడిసిన్
 • టిబి & ఆర్‌డి
 • డివిఎల్
 • సైకియాట్రీ
 • పీడియాట్రిక్స్
 • ఓబిజీ
 • అనస్థీషియాలజీ
 • కమ్యూనిటీ మెడిసిన్
 • రేడియోడియాగ్నోసిస్
 • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
 • టీబీసీడీ
 • సీటీ సర్జరీ
 • న్యూరో సర్జరీ
 • న్యూరాలజీ
 • ప్లాస్టిక్‌ సర్జరీ
 • యూరాలజీ
 • గాస్ట్రోఎంట్రాలజీ
 • ఎండోక్రైనాలజీ
 • నెఫ్రాలజీ
 • కార్డియాలజీ
 • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
 • ఈఎన్‌టీ
 • ఆప్తల్
 • అనస్తీషియా
 • డెంటల్

తరగతుల ప్రారంభం

[మార్చు]

విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఆరుగురు ప్రొఫెసర్లు, ఐదుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతోపాటు ఇతర సిబ్బంది నియమితులయ్యారు.

2023 సెస్టెంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[6][7] ఈ కార్యక్రమంలో కళాశాల నుండి రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Khammam medical college gets NMC nod for 100 MBBS seats". The Times of India. 2023-04-12. ISSN 0971-8257. Archived from the original on 2023-04-11. Retrieved 2023-09-14. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2023-04-12 suggested (help)
 2. Today, Telangana (2023-04-11). "NMC green signal for Khammam government medical college". Telangana Today. Archived from the original on 2023-04-11. Retrieved 2023-09-14.
 3. Andhra Jyothy (7 August 2022). "తొలి అడుగుపడింది". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
 4. telugu, NT News (2023-09-14). "ముస్తాబైన ఖమ్మం మెడికల్‌ కళాశాల". www.ntnews.com. Archived from the original on 2023-09-14. Retrieved 2023-09-14.
 5. ABN (2023-09-15). "మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో చేరువగా వైద్య విద్య". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-25. Retrieved 2023-09-25.
 6. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
 7. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-21.