రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ, ఆదిలాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ
దంత కళాశాల భవనం
రకంవైద్య కళాశాల, పరిశోధన సంస్థ
స్థాపితం2008
స్థానంఆదిలాబాద్, తెలంగాణ, భారతదేశం

రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్) తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ లో ఉన్న ఒక వైద్య విజ్ఞాన సంస్థ.[1][2] ఇది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కళాశాలగా ఉంది.

చరిత్ర[మార్చు]

జిల్లా ఆసుపత్రిగా కొనసాగుతున్న ఈ ఆసుపత్రిని 2008వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (2004-2009) రిమ్స్ కళాశాలగా మర్చాడు. 2008లో మొదటి బ్యాచ్ ప్రారంభించబడింది. 2018 సంవత్సరంనాటికి 5 బ్యాచ్‌లు వైద్యవిద్యను పూర్తి చేసుకున్నాయి.

సీట్ల వివరాలు[మార్చు]

2019-20 నుండి 125 సీట్లు పెరగడంలో, మొత్తం 525 సీట్లు ఉన్నాయి.

అభివృద్ధి పనులు[మార్చు]

రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థలో మరిన్ని సదుపాయాలను ఏర్పాటుచేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 20కోట్ల రూపాయలు మంజూరు చేశాడు.[3]

సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి[మార్చు]

రిమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా రూ. 150 కోట్లతో 210 బెడ్స్‌తో నిర్మించిన సూపర్‌ స్పెషలిటీ ఆసుపత్రిని 2022, మార్చి 3న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించాడు.[4] ఆదిలాబాద్‌ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఇందులో 42 ఐసీయూలు, 8 స్పెషాలిటీ వింగ్స్, రేడియాలజీ ల్యాబ్ ఏర్పాటు చేయబడ్డాయి.[5] ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాదు ఎమ్మెల్యే జోగు రామన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఇతర ప్రజా ప్రతినిధులు, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-13. Retrieved 2020-09-16.
  2. "Darshan has jaundice". 10 September 2011.
  3. Telangana Today, Adilabad (27 August 2020). "Jogu Ramanna thanks KCR for granting Rs 20 crore to RIMS-Adilabad". Archived from the original on 18 September 2020. Retrieved 18 September 2020.
  4. CH, Nagaraju (2022-03-03). "ఆదిలాబాద్ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు: మంత్రి హరీశ్". Prabha News. Archived from the original on 2022-03-03. Retrieved 2022-03-03.
  5. Telugu, TV9 (2022-03-03). "Harish Rao: నేడు ఆదిలాబాద్ కు మంత్రి హరీష్ రావు.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న మంత్రి." TV9 Telugu. Archived from the original on 2022-03-03. Retrieved 2022-03-03.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు[మార్చు]