వైద్య కళాశాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వైద్య కళాశాలు (Medical Colleges) ప్రపంచ వ్యాప్తంగా వైద్య విద్య (Medical Education) ను అందించి వైద్యుల్ని సుశిక్షితుల్ని చేసే విద్యాలయాలు (Educational Institutions). వీటిని అనుబంధంగా కొన్ని పెద్ద వైద్యశాలలు (Hospitals) ఉంటాయి.

సాధారణంగా వైద్య కళాశాలలు వైద్యంలో డిగ్రీ కోర్సును, మాస్టర్స్ కోర్సును, పి.హెచ్.డి. సదుపాయాన్ని అందజేస్తాయి. ఇంతే కాకుండా వైద్యవిద్యకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, లాబొరేటరీ టెక్నాలజీ వంటి కోర్సులను కూడా బోధిస్తాయి. వైద్య కళాశాలలకు అనుబంధంగా హాస్పిటల్ ద్వారా వైద్య సదుపాయం కూడా ఉంటుంది. వైద్యవిద్యలో బోధించే కొన్ని విద్యావిభాగాలు (సబ్జెక్టులు) - హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, ప్రసూతి వైద్యం (ఆబ్స్‌టెట్రిక్స్ మరియు గైనకాలజీ), ఎనస్తీషియాలజీ, అంతర్గత వైద్యం (ఇంటర్నల్ మెడిసిన్), కుటుంబ వైద్యం, శస్త్రచికిత్స (సర్జరీ), జెనిటిక్స్, పాథాలజీ (రోగ నిర్ధారక శాస్త్రం). ఇవే కాకుండా గుండె, కన్ను, ముక్కు, చెవి, చర్మం, మెదడు, మానసిక ప్రవృత్తి వంటి విషయాలకు సంబంధించిన విద్యాబోధనలకై ప్రత్యేక విభాగాలుంటాయి.

ప్రవేశం[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా వైద్యకళాశాలలో ప్రవేశానికి అర్హతలు, ప్రవేశ విధానం, బోధనా విధానం, కోర్సు ప్రణాళిక వంటి విషయాలలో పెక్కు వైవిధ్యాలున్నాయి. ఏమైనా వైద్యకళాశాలలలో ప్రవేశం ప్రపంచమంతటా చాలా ఎక్కువ పోటీ కలిగి ఉంటుంది. ప్రవేశానికి ఎంసెట్, GAMSAT, MCAT, UMAT, NMAT, BMAT, UKCAT వంటి అనేక ప్రవేశ పరీక్షలు నిర్వహింపబడుతాయి. భారతదేశం, చైనా, మరికొన్ని దేశాలలో వైద్యకళాశాలలలో ప్రవేశం "ప్రి యూనివర్సిటీ కోర్సు" తరువాత జరుగుతుంది. అయితే అమెరికా, కెనడా వంటి దేశాలలో ఒక డిగ్రీ కోర్సు తరువాత వైద్య కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఈ "గ్రాడ్యుయేట్ ఎంట్రీ విధానం" క్రమంగా ప్రవేశపెట్టబడుతున్నది. దాదాపు అన్ని దేశాలలోను వైద్య విద్య, వైద్యవృత్తులపై ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణ ప్రబలంగా ఉంటుంది. వైద్య విద్య పూర్తి చేసినా గాని ప్రభుత్వం ప్రత్యేక లైసెన్సు ఇచ్చిన తరువాతనే వైద్యవృత్తి ప్రాక్టీసు అనుమతించబడుతుంది. వైద్య కళాశాలలు WHO Directory of Medical Schools లేదా FAIMER లేదా International Medical Education Directory వంటి ప్రామాణిక జాబితాలలో ఉండడం వాటి గుర్తింపుకు అవసరం.

భారత దేశంలో వైద్య కళాశాలలో ప్రవేశం CBSE లేదా ఇంటర్మీడియెట్ విద్యల తరువాత అనుమతించబడుతుంది. కాని ప్రవేశానికి గుర్తింపబడిన ప్రవేశపరీక్షలు చాలా ముఖ్యమైనవి. ఈ పరీక్షలలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. భారత దేశంలో వైద్యకళాశాలలు ఎం.బి.బి.ఎస్., ఎం.డి., ఎం.ఎస్. వంటి డిగ్రీలను ప్రదానం చేస్తాయి. భారతదేశంలో వైద్యవిద్య "మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా"చే నియంత్రింపబడుతుంది.[1] PG diploma may also be obtained through the National Board of Examinations.[2]

ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలలు[మార్చు]

ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, విజయవాడ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]