Jump to content

నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల
కళాశాల ప్రధాన ప్రవేశ ద్వారం
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2013
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
చిరునామనిజామాబాదు జిల్లా, నిజామాబాదు, తెలంగాణ, భారతదేశం 503001
18°40′23″N 78°05′55″E / 18.6731625°N 78.0986808°E / 18.6731625; 78.0986808
నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల is located in Telangana
నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల
Location in Telangana
నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల is located in India
నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల
నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల (India)

నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదులో ఉన్న ఒక వైద్య కళాశాల.[1][2] ఇందులో 2013-14 నుండి విద్యా సంవత్సరం ప్రారంభించబడింది.[3][4] ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.

చరిత్ర

[మార్చు]

2010 సంవత్సరంలో నిజామాబాదు నగరంలో వైద్య కళాశాలని ప్రారంభించాలని భారత వైద్య మండలి నుండి నోటీసు వచ్చింది. 2012 చివరి నాటికి పాత నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఈ వైద్య కళాశాల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పునరుద్ధరించాయి. 100 సీట్లతో 2013-14 సంవత్సరం నుంచి ఎంబిబిఎస్‌ కోర్సుకు విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడానికి భారత వైద్య మండలి నుండి అనుమతి పొందింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ప్రసూతి, గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్ (జూలై -17 సెషన్ ప్రకారం నవీకరించబడింది) వంటి వివిధ ప్రత్యేక కోర్సులలో ఈ కళాశాలలో డిఎన్బి సీట్లు ఉన్నాయి.

కోర్సులు - శాఖలు

[మార్చు]
  • అనాటమీ
  • ఫార్మాకాలజీ
  • ఫిజియోలాజీ
  • బయోకెమిస్ట్రీ
  • పాథాలజీ
  • మైక్రోబయోలాజీ
  • ఫోరెన్సిక్ మెడిసిన్
  • జెనరల్ సర్జరీ
  • ఆర్థోపెడిక్స్
  • ఓటో-రైనో-లారిగోలజీ
  • ఆప్తాల్మోలజీ
  • జనరల్ మెడిసిన్
  • టిబి & ఆర్‌డి
  • డివిఎల్
  • సైకియాట్రీ
  • పీడియాట్రిక్స్
  • ఓబిజీ
  • అనస్థీషియాలజీ
  • కమ్యూనిటీ మెడిసిన్
  • రేడియోడియాగ్నోసిస్
  • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్

సిబ్బంది

[మార్చు]

2012లో జీవో నెం. 150 ద్వారా కళాశాలకు పరిపాలన విభాగంలో 189 పోస్టులు, ప్రిన్సిపల్‌ విభాగంలో 50 పోస్టులు, సూపరింటెండెంట్‌ విభాగంలో 15 పోస్టులు, క్లినికల్‌ విభాగంలో 87 పోస్టులు, వైద్య విద్య బోధనకు సంబంధించి అన్ని రకాల ప్రొఫెసర్లు కలిపి 311 పోస్టులు మంజూరయ్యాయి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. P. Ram Mohan. "Government medical college soon in Nizamabad". The Hindu. Retrieved 2020-09-04.
  2. "Nizamabad medical college yet to receive MCI nod". The Times of India. Archived from the original on 2013-02-16. Retrieved 2020-09-04.
  3. "Nizamabad medical college still remains a pipe dream". The Times of India. Archived from the original on 2013-02-16. Retrieved 2020-09-04.
  4. "Latest News in Hyderabad, Telangana, Andhra Pradesh - THE HANS INDIA". thehansindia.info. Archived from the original on 2013-02-18. Retrieved 2020-09-04.

ఇతర లంకెలు

[మార్చు]