నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాల
రకంప్రభుత్వ వైద్య విద్య
స్థాపితం2023, సెప్టెంబరు 15
అనుబంధ సంస్థకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
విద్యార్థులు100
స్థానంనిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాలగూడుకళాశాల వెబ్సైటు

నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల. గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2023లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2023-24 విద్యా సంవత్సరానికి 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[1]

ఏర్పాటు[మార్చు]

నిర్మల్‌ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధ వైద్య కళాశాలను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2022 ఆగస్టు 9న పరిపాలన అనుమతులతో జీవోను విడుదల చేసింది.[2]

నిర్మాణం[మార్చు]

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో 25 ఎకరాలలో 166 కోట్ల రూపాయలతో ఆరు బ్లాకులు, నాలుగు సెల్లార్లు, మూడు ఫ్లోర్‌లలో ఈ వైద్య కళాశాల నిర్మించబడింది. 2022 మే నెలలో నిర్మాణ పనులు ప్రారంభమై, 2023 ఆగస్టులో నిర్మాణం పూర్తియింది. 5 ఎకరాలలో 40 కోట్ల రూపాయలతో 250 పడకలతో జిల్లా అనుబంధ ఆసుపత్రి నిర్మించబడింది.[3]

కోర్సులు - శాఖలు[మార్చు]

 • అనాటమీ
 • ఫార్మాకాలజీ
 • ఫిజియోలాజీ
 • బయోకెమిస్ట్రీ
 • పాథాలజీ
 • మైక్రోబయోలాజీ
 • ఫోరెన్సిక్ మెడిసిన్
 • జెనరల్ సర్జరీ
 • ఆర్థోపెడిక్స్
 • ఓటో-రైనో-లారిగోలజీ
 • ఆప్తాల్మోలజీ
 • జనరల్ మెడిసిన్
 • టిబి & ఆర్‌డి
 • డివిఎల్
 • సైకియాట్రీ
 • పీడియాట్రిక్స్
 • ఓబిజీ
 • అనస్థీషియాలజీ
 • కమ్యూనిటీ మెడిసిన్
 • రేడియోడియాగ్నోసిస్
 • ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్
 • టీబీసీడీ
 • సీటీ సర్జరీ
 • న్యూరో సర్జరీ
 • న్యూరాలజీ
 • ప్లాస్టిక్‌ సర్జరీ
 • యూరాలజీ
 • గాస్ట్రోఎంట్రాలజీ
 • ఎండోక్రైనాలజీ
 • నెఫ్రాలజీ
 • కార్డియాలజీ
 • ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్
 • ఈఎన్‌టీ
 • ఆప్తల్
 • అనస్తీషియా
 • డెంటల్

ఎంపిక[మార్చు]

ఈ కళాశాలలో ప్రతి సంవత్సరం 100 సీట్ల (85 శాతం సీట్లు రాష్ట్ర కోటా, 15 శాతం సీట్లు ఆలిండియా కోటా) చొప్పున ఐదేళ్ళపాటు 500 సీట్లను భర్తీ చేస్తారు.

తరగతుల ప్రారంభం[మార్చు]

ఈ కళాశాలలో మొత్తం ఆరుగురు ప్రొఫెసర్లు, పదిమంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 40మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు నియమించబడ్డారు.

2023 సెస్టెంబరు 15 నుండి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి 9 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించాడు.[4][5] ఈ కార్యక్రమంలో కళాశాల నుండి దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "NMC grants permission for govt medical college in Nirmal". www.deccanchronicle.com. 2023-05-13. Archived from the original on 2023-05-25. Retrieved 2023-09-11.
 2. telugu, NT News (2022-08-10). "నిర్మల్‌లో వైద్య కళాశాల ఏర్పాటుకు జీవో విడుదల..అంబరాన్నంటిన సంబురాలు". www.ntnews.com. Archived from the original on 2022-08-11. Retrieved 2023-09-11.
 3. telugu, NT News (2023-09-05). "మెడికల్‌ కళాశాల రెడీ". www.ntnews.com. Archived from the original on 2023-09-05. Retrieved 2023-09-11.
 4. "KCR: వైద్య విద్యలో నవశకం.. 9 మెడికల్‌ కళాశాలలు ప్రారంభం". EENADU. 2023-09-15. Archived from the original on 2023-09-15. Retrieved 2023-09-21.
 5. telugu, NT News (2023-09-15). "CM KCR | ఒకేసారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం ఇది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-09-17. Retrieved 2023-09-21.