Jump to content

తెలంగాణ వైద్య విధాన పరిషత్తు

వికీపీడియా నుండి
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు
సంస్థ వివరాలు
స్థాపన జూన్ 2, 2014
అధికార పరిధి తెలంగాణ ప్రభుత్వం
ప్రధానకార్యాలయం డిఎం, హెచ్ఎస్ క్యాంపస్, సుల్తాన్ బజార్, హైదరాబాదు, తెలంగాణ
సంబంధిత మంత్రి ఈటెల రాజేందర్, (వైద్య ఆరోగ్య మంత్రివ్వ శాఖ)
కార్యనిర్వాహకులు డా. బి. శివ ప్రసాద్, (ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్)
వెబ్‌సైటు
https://vvp.telangana.gov.in

తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టిజివివిపి) తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగం.[1]

ఏర్పాటు

[మార్చు]

1986 చట్టం ద్వారా స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 2014, జూన్ 2న వేరుచేయబడి ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఏర్పడింది.[2]

విధులు

[మార్చు]

30 నుండి 350 వరకు మంచాలు గల మధ్యస్థాయి ఆసుపత్రుల బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఈ ఆసుపత్రులలోని వైద్యులు, ఇతర సిబ్బందిని తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఉద్యోగాల ద్వారా భర్తీ చేస్తుంది.[3]

కార్యకలాపాలు

[మార్చు]

తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఈ క్రింది అంశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తుంది.[4]

  1. ఆసుపత్రి భవనాల నిర్వహణ, పారిశుధ్యం
  2. ప్రధాన, చిన్న పరికరాల సదుపాయం, నిర్వహణ, పర్యవేక్షణ
  3. మందులు, వినియోగ వస్తువుల సదుపాయం
  4. ప్రమోషన్లు, సీనియారిటీ, బదిలీలు, పోస్టింగ్‌లు, శిక్షణలు, క్రమశిక్షణ చర్యలు మొదలైన అన్ని ఉద్యోగుల సేవా అంశాలు
  5. ఆసుపత్రుల పనితీరు సమీక్ష
  6. ఆర్థిక కేటాయింపు

పరిధి

[మార్చు]

తెలంగాణలోని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు కూడా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 103 ఏరియా ఆసుపత్రులు, 8 జిల్లాస్థాయి ఆసుపత్రులు, 233 ఆయుర్వేద, 260 యునాని ఆసుపత్రులు దీని పరిధిలో ఉన్నాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. "Welcome to Commissionerate of Health Family Welfare". Archived from the original on 2015-05-01. Retrieved 2020-08-23. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. ఆంధ్రజ్యోతి (13 March 2018). "వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల విభజన". www.andhrajyothy.com. Archived from the original on 23 August 2020. Retrieved 23 August 2020.
  3. More doctors for Telangana hospitals
  4. "TVVP ACTIVITIES". vvp.telangana.gov.in. Archived from the original on 2018-07-27. Retrieved 2020-08-24.
  5. "TELANGANA VAIDYA VIDHANA PARISHAD". vvp.telangana.gov.in. Archived from the original on 2018-07-27. Retrieved 2020-08-23.

ఇతర లంకెలు

[మార్చు]

తెలంగాణ వైద్య విధాన పరిషత్తు అధికారిక వెబ్సైటు Archived 2020-11-30 at the Wayback Machine