Jump to content

ఈటెల రాజేందర్

వికీపీడియా నుండి
ఈటల రాజేందర్
ఈటెల రాజేందర్

ఈటల రాజేందర్


పదవీ కాలం
4 జూన్ 2024 – ప్రస్తుతం
ముందు రేవంత్ రెడ్డి
నియోజకవర్గం మల్కాజ్‌గిరి

తెలంగాణ శాసనసభ్యుడు
పదవీ కాలం
2021 నవంబరు 2 – డిసెంబర్ 2023
తరువాత పాడి కౌశిక్ రెడ్డి
నియోజకవర్గం హుజురాబాద్

తెలంగాణ శాసనసభ్యుడు
పదవీ కాలం
మే 2009 – జూన్ 2021
నియోజకవర్గం హుజురాబాద్

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి
పదవీ కాలం
2019 ఫిబ్రవరి 12 – 2021 మే 1

తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖామంత్రి
పదవీ కాలం
2014 జూన్ 2 – 2018 సెప్టెంబరు 6

వ్యక్తిగత వివరాలు

జననం (1964-03-20)1964 మార్చి 20
క‌మ‌లాపూర్‌ కరీంనగర్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ఈటల మల్లయ్య[1]
జీవిత భాగస్వామి ఇ. జ‌మున[2]
సంతానం నితిన్ రెడ్డి , నీతా రెడ్డి [3][4]
నివాసం శామీర్‌పేట్, హైదరాబాద్
మతం హిందూ
జూన్ 3, 2014నాటికి

ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. అతను తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక తొలి ఆర్థిక మంత్రిగా పనిచేశాడు.[5][6] ప్రస్తుతం మల్కాజ్ గిరి నియోజవర్గ లోక్ సభ సభ్యుడు.[7]

జననం

[మార్చు]

ఈటల రాజేందర్ 1964 మార్చి 20 లో జన్మించారు.విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది.కేశవ్ మెమోరియల్ స్కూల్‌లో పదో తరగతి,1984లో మసాబ్ ట్యాంక్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. ముదిరాజు కులానికి చెందిన ఆయన, రెడ్డి కులానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు.[8] కొడుకు నితిన్ రెడ్డి, కూతురు నీతా రెడ్డి ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి గెలుపొందిన ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి, 2004 ఎన్నిక‌ల్లో క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటిచేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్‌ రెడ్డి పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటల తన వాగ్ధాటితో అందరిని ఆకట్టుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్‌ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు పై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో |ముద్దసాని దామోదర రెడ్డి పై గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[9]

ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డి పై గెలిచి[10] కెసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.[11][12][13]

ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో 2021, మే 1న ఆయన నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు బదిలీ జరిగింది.[14][15][16] ఆయనను 2021 మే 2 న మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు.[17] అతను రాజేందర్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని 2021 మే 31 న కలిశాడు. అతను టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి 2021 జూన్ 12 న రాజీనామా చేశాడు.[18] ఆయన 2021 జూన్ 4 న ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. అతను బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో 2021 అక్టోబరు 7న ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడయ్యాడు.[19] ఈటల రాజేందర్‌ 2021 అక్టోబరు 30న జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 23, 855 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[20][21][22][23] ఈటల రాజేందర్ చేత నవంబరు 10న అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణాస్వీకారం చేయించాడు.[24][25]

ఆయనను 2023 జూలై 04న బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కేంద్ర పార్టీ హైకమాండ్‌ నియమించింది.[26][27] ఈటల రాజేందర్ 2023 శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో 16873 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[28][29]

ఈటల రాజేందర్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి​ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్​ అభ్యర్థి సునీత మహేందర్​ రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[30][31][32]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 August 2022). "ఈటల రాజేందర్‌ ఇంట విషాదం". Archived from the original on 24 August 2022. Retrieved 24 August 2022.
  2. Sakshi (1 August 2022). "ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు". Archived from the original on 1 August 2022. Retrieved 1 August 2022.
  3. Sakshi (16 November 2019). "మంత్రి ఈటల రాజేందర్‌ కుమర్తె వివాహ వేడుక". Archived from the original on 30 April 2021. Retrieved 30 April 2021.
  4. The Hans India (15 November 2019). "Telangana CM KCR, governor and ministers attends Etela Rajender's daughter's marriage in Hyderabad" (in ఇంగ్లీష్). Archived from the original on 30 April 2021. Retrieved 30 April 2021.
  5. TV9 Telugu (20 March 2021). "Eatala Rajender Birthday Special: ఉద్యమకారుడి నుంచి రాష్ట్ర మంత్రివరకు.. ప్రజానేత ప్రస్థానం - Minister Eatala Rajender Birthday". TV9 Telugu. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (17 November 2023). "మంత్రులు ముగ్గురు.. మాజీలు ముగ్గురు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  7. "Malkajgiri Lok Sabha Result 2024 LIVE: మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే..?". Samayam Telugu. Retrieved 2024-06-05.
  8. Eenadu (21 November 2023). "ప్రచార భాగస్వాములు". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
  9. 10TV (2 November 2021). "ఈటల రాజేందర్ ఘన విజయం.. హిస్టరీ రిపీట్స్ | Huzurabad By Election 2021 Etela Rajender victory" (in telugu). Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  10. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  11. బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Retrieved 24 July 2019. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)
  12. టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  13. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
  14. Andhrajyothy (1 May 2021). "మంత్రి ఈటల శాఖ సీఎం కేసీఆర్‌కు బదిలీ". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
  15. Andhrajyothy (1 May 2021). "ఈటలకు పొగ!". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
  16. Eenadu (1 May 2021). "ఈటల నుంచి వైద్యారోగ్య శాఖ సీఎంకు బదిలీ". Archived from the original on 1 May 2021. Retrieved 1 May 2021.
  17. Sakshi (2 May 2021). "సీఎం కేసీఆర్‌ సంచలనం: ఈటల బర్తరఫ్‌". Sakshi. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  18. Andrajyothy (4 June 2021). "టీఆర్ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా: ఈటల". Archived from the original on 4 June 2021. Retrieved 2 November 2021.
  19. V6 Velugu (7 October 2021). "బీజేపీ కొత్త కార్యవర్గంలో వివేక్ వెంకటస్వామి, ఈటలకు కీలక పదవులు" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  20. 10TV (2 November 2021). "ఈటల మెజారిటీ ఎంతో తెలుసా...? రౌండ్ వారీగా ఓట్ల వివరాలు | Etala rajender huzurabad by poll full details majority votes etc" (in telugu). Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  21. Andrajyothy (3 November 2021). "ఈటల హుజోర్‌". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
  22. Sakshi (2 November 2021). "హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఈటల రాజేందర్‌ ఘన విజయం". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
  23. Eenadu (3 November 2021). "ఈటల ఏడోసారి.. ఏ ఎన్నికల్లో ఎంత మెజారిటీ..?". Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
  24. Andrajyothy (10 November 2021). "హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
  25. Eenadu (10 November 2021). "ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌ ప్రమాణ స్వీకారం". Archived from the original on 10 November 2021. Retrieved 10 November 2021.
  26. Hindustantimes Telugu (5 July 2023). "ఈటల రాజేందర్ కు కీలక పదవి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు!". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
  27. Andhra Jyothy (5 July 2023). "హైకమాండ్‌ శభాష్‌ అనేలా పని చేస్తా." Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
  28. Andhrajyothy (3 December 2023). "Eatala Rajendar: Political Journey, News & Updates - Telangana Assembly Elections 2023" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2023. Retrieved 25 December 2023.
  29. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  30. Sakshi (18 June 2024). "మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం | BJP Candidate Etela Rajender Won Malkajgiri Parliament Seat | Sakshi". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  31. Andhrajyothy (5 June 2024). "మల్కాజిగిరిలో ఎప్పుడూ విభిన్నమైన తీర్పే..." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  32. Andhrajyothy (5 June 2024). "కమల 'వికాసం'". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.