పాడి కౌశిక్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాడి కౌశిక్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పాడి కౌశిక్ రెడ్డి
పుట్టిన తేదీ (1984-12-21) 1984 డిసెంబరు 21 (వయసు 39)
వీణవంక , కరీంనగర్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం , భారతదేశం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004-2007హైదరాబాద్ క్రికెట్ టీం
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ ఏ క్రికెట్
మ్యాచ్‌లు 15 12
చేసిన పరుగులు 299 38
బ్యాటింగు సగటు 14.95 5.42
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 51 నాట్ అవుట్ 13
వేసిన బంతులు 2,665 613
వికెట్లు 47 17
బౌలింగు సగటు 27.10 30.41
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0
అత్యుత్తమ బౌలింగు 6/31 3/36
క్యాచ్‌లు/స్టంపింగులు 3/0 1/0
మూలం: ESPNcricinfo, 22 ఆగష్టు 2018

పాడి కౌశిక్ రెడ్డి భారతదేశానికి చెందిన క్రికెటర్ [1], రాజకీయ నాయకుడు. ఆయన 2021 నవంబరులో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైయ్యారు.[2] ఆయన 2021 డిసెంబరు 01 నుండి 2023 డిసెంబరు 9 వరకు పనిచేశాడు.[3][4][5]

క్రీడా జీవితం

[మార్చు]

పాడి కౌశిక్‌ రెడ్డి హైదరాబాద్ జట్టుకు దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించాడు. అయన తన తొలి మ్యాచ్ ను పంజాబ్ తో 2004 డిసెంబరు 22లో ఆడాడు. ఆయన రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ గా, మీడియం పేసర్ గా జట్టుకు సేవలందించాడు.కౌశిక్‌ రెడ్డి తన చివరి మ్యాచ్ 2007లో ఆడి, క్రికెట్ నుండి తప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కౌశిక్‌రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్‌ చేతిలో ఓటమి పాల్యయాడు.[6][7] పాడి కౌశిక్ రెడ్డి 12 జూలై 2021న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.[8] కౌశిక్ రెడ్డి 21 జూలై 2021న హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధ్యక్ష్యుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరాడు.[9]

పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్‌ కోటా నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా రాష్ట్ర గవర్నర్ ఆమోదం కోసం 2021 ఆగస్టు 1న మంత్రివర్గం సిఫారసు చేసింది.[10]

పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 2021 నవంబరు 16న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై, నవంబరు 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[11] ఆయనను 2023 ఏప్రిల్ 19న హుజూరాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించాడు.[12] ఆయన 2023 ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై 16,873 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై[13][14], 2023 డిసెంబరు 9న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[15]

వివాదాలు

[మార్చు]

హైదరాబాద్ లో సినీహీరో రాజశేఖర్ సోదరుడు గుణ శేఖర్ పై దాడి కేసు.[16][17]

మూలాలు

[మార్చు]
 1. Deccan Chronicle (5 June 2017). "Ex-Cricketer drives Rahul Gandhi around" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
 2. Namasthe Telangana (16 November 2021). "ఎమ్మెల్యే కోటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 16 November 2021. Retrieved 16 November 2021.
 3. TNews Telugu (1 December 2021). "'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం షురూ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
 4. Eenadu (21 November 2023). "ప్రచార భాగస్వాములు". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
 5. 10TV Telugu (9 December 2023). "ఎమ్మెల్సీ పదవులకు బీఆర్ఎస్ నేతలు రాజీనామా.. ఆమోదించిన మండలి చైర్మన్" (in Telugu). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 6. Sakshi (19 November 2018). "హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి". Sakshi. Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.
 7. Sakshi (18 September 2020). "'ఈటలను ఓడించకుంటే నా పేరు కౌశిక్‌ కాదు'". Sakshi. Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
 8. Prabha News (12 July 2021). "కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రాజీనామా!". Archived from the original on జూలై 12 2021. Retrieved 12 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 9. Sakshi (12 July 2021). "టీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్‌ రెడ్డి". Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 21 జూలై 2021 suggested (help)
 10. Namasthe Telangana (1 August 2021). "నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌ రెడ్డి పేరు ఖరారు". Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
 11. Andhrajyothy (22 November 2021). "తెలంగాణ: ఆ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
 12. Namasthe Telangana (19 April 2023). "హుజూరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి.. నియమించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 19 April 2023. Retrieved 19 April 2023.
 13. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
 14. Namaste Telangana (4 December 2023). "తొలిసారి అధ్యక్షా..!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
 15. Namaste Telangana (10 December 2023). ".. అనే నేను శాసనసభ సభ్యుడిగా!". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
 16. 10TV (4 February 2019). "కౌశిక్ రెడ్డి మా పై దాడి చేశాడు : జీవితా రాజశేఖర్" (in telugu). Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 17. Telangana Today (6 February 2019). "Parking row: Congress leader approaches police". Archived from the original on 8 May 2021. Retrieved 8 May 2021.