పోచారం శ్రీనివాసరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోచారం శ్రీనివాసరెడ్డి
పోచారం శ్రీనివాసరెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సభాధిపతి


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
17 జనవరి 2019 - 2023 డిసెంబర్ 6
టి. పద్మారావు గౌడ్
ముందు సిరికొండ మధుసూధనాచారి

పదవీ కాలం
2 జూన్ 2014 – 6 సెప్టెంబరు 2018
ముందు పదవి ప్రారంభం
తరువాత సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
నియోజకవర్గం బాన్సువాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1949-02-10) 1949 ఫిబ్రవరి 10 (వయసు 75)
బాన్స్‌వాడ, నిజామాబాదు జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ (2011 - 2024), టీడీపీ (1994 - 2011)
తల్లిదండ్రులు పరిగె రాజారెడ్డి, పాపమ్మ
జీవిత భాగస్వామి పుష్ప
సంతానం ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు (రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి)

పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రానికి తొలి వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశాడు. ఆయన 2018 వ సంవత్సరం లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ తరపున బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికై 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.[1]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

పోచారం శ్రీనివాస్‌ రెడ్డి 1949, ఫిబ్రవరి 10న రాజారెడ్డి - పాపవ్వ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాలోని బాన్స్ వాడలో జన్మించాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేశాడు.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శ్రీనివాసరెడ్డికి పుష్పతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు (రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి), ఒక కుమార్తె (అరుణ) ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ హయాంలో పంచాయతీరాజ్, గృహనిర్మాణం, గనుల శాఖ మంత్రిగా పనిచేసాడు. తొలుత భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ఉన్న శ్రీనివాసరెడ్డి, 1984లో తెలుగు దేశం పార్టీలో చేరాడు.[4] 1994లో బాన్సువాడ నియోజకవర్గం నుండి 10వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీనాదేవిపై 57 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 1999లో 11వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషన్ సింగ్ పై 31 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ చేతిలో ఓడిపోయాడు. 2009లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీచేసి బాజిరెడ్డి గోవర్ధన్‌ పై 26వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తెలుగు దేశం ప్రభుత్వంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశాడు.[5]

27 ఏళ్ళపాటు తెలుగుదేశంలో ఉన్న శ్రీనివాసరెడ్డికి తెలంగాణపై అప్పటి తెలుగు దేశం పార్టీ నాయకత్వ ధోరణి నచ్చక పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 2011, మార్చిలో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[6] తన ఎమ్మెల్యే సీటుకు, టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు.[7] ఆ సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంగం శ్రీనివాస్‌గౌడ్‌పై 49,000 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2011 మార్చి 24న టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుపై 24వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[8] 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటి క్యాబినెట్‌లో వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ, పశు సంవర్ధకం, మత్య్స, పాడిపరిశ్రమాభివృద్ధి, విత్తనాభివృద్ధి శాఖలు దక్కాయి. 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్‌ పై గెలుపొందాడు.[9] 2019 జనవరిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యాడు.[10] అతను తెలంగాణలో వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం స్థితిగతులపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించాడు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం నుండి 2023లో వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 జూన్ 21న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[11][12]

పదవులు

[మార్చు]
  1. 1978లో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నిక
  2. 1987: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్
  3. 1989లో నిజామాబాద్‌ ఎంపీగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి తాడూరి బాలాగౌడ్‌ చేతిలో ఓటమి
  4. 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
  5. 1993–1997లో టీడీపీ జిల్లా కన్వీనర్‌
  6. 1994లో బాన్సువాడ ఎమ్మెల్యే
  7. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి [13]
  8. 1999లో బాన్సువాడ ఎమ్మెల్యే
  9. 1999–2000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భూగర్భ గనుల శాఖ మంత్రి
  10. 2001–02 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామీణ, పంచాయతిరాజ్‌ శాఖ మంత్రి
  11. 2004లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఓటమి
  12. 2005 నుంచి 07 వరకు టీడీపీ నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు
  13. 2009లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపు
  14. 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌ లో చేరి అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపు
  15. 2014లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర వ్యవసాయం, ఉద్యానవన, సెరీకల్చర్, సీడ్స్ కార్పోరేషన్, సహకార శాఖ, పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ శాఖల మంత్రిగా
  16. 2018లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచి, 2019 జనవరి 17 నుంచి 2023 డిసెంబర్ 6 వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (4 November 2023). "8 మంది హ్యాట్రిక్‌ వీరులు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  2. Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  3. Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. "TDP legislator quits over Telangana issue". Archived from the original on 2012-03-27. Retrieved 2014-09-16.
  5. "TDP MLA to resign Nizamabad: Telugu - Times Of India". Archived from the original on 2012-04-05. Retrieved 2014-09-16.
  6. 'Nagam sent Pocharam to TRS' - Times Of India
  7. TDP legislator resigns to fight for Telangana
  8. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  9. Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  10. India Today, New Delhi (18 January 2019). "Pocharam Srinivas Reddy elected speaker of Telangana legislative assembly" (in ఇంగ్లీష్). Amarnath K Menon. Archived from the original on 2 February 2019. Retrieved 24 July 2021.
  11. Eenadu (21 June 2024). "కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
  12. Andhrajyothy (15 September 2024). "వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం బాధ్యతల స్వీకరణ". Archived from the original on 15 September 2024. Retrieved 15 September 2024.
  13. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.