కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం (2014-2018)
స్వరూపం
కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి మంత్రివర్గం | |
---|---|
తెలంగాణ మొదటి మంత్రివర్గం | |
రూపొందిన తేదీ | 2014 జూన్ 2 |
రద్దైన తేదీ | 2018 సెప్టెంబరు 6 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ |
ప్రభుత్వ నాయకుడు | కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
మంత్రుల సంఖ్య | 18 |
పార్టీలు | టిఆర్ఎస్ |
సభ స్థితి | మెజారిటీ |
ప్రతిపక్ష పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ప్రతిపక్ష నేత | కుందూరు జానారెడ్డి |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2014 |
శాసనసభ నిడివి(లు) | 4 సంవత్సరాలు |
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 2014, జూన్ 2న ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 17మంది మంత్రులతో తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలో ఉదయం గం. 7. 30 ని.లకు తెలంగాణ అసెంబ్లీకి సమీపంలోని గన్‌పార్క్ వద్దకు వెళ్లి తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంకు నివాళులు అర్పించి, 8 గంటలకు రాజ్‌భవన్ చేరుకున్న కేసీఆర్, గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్ సమక్షంలో ఉదయం గం. 8.20 ని.లకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనతో పాటు మరో 11మంది మంత్రులు పదవీ స్వీకారం చేశారు.[1][2]
మంత్రుల జాబితా
[మార్చు]క్రమసంఖ్య | శాఖ | పేరు | వయస్సు | ఫోటో | నియోజకవర్గం |
---|---|---|---|---|---|
0 | ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వెల్ఫేర్ మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కోల్, జిఎడి ఇతరులకు కేటాయించని శాఖలు |
కల్వకుంట్ల చంద్రశేఖరరావు | 63 | గజ్వెల్, మెదక్ | |
1 | ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, రిలీఫ్, రిహాబీలిటేషన్, యుఎల్‌సి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ | మహ్మద్ మహమూద్ అలీ | ఎమ్మెల్సీ | ||
2 | విద్యుత్‌శాఖ | గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి | సూర్యాపేట | ||
3 | నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలశాఖ మార్కెటింగ్ | టి. హరీశ్ రావు | 44 | సిద్ధిపేట | |
4 | ఐటీ, జౌళీ, పరిశ్రమలు వాణిజ్యం, గనులు, ఎన్.ఆర్.ఐ. అఫైర్స్ | కల్వకుంట్ల తారక రామారావు | 40 | సిరిసిల్ల | |
5 | వైద్య ఆరోగ్య శాఖ | సి. లక్ష్మా రెడ్డి | జడ్చర్ల | ||
6 | హోంశాఖ, ఫైర్ సర్వీస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధి | నాయిని నర్సింహారెడ్డి | 81 | ఎమ్మెల్సీ హైదరాబాదు | |
7 | రవాణ శాఖ | పి.మహేందర్ రెడ్డి | తాండూర్, రంగారెడ్డి జిల్లా | ||
8 | వ్యవసాయశాఖ, హార్టికల్చర్, పశుసంవర్థకశాఖ | పోచారం శ్రీనివాసరెడ్డి | బాన్సువాడ, నిజామాబాదు | ||
9 | విద్యాశాఖ | కడియం శ్రీహరి | స్టేషన్ ఘనపూర్, వరంగల్ | ||
10 | పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ | జూపల్లి కృష్ణారావు | 63 | కొల్లాపూర్, మహబూబ్ నగర్ | |
11 | దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయశాఖ | అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి | నిర్మల్ | ||
12 | ఆర్థిక, పౌరసరఫరాలశాఖ, స్మాల్ సేవింగ్స్, స్టేట్ లాటరీలు, కన్జ్యూమర్ ఎఫైర్స్ శాఖ | ఈటెల రాజేందర్ | హుజురాబాద్, | ||
13 | అటవీ, పర్యావరణ శాఖ | జోగు రామన్న | అదిలాబాద్ | ||
14 | ఎక్సైజ్, క్రీడలు & యువజన వ్యవహారాల శాఖ | టి. పద్మారావు గౌడ్ | సికింద్రాబాదు | ||
15 | రోడ్లు భవనాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ | తుమ్మల నాగేశ్వరరావు | పాలేరు, ఖమ్మం | ||
16 | పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ | తలసాని శ్రీనివాస్ యాదవ్ | సనత్ నగర్ | ||
17 | పర్యాటక, తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ | అజ్మీరా చందులాల్ | ములుగు |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Council of Ministers". Govt of Telangana. Retrieved 23 July 2019.
- ↑ జనంసాక్షి, కవర్ స్టోరి (3 June 2014). "తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం". Archived from the original on 23 July 2019. Retrieved 23 July 2019.