పి.మహేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి.మహేందర్ రెడ్డి
నియోజకవర్గము తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానము ఒక కుమారుడు, ఒక కుమారై

పి.మహేందర్ రెడ్డి (P.Mahender Reddy) తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు మరియు రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మహేందర్ రెడ్డి వెటర్నరీ సైన్సులో డిగ్రీ పూర్తిచేశాడు. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమారై. మహేందర్ రెడ్డి భార్య సునీత 2001-06 కాలంలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేసింది. ఈమె బంట్వారం నుంచి జడ్పీటీసిగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం[మార్చు]

తొలిసారిగా 1994లో తాండూరు నుంచి శాసనసభకు ఎన్నికైనాడు. 1999లో కూడా ఇదే స్థానం నుంచి వరుసగా రెండవసారి శాసనసభలో ప్రవేశించాడు. 2004లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణరావు చేతిలో పరాజయం పొందినాడు. 2009లో మాజీ మంత్రి ఎం.మాణిక్ రావు కుమారుడు ఎం.రమేష్‌పై 13205 ఓట్ల మెజారిటీతో[2] విజయం సాధించి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.

మూలాలు[మార్చు]

  1. Handbook of Statistics, Rangareddy Dist, 2007-08, PNo 12
  2. వార్త దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 17-05-2009