తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
వికారాబాద్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు ఉన్నాయి. ఇంతకు క్రితం ఈ నియోజకవర్గం హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పునర్విభజన ఫలితంగా నూతనంగా ఏర్పడిన చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగమైంది.
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,31,295
- ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :1,76,703
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1962 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సి.శేఖర్ స్వతంత్ర అభ్యర్థి 1967 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.రామచందర్ రావు స్వతంత్ర అభ్యర్థి 1972 ఎం.మాణిక్ రావు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక - 1978 ఎం.మాణిక్ రావు భారత జాతీయ కాంగ్రెస్ సిరుగిరిపేట్ రెడ్డి జనతా పార్టీ 1983 ఎం.మాణిక్ రావు భారత జాతీయ కాంగ్రెస్ సిరిగిరిపేట్ రెడ్డి ఇండిపెండెంట్ 1985 ఎం.చంద్రశేఖర్ భారత జాతీయ కాంగ్రెస్ సిరిగిరిపేట్ బాలప్ప తెలుగుదేశం పార్టీ 1989 ఎం.చంద్రశేఖర్ భారత జాతీయ కాంగ్రెస్ పసారాం శాంత్‌కుమార్ తెలుగుదేశం పార్టీ 1994 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎం.నారాయణ రావు కాంగ్రెస్ 1999 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎం.మాణిక్ రావు కాంగ్రెస్ 2004 ఎం.నారాయణ రావు కాంగ్రెస్ పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం 2009 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎం.రమేష్ కాంగ్రెస్ పార్టీ 2014 పి.మహేందర్ రెడ్డి తె.రా.స ఎం.నారాయణ రావు కాంగ్రెస్ 2018 పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.మహేందర్ రెడ్డి తె.రా.స
పార్టీల బలాబలాలు[మార్చు]
ఈ నియోజకవర్గంలో ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని వదులుకోలేదు. 1985, 1989 ఎన్నికలలో ఎం.చంద్రశేఖర్ వరుసగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినాడు. అంతకు క్రితం వరకు అతడి సోదరుడు ఎం.మాణిక్ రావు గెలుపొందుతూ తన సోదరుడికి స్థానం ఇచ్చాడు. దురదృష్టవశాత్తూ ఎం.చంద్రశేఖర్ మరణం తరువాత మరో సోదరుడు ఎం.నారాయణ రావు బరిలో దిగిననూ 1994లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీకి విజయం లభించింది. 1999లో మళ్ళీ మాజీ రోడ్డు, భవనాల మంత్రి అయిన ఎం.మాణిక్ రావు స్వయంగా రంగంలోకి దిగిననూ ఫలితం దక్కలేదు. 2004లో ఎం.నారాయణరావు విజయం సాధించాడు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, తెలుగుదేశం మినహా మూడో పార్టీ అంతగా బలపడలేదు. కాని లోక్‌సభ ఎన్నికలలో, పురపాలక సంఘపు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గణనీయమైన ఓట్లను సాధించగలిగింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందుిది హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండి ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసిన బద్దం బాల్‌రెడ్డి తాండుర్ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఓట్లను సాధించాడు. అలాగే పురపాలక సంఘ ఎన్నికలలో ఇంతకు క్రితం భారతీయ జనతా పార్టీకు చెందిన నాగారం నర్సిములు చెర్మెన్‌గా పనిచేశాడు.
2004 ఎన్నికలు[మార్చు]
కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలకు పగ్గం వేసిన పి.మహేందర్ రెడ్డి రెండు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన తరువాత 2004లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వీచిన రాజకీయ పవనాల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణ రావు చేతిలో ఓడిపోయాడు. అంతకు క్రితం 1994 వరకు అతడి సోదరులు ఎం.మాణిక్ రావు, ఎం.చంద్రశేఖర్‌లు ఈ నియోజకవర్గం తరఫున శాసనసభ్యులుగా కొనసాగినారు.
- 2004 ఎన్నికలలో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు
గెలుపొందిన అభ్యర్థి పార్టీ పొందిన ఓట్లు ఎం.నారాయణ రావు కాంగ్రెస్ పార్టీ 69,945 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 56391 గౌస్ మొహియుద్దీన్ ఇండిపెండెంట్ 2622 రామావత్ మోత్య ఇండిపెండెంట్ 2351
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పి.మహేందర్ రెడ్డి [2] కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.రమేష్ పోటీచేశారు. మహేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి కుమారుడు ఎం.రమేష్‌పై 13,205 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.[3]
2018 ఎన్నికలు[మార్చు]
2018 ఎన్నికల్లో త్తెరాసకు చెందిన పి. రోహిత్ రెడ్డి గెలుపొందాడు.
నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]
- ఎం.మాణిక్ రావు
- తాండూర్ నాపరాతి పరిశ్రమకు ఆద్యుడైన ఎం.మాణిక్ రావు అనేక దశాబ్దాలపాటు నియోజకవర్గానికి సేవలందించాడు. బషీరాబాద్ గ్రామ వాస్తవ్యులైన ఇతడు రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖామంత్రిగా పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గం తరఫున తిరుగులేని నాయకుడిగా ఎదిగి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తన స్థానం నుంచి తాత్కాలికంగా తప్పుకొని సోదరుడు ఎం.చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాడు. 1999లో మళ్ళీ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిననూ విజయం లభించలేదు.
- పసారాం శాంత్‌కుమార్
- ఇతడు ప్రారంభం నుంచి రాజకీయనాయకుడు కాకున్ననూ మంచి స్వభావం కల వ్యక్తి కావడంతో 1989లో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్టు లభించింది. సినిమా థియేటర్ వల్ల తాండూరు ప్రజలకు ఎంతోచేరువైననూ, మంచి నాయకులలో ఒకడిగా పేరు సంపాదించిననూ ఎన్నికలలో మాత్రం విజయం లభించలేదు.
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా