నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 6 మండలాలు ఉన్నాయి.

చాలా కాలంగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలకు మంచి బలం ఉంది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు ఇక్కడ అనేకమార్లు విజయం సాధించారు. తెలంగాణా సాయుధ పోరాటం సమయంలో ఉద్యమాలలో పాల్గొన్న నంద్యాల శ్రీనివాసరెడ్డి వంటి నాయకుల కారణంగా ఇక్కడ కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. సుమారు 30 సంవత్సరాల కాలం కమ్యూనిస్టి పార్టీ తరపున నర్రా రాఘవరెడ్డి శాసనసభ ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. 1972లో భారత జాతీయ కాంగ్రెస్కు చెందిన మూసపాటి కమలమ్మ, 2009లో టి. లింగయ్య ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలనాటికి ఈ నియోజకవర్గంలో వోట్ల సంఖ్య 2,21,453. ప్రస్తుతం ఇది ఎస్.సి.లకు రిజర్వు చేయబడిన నియోజకవర్గంగా ఉంది.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలు హుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 95 నకిరేకల్ ఎస్.సి చిరుమర్తి లింగయ్య పు కాంగ్రెస్ 93699 వేముల వీరేశం పు తెలంగాణ రాష్ట్ర సమితి 85440
2014 95 Nakrekal (SC) వేముల వీరేశం పు తెలంగాణ రాష్ట్ర సమితి 62445 చిరుమర్తి లింగయ్య పు కాంగ్రెస్ 60075
2009 95 Nakrekal (SC) చిరుమర్తి లింగయ్య పు కాంగ్రెస్ 72023 Mamidi Sarvaiah M CPM 59847
2004 288 Nakrekal GEN నోముల నర్సింహయ్య M CPM 66999 Katikam Sathaiah Goud M తె.దే.పా 42777
1999 288 Nakrekal GEN నోముల నర్సింహయ్య M CPM 40229 Katikam Sathaiah Goud M తె.దే.పా 35114
1994 288 Nakrekal GEN నర్రా రాఘవ రెడ్డి M CPM 59216 Neti Vidyasagar M IND 23110
1989 288 Nakrekal GEN నర్రా రాఘవ రెడ్డి M CPM 58179 Gurram Viduyadagar Reddy M INC 43551
1985 288 Nakrekal GEN నర్రా రాఘవ రెడ్డి M CPM 53144 China Venkatramulu Deshaboina M INC 23444
1983 288 Nakrekal GEN నర్రా రాఘవ రెడ్డి M CPM 29355 S. Indrasena Reddy M INC 28709
1978 288 Nakrekal GEN నర్రా రాఘవ రెడ్డి M CPM 25687 Narasaiah Masaram M INC (I) 19238
1972 281 Nakrekal GEN Musapota Kamalamm M INC 20381 నర్రా రాఘవ రెడ్డి M CPM 16545
1967 281 Nakrekal GEN N. R. Reddy M CPM 24741 Musapetakamala M INC 17788
1962 296 Nakrekal GEN నంద్యాల శ్రీనివాస్ రెడ్డి M CPI 27442 Kancherla Ramakrishnareddy M INC 22748
1957 82 Nakrekal GEN B. Dharma Biksham M PDF 20763 K. Venkatrama Rao M INC 13405


2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సి.పి.ఎం పార్టీకి చెందిన నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటికం సత్తయ్య గౌడ్‌పై 24222 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. నర్సిహ్మయ్య 66999 ఓట్లు పొందగా, సత్తయ్య గౌడ్ 42777 ఓట్లు సాధించాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]