రామన్నపేట్ (యాదాద్రి జిల్లా)

వికీపీడియా నుండి
(రామన్నపేట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రామన్నపేట, తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి - భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం,గ్రామం.[1]

ఇది సమీప పట్టణం నల్గొండకు ఉత్తరాన 36 కిలోమీటర్ల దూరంలోఉంది.రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది,

గణాంక వివరాలు[మార్చు]

రామన్నపేట బస్టాండు

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 51,534 - పురుషులు 25,683 - స్త్రీలు 25,851

గ్రామ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2066 ఇళ్లతో, 10537 జనాభాతో 902 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5291, ఆడవారి సంఖ్య 5246.ఇక్కడ తెలుగు స్థానిక భాష.

సమీప మండలాలు[మార్చు]

రామన్నపేట ఏరియా వైధ్యశాల

రామన్నపేట దక్షిణాన చిట్యాల మండల్, ఉత్తర దిశగా వలిగొండ మండల్, తూర్పు వైపున నార్కేట్పల్లి మండల్, పశ్చిమాన చౌటుప్పల్ మండల్ ఉన్నాయి.

సమీప పట్టణాలు[మార్చు]

చిట్యాల్, చౌటుప్పల్,వలిగొండ ఉన్నాయి.

సమీప నగరాలు[మార్చు]

భోనగిరి, జంగాన్, సూర్యపేట్, హైదరాబాద్,నల్గొండ

రవాణా సౌకర్యం[మార్చు]

రోడ్డు ద్వారా

సమీప పట్టణం నల్గొండ నుండి రోడ్డు మార్గం రామన్నపేట వరకు ఉంది.

రైలు ద్వారా

రeమన్నపేట్ రైల్వే స్టేషన్, చిట్యాల్ రైలు స్టేషన్లు రామన్నపేట్కు దగ్గరి రైల్వే స్టేషన్లు.సికింద్రాబాద్ జంక్షన్ ప్రధాన రైల్వే స్టేషన్ రామన్నపేట్కు 72 కిలోమీటర్ల దూరంలో ఉంది

విశేషాలు[మార్చు]

రామన్నపేట గ్రామంలో ఉన్న అలిసాహెబ్ హిల్స్ అనే సాంప్రదాయ రాజభవనము ఉంది.

రామన్నపేట్ 2009 వరకు అసెంబ్లీ నియోజకవర్గంగా కలిగి ఉంది.

రామన్నపేట్ నగరంలో మన్సిఫ్ కోర్టుతో సహా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలతోఅన్ని ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉంది.                     

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]