ధర్మారం (పెద్దపల్లి జిల్లా)
ధర్మారం | |
---|---|
పట్టణం | |
నిర్దేశాంకాలు: 18°44′10″N 79°13′10″E / 18.736005°N 79.219437°ECoordinates: 18°44′10″N 79°13′10″E / 18.736005°N 79.219437°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణా |
జిల్లా | పెద్దపల్లి |
విస్తీర్ణం | |
• మొత్తం | 3.78 km2 (1.46 sq mi) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 11,537 |
• సాంద్రత | 3,100/km2 (7,900/sq mi) |
Languages | |
• Official | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | TS–22 |
జాలస్థలి | telangana |
ధర్మారం, తెలంగాణ రాష్ట్రం,పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది పట్టణం 3.78 హెక్టార్లులో విస్తరించి ఉంది.[2] ధర్మారం మండలానికి పరిపాలనా కేంద్రం.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 11537, అందులో పురుష జనాభా 5769 కాగా, స్త్రీల జనాభా 5768గా ఉంది. 0-6 ఏళ్లలోపు పిల్లల జనాభా మొత్తం 1174 ఉండగా,అందులో మగ పిల్లల జనాభా 581 కాగా , ఆడ పిల్లల జనాభా 593గా ఉంది. ధర్మారాం నగరంలో మొత్తం అక్షరాస్యత 72.65%గా ఉంది.అందులో పురుష అక్షరాస్యత రేటు 81.75 % కాగా, స్త్రీ అక్షరాస్యత 63.54%గా ఉంది. ధర్మారంలో స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1000గా ఉంది.ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి 1000 మంది మగ పిల్లలకు,ఆడ పిల్లల లింగ నిష్పత్తి 1021గా ఉంది.ధర్మారం జనగణన పట్టణం పరిధిలో మొత్తం 3,061 గృహాలకు పైగా పరిపాలనను కలిగి ఉంది.వీటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక పరిపాలనా సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిధిలో రహదారులను నిర్మించడానికి, నిర్వహించటానికి దాని పరిధిలో ఉన్న ఆస్తులపై పన్ను విధించడానికి అధికారాన్ని కలిగి ఉంది..[3]
మూలాలు[మార్చు]
- ↑ "District Census Handbook – Peddapalli" (PDF). Census of India. pp. 12, 50. Retrieved 11 June 2016.
- ↑ https://etrace.in/census/town/dharmaram-andhra-pradesh-572560/
- ↑ https://www.census2011.co.in/data/town/572560-dharmaram-andhra-pradesh.html