అన్నారం (గుమ్మడిదల మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నారం
—  రెవిన్యూ గ్రామం, జనగణన పట్టణం  —
అన్నారం is located in తెలంగాణ
అన్నారం
అన్నారం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 17°37′44″N 78°22′33″E / 17.628808°N 78.375921°E / 17.628808; 78.375921
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం గుమ్మడిదల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,840
 - పురుషుల సంఖ్య 3,473
 - స్త్రీల సంఖ్య 3,367
 - గృహాల సంఖ్య 1,613
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అన్నారం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలంలోని జనగణన పట్టణం,రెవెన్యూ గ్రామం.[1] అన్నారం సెన్సస్ టౌన్ మొత్తం 1,613 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది. దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను సంబందిత స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిధిలోని రహదారులను నిర్మించడానికి,నిర్వహించటానికి దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి స్థానిక స్వపరిపాల సంస్థకు అధికారం ఉంది.[2] 2016లో తెలంగాణ రాష్ట్రంలోజిల్లాల, మండలాల పునర్య్వస్థీకరణ జరగక ముందు ఈ పట్టణం మెదక్ జిల్లా,జిన్నారం మండలం పరిధిలో ఉంది.పునర్య్వస్థీకరణ భాగంగా కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా,గుమ్మడిదల (కాత్త మండలం) మండల పరిధిలో చేరింది.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని జిన్నారం మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన గుమ్మడిదల మండలంలోకి చేర్చారు.[3]

గ్రామ జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం అన్నార పట్టణంలో మొత్తం 1,613 కుటుంబాలు నివసిస్తున్నాయి. అన్నారం మొత్తం జనాభా 6,840, అందులో 3,473 మంది పురుషులు, 3,367 మంది మహిళలు ఉన్నారు. అన్నారం సగటు సెక్స్ నిష్పత్తి 969.పట్టణ జనాభా మొత్తంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 974, ఇది మొత్తం జనాభాలో 14%గా ఉంది. 0-6 సంవత్సరాల వయస్సు మధ్య 469 మంది మగ పిల్లలు, 505 మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఈ విధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం అన్నారం చైల్డ్ సెక్స్ రేషియో 1,077, ఇది సగటు సెక్స్ రేషియో (969) కన్నా ఎక్కువ.పట్టణ అక్షరాస్యత రేటు 68%.పురుష అక్షరాస్యత రేటు 76.23%, స్త్రీ అక్షరాస్యత రేటు 59.4%గా ఉంది.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 "Annaram Population, Caste Data Medak Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-04.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-16.

వెలుపలి లంకెలు[మార్చు]