గుమ్మడిదల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గుమ్మడిదల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం జిన్నారం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,032
 - పురుషుల సంఖ్య 4,065
 - స్త్రీల సంఖ్య 3,967
 - గృహాల సంఖ్య 2,017
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా (Population)[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,032 - పురుషుల సంఖ్య 4,065 - స్త్రీల సంఖ్య 3,967 - గృహాల సంఖ్య 2,017

ఈ గ్రామములో జన్మించిన ప్రముఖులు[మార్చు]

డా.సి.హెచ్.లక్ష్మణ చక్రవర్తి ఈ గ్రామములో 1976 లో జన్మించారు. వీరు ఆంధ్ర సారస్వత పరిషత్తులో విశారద చదివి అక్కడే బి.ఎ. (ఎల్) చదివారు. ఎం.ఎ., పిహెచ్.డిలు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో 13 సంవత్సరాలు పనిచేశారు. వీరు రచించిన లక్ష్మణరేఖ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ పురస్కారం (2010లో) ప్రతిబింబం పుస్తకానికి కొకలలూరి భాగీరథమ్మ సాహిత్య విమర్శ పురస్కారం 2016 లో అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు అద్యయన శాఖలో తెలుగు అసిస్టెంట్ ప్రొఫెర్ గా పనిచేస్తున్నారు.

గుమ్మడిదల గ్రామ ప్రాముఖ్యత[మార్చు]

గుమ్మడిదల తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 40 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ పట్టణము కాకతీయుల నాటినుండి ఉంది. గుమ్మడిదలలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో రామాలయము, శివాలయము మరియు దగ్గరిలోని బొంతపల్లిలో కల వీరభద్రస్వామి ఆలయము చెప్పుకోదగినవి.

గుమ్మడిదల, హైదరాబాదు శివారు ప్రాంతము అయినందున గత రెండు దశాబ్దాలలో అనేక రసాయన పరిశ్రమలు మరియు ఇతర పరిశ్రమలు యేర్పడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగజేస్తున్నాయి.

గుమ్మడిదలలో అనేక రకాల పంటలు పండిస్తారు. వరి మరియు జొన్న ముఖ్య పంటలైనప్పటికీ పత్తి, జొన్న, ప్రొద్దుతిరుగుడు, టమాట, పచ్చిమిర్చి, వంకాయలు, కాకరకాయలు మొదలైన అనేక ఇతర పంటలు కూడా పండిస్తారు. హైదరాబాదుకు సరఫరా అయ్యే టమాటలలో ముఖ్యభాగము ఇక్కడే పండిస్తారు. జిల్లాలో "ఉత్తమ రైతు" బహుమతి పొందడము ఇక్కడి రైతులకు పెద్ద విశేషమేమీ కాదు. పంటలకు నీటికై ఋతుపవనాల మీద ఆధారపడినప్పటికీ గుమ్మడిదల రైతులు అనేక విన్నూత వ్యవసాయ పద్ధతులను అవలంబించి మంచి ఫలితాలను పొందుతున్నారు.

గుమ్మడిదల నుండి నర్సాపూర్ వరకు విస్తరించి ఉన్న దట్టమైన అడవి తెలుగు సినిమా పరిశ్రమకు ఒక మంచి షూటింగ్ ప్రదేశముగా ప్రాచుర్యము పొందినది.

భారతదేశములో మొట్టమొదటిదైన గ్రామీణ సమాచార కేంద్రము, ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఇండస్ట్రీస్ అలయన్స్ (IFIA) మరియు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోషియేషన్ (FFA) సంయుక్తముగా రూపొందించి అభివృద్ధి చేసిన తేజస్ సమాచార కేంద్ర లేదా జనరల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్సెమినేషన్ (గ్రిడ్) సెంటర్ యొక్క తొలి కేంద్రమును జూలై 13, 2004 న గుమ్మడిదలలో ప్రారంభించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=గుమ్మడిదల&oldid=1982825" నుండి వెలికితీశారు