గుమ్మడిదల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుమ్మడిదల మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]ఇది పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.[మార్చు]

లోగడ గుమ్మడిదల గ్రామం మెదక్ జిల్లా, మెదక్ రెవిన్యూ డివిజను పరిధిలోని జిన్నారం మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గుమ్మడిదల గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా, సంగారెడ్ది రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+11 (పన్నెండు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. అనంతారం
  2. అన్నారం
  3. కానుకుంట
  4. కొత్తపల్లి
  5. గుమ్మడిదల
  6. దాచారం
  7. దోమడుగు
  8. నల్లపల్లి
  9. ప్యారానగర్
  10. బొంతపల్లి
  11. మంబాపూర్
  12. లక్ష్మాపూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-18.

వెలుపలి లంకెలు[మార్చు]