కంది మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంది మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కంది మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కంది మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కంది మండలం స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కంది (సంగారెడ్డి)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు కాల్వ సరళ (టిఆర్ఎస్)
వైశాల్యము
 - మొత్తం 134 km² (51.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 48,078
 - పురుషులు 24,775
 - స్త్రీలు 23,303
పిన్‌కోడ్ 502285


కంది మండలంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్

కంది మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మండలం కోడ్: 04492.[2] కంది మండలం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని, సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో భాగం,జిల్లా ప్రధాన కేంద్రం సంగారెడ్డి 8 కి.మీ.దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[3] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, కంది.

కంది కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

గతంలో కంది గ్రామం, మెదక్ జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలో సంగారెడ్డి మండలంలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కంది గ్రామాన్ని మండల కెేంద్రంగా ప్రకటించి, కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలోకి ఈ మండలాన్ని 16 (1+15) గ్రామాలతో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 134 చ.కి.మీ. కాగా, జనాభా 48,078. జనాభాలో పురుషులు 24,775 కాగా, స్త్రీల సంఖ్య 23,303. మండలంలో 10,881 గృహాలున్నాయి.[5]

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ[మార్చు]

మండల కేంద్రమైన కంది గ్రామం వద్ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేసారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఆరుట్ల
  2. చిద్రుప్ప
  3. బ్యాతోల్
  4. ఎడ్తనూర్
  5. మామిడిపల్లి
  6. కంది
  7. కౌలంపేట్
  8. కాశీపూర్
  9. ఉత్తర్‌పల్లి
  10. మక్తల్లూర్
  11. కల్వేముల
  12. తోప్గొండ
  13. జుల్కల్
  14. ఇంద్రకరణ్
  15. చెరియాల్
  16. ఎద్దుమైలారం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Sangareddy.pdf
  2. "Sangareddy Mandal Villages, Medak, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-24.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  4. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]