నాగల్‌గిద్ద మండలం
నాగల్‌గిద్ద మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, నాగల్‌గిద్ద మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°01′23″N 77°41′08″E / 18.022986°N 77.685638°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | నాగల్‌గిద్ద |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 150 km² (57.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 30,898 |
- పురుషులు | 15,840 |
- స్త్రీలు | 15,058 |
పిన్‌కోడ్ | 502286 |
నాగల్‌గిద్ద మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఉన్న మండలం.[1] మండల కేంద్రం, నాగల్‌గిద్ద. ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. ఈ మండలం నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
[మార్చు]లోగడ నాగల్‌గిద్ద గ్రామం మెదక్ జిల్లా మెదక్ రెవెన్యూ డివిజను పరిధిలోని మానూర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా నాగల్‌గిద్ద గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+20 (ఇరవైఒక్క) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 150 చ.కి.మీ. కాగా, జనాభా 30,898. జనాభాలో పురుషులు 15,840 కాగా, స్త్రీల సంఖ్య 15,058. మండలంలో 5,694 గృహాలున్నాయి.[5]
సమీప మండలాలు
[మార్చు]ఉత్తరం: నారాయణ్ ఖేడ్ మండలం
తూర్పు: రేగోడు మండలం
దక్షిణం: రాయికోడ్ మండలం
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-18.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.