హత్నూర మండలం
హత్నూర మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°44′28″N 78°10′10″E / 17.741221°N 78.169411°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | హత్నూర |
గ్రామాలు | 32 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 203 km² (78.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 55,935 |
- పురుషులు | 28,554 |
- స్త్రీలు | 27,381 |
పిన్‌కోడ్ | 502296 |
హత్నూర మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] హత్నూర, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 55,935 - పురుషులు 28,554 - స్త్రీలు 27,381. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ రాలేదు. మండల వైశాల్యం 203 చ.కి.మీ. కాగా, జనాభా 55,935. జనాభాలో పురుషులు 28,554 కాగా, స్త్రీల సంఖ్య 27,381. మండలంలో 11,949 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సిరపురం
- లింగాపూర్
- చీకుమద్దూర్
- కొన్యాల్
- పన్యాల్
- మధుర
- గోవిందరాజుపల్లి
- నాగుల్దేవ్పల్లి
- సికందర్పూర్
- హత్నూర
- కాసల్
- దేవల్పల్లి
- దౌల్తాబాద్
- మంగాపూర్
- నస్తీపూర్
- ముచ్చర్ల
- తాహెర్ఖాన్పేట్
- మల్కాపూర్
- రెడ్డిఖానాపూర్
- బోర్పట్ల
- పలప్నూర్
- గుండ్ల మాచనూర్
- చందాపూర్
- తురుకల్ ఖానాపూర్
- సదుల్లానగర్
- చింతల్చెరు
- ఎల్లమ్మగూడ
- కొడపాక్
- నాగారం
- షేర్ఖాన్పల్లి
- రొయ్యపల్లి
- ఆక్వంచగూడ
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.