Jump to content

బీదర్

వికీపీడియా నుండి
(బీదరు నుండి దారిమార్పు చెందింది)
బీదరు
Bidar
బీదర్
బీదరు Bidar బీదర్ is located in Karnataka
బీదరు Bidar బీదర్
బీదరు
Bidar
బీదర్
భారతదేశం కర్ణాటక రాష్ట్రం
Coordinates (బీదర్): 17°54′N 77°30′E / 17.9°N 77.5°E / 17.9; 77.5[1]
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
Divisionకలబురగి డివిజన్
Regionహైదరాబాద్ కర్ణాటక (ಕಲ್ಯಾಣ ಕನಾ‌‌‌‌‌‌‍‌‌ಽಟಕ)
జిల్లాబీదరు జిల్లా
Named forబిద్రి
Government
 • Typeమునిసిపాలిటీ
విస్తీర్ణం
 • Total43 కి.మీ2 (17 చ. మై)
Elevation710 మీ (2,330 అ.)
జనాభా
 (2011)
 • Total2,16,020
 • Estimate 
(2021)[4]
2,60,201
 • జనసాంద్రత5,000/కి.మీ2 (13,000/చ. మై.)
 • Males
1,11,470
 • Males density2,592/కి.మీ2 (6,710/చ. మై.)
 • Females
1,04,550
 • Females density2,432/కి.మీ2 (6,300/చ. మై.)
Demonym"Bidri"
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
585 401/02/03
Telephone code91-(0)8482-XXXXXX
Vehicle registrationKA-38

బీదరు లేదా బీదర్ (ఆంగ్లం:Bidar) కర్ణాటక రాష్ట్రం ఈశాన్య భాగంలో ఉన్న ఒక కొండపై ఉన్న నగరం. ఇది మహారాష్ట్ర తెలంగాణల సరిహద్దుల్లో ఉన్న బీదరు జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఈ ప్రాంతంలో వేగంగా పట్టణీకరణ చెందుతున్న నగరం. ఈ నగరం వాస్తు, చారిత్రక, మత ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రదేశాలకు నెలవు.

రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి బీదరు సుమారు 700 కి.మీ. దూరంలో ఉంది ఈ నగరం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం పాటు నిర్లక్ష్యం వహించింది. అయినప్పటికీ, గొప్ప వారసత్వం కారణంగా, ఈ నగరం భారత పురావస్తు పటంలో ముఖ్య స్థానం పొందింది. దక్కన్ పీఠభూమిపై ఉన్న అందమైన బీదరు కోట 500 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇప్పటికీ బలంగా ఉంది.[6]

బీదరు నగరం బిద్రి హస్తకళ ఉత్పత్తులకు ప్రసిద్ధి. సిక్కులకు కూడా బీదరు పవిత్రమైన తీర్థయాత్రా స్థలం. ఉత్తర కర్ణాటక లోని ఇతర ప్రదేశాల మాదిరిగా కాకుండా బీదరు, ఈ ప్రాంతంలో అత్యంత శీతలంగా, తేమగా ఉంటుంది. 2009-10 సంవత్సరానికి, భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాల్లో బీదరు 22 వ స్థానంలోనుమ్ కర్ణాటకలో 5 వ స్థానంలోనూ ఉంది.[7] రాష్ట్ర రహదారి 4 బీదరు గుండా వెళుతుంది. మొత్తం నగరం 4 వరసల రహదారి‌తో అనుసంధానించబడి ఉంది.

పేరు

[మార్చు]

సంప్రదాయ కథల ప్రకారం విదురుడు ఇక్కడ నివసించాడని భావిస్తారు; అందువల్ల గతంలో ఈ స్థలాన్ని విదురనగర అని పిలిచేవారు. నలుడు, దమయంతి (విదర్భ రాజు భీముడి కుమార్తె) కలిసిన ప్రదేశం ఇదేనని కూడా విశ్వసిస్తారు.[8] బహమనీ సుల్తానుల పాలనలో బీదరు‌ను ముహమ్మదాబాద్ అని పిలిచేవారు.

చరిత్ర

[మార్చు]

క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో బీదరు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉంది. మౌర్యుల తరువాత, శాతవాహనులు, కాదంబులు, బాదామి చాళుక్యుల తరువాత రాష్ట్రకూటులు బీదరు ప్రాంతాన్ని పాలించారు. కల్యాణి చాళుక్యులు, కాలచుర్యులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. కళ్యాణి చాళుక్యుల తర్వాత కొంత కాలం పాటు కోసం ఈ ప్రాంతాన్ని దేవగిరి యాదవులు, ఓరుగల్లు కాకతీయులూ పాలించారు. ముహమ్మద్-బిన్-తుగ్లక్ బీదరు‌తో సహా మొత్తం దక్కన్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

1724 లో నిజాం అసఫ్ జా (నిజాం) మూడవ కుమారుడైన సలాబత్ జంగ్, 1751 నుండి 1762 వరకు బీదరు కోట నుండి పరిపాలించాడు, అతని సోదరుడు మీర్ నిజాం అలీ ఖాన్ అసఫ్ జా III అతన్ని ఈ కోటలో ఖైదు చేసి, 1763 సెప్టెంబరు 16 న హతం చేసాడు. బీదరు పాత పేరైన మొహమ్మదాబాద్ అతని పేరు మీదుగానే వచ్చింది. ఇది 20 వ శతాబ్దం ప్రారంభంలో బీద్రు నుండి హైదరాబాద్‌కు రైలు మార్గం వేసారు. [9] భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, 1956 లో కన్నడ మాట్లాడే ప్రాంతాలన్నిటినీ కలిపి మైసూరు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినపుడు బీదరును అందులో కలిపారు. 1973 లో మైసూరు రాష్ట్రాన్ని కర్ణాటకగా పేరుమార్చారు..[10][11][12]

భౌగోళికం

[మార్చు]

బీదరు దక్కన్ పీఠభూమి మధ్య ప్రాంతంలో 17°54′N 77°30′E / 17.9°N 77.5°E / 17.9; 77.5 వద్ద,[13] సముద్ర మట్టం నుండి 2,300 అడుగుల ఎత్తున ఉంది. బీదరు జిల్లాకు మహారాష్ట్ర తెలంగాణలతో సాధారణ సరిహద్దులు ఉన్నాయి, తూర్పున తెలంగాణలోని నిజామాబాద్ మెదక్ జిల్లాలు, పశ్చిమాన మహారాష్ట్రలోని నాందేడ్, ఉస్మానాబాద్ జిల్లాలు. దక్షిణాన గుల్బర్గా జిల్లాలు ఉన్నాయి. 

మట్టి

నేల స్వభావం

[మార్చు]

బీదరు నేలలు లోతుగా ఉన్నాయి (100 సెం.మీ), పీఠభూములలో బాగా ఎండిపోయిన కంకర ఎరుపు బంకమట్టి నేలలు. అధిక కంకర నేలలు, ఇవి లోతుగా తవ్వినచో తగ్గుతాయి.[14]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

ఒకప్పుడు పత్తి వడకడం వంటి అనేక కుటీర పరిశ్రమలకు నిలయంగా ఉన్న బీదరులో,[15] ప్రస్తుతం స్థానిక ముడి పదార్థాలపై ఆధారపడిన పరిశ్రమలు అతి కొద్ది సంఖ్యలో ఉన్నాయి. స్థానిక కళాఖండాల రూపమైన, బిద్రి కళ కూడా క్షీణదశలో ఉంది. పెరుగుతున్న పదార్థాల ధరలు, ముఖ్యంగా వెండి ధరలు పెరగడం, అమ్మకాలు క్షీణించడం వలన వంశపారంపర్యంగా పనిచేసే చేతివృత్తులవారికి ఉపాధి కరువౌతోంది.[16] బీదరు నగరంలో కొఠారు అనే పెద్ద పారిశ్రామిక ప్రాంతం ఉంది. 

బీదరు కోట

[మార్చు]

బీదర్ కోట [17] దేశంలోని అత్యంత బలిష్ఠమైన కోటలలో ఒకటి. బీదరు నగరం ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించబడింది. రాజాస్థానం, నగరం ఈ రెండింటికీ రక్షణ కోసం విడిగా కోటలు ఉన్నాయి, బీదరు నగర కోటలోకి ప్రవేశించడానికి ఐదు ద్వారాలు ఉన్నాయి. ఇది పీఠభూమి అంచున నిర్మించబడింది. దాని రూపకల్పన నిర్మాణంపై వివిధ దేశాల ఇంజనీర్లు పనిచేసారు. వివిధ వాస్తురీతులను వాడారు. బీదరులో పాత యుద్ధ వస్తువులు, పాత శిల్పాలు, ప్రాచీన శిలలతో కూడుకున్న మ్యూజియం ఉంది.,[18]

బీదరు కోట
రిపబ్లిక్ డే పరేడ్ 2011 సందర్భంగా బీదరు నుండి బిడ్రివేర్ హస్తకళను వర్ణించే కర్ణాటక పట్టిక రాజ్‌పథ్ గుండా వెళుతుంది.

రవాణా

[మార్చు]

రైలు

[మార్చు]

బీదరు నుండి బెంగుళూర్, హైదరాబాద్, ఔరంగాబాద్, లాతూర్, నాందేడ్, మన్మాడ్, ముంబై, విశాఖపట్నం, మచిలీపట్నం, విజయవాడ రేణిగుంట గుల్బర్గా-లకు రైలు సౌకర్యం ఉంది.[19][20] బీదరు-హైదరాబాద్ ఇంటర్-సిటీ రైలు సేవ 2012 సెప్టెంబరులో వినియోగం లోకి వచ్చింది.[21] బీదరు-యశ్వంత్‌పూర్ (డైలీ) ఎక్స్‌ప్రెస్ రైలు [22] బీదరు-ఎల్‌టిటి ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు [23] నడుస్తున్నాయి. బీదరు నుండి లాతూర్ మీదుగా ముంబైకి వెళ్లే మరో రైలు వారానికి మూడు రోజులు నడుస్తోంది.

బీదరు విమానాశ్రయం దేశీయ విమాన సేవలు అందిస్తుంది బీదరు బెంగళూరు మధ్య రోజూ ఒక విమాన సర్వీసును నడుపుతుంది[24]

ఇవీ చూడండి

[మార్చు]
జ్ఞాన సుధా విద్యాలయ, పాఠశాల భవనం
స్వామినారాయణ గురుకుల

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. co-ordinates represent the city limits broadly
  2. "City/Town Summary". Bidar City Municipal Council, ಬೀದರ ನಗರಸಭೆ. Archived from the original on 22 ఫిబ్రవరి 2016. Retrieved 11 March 2015.
  3. Elevation of the CITY is not to be confused with that of TALUKA, which averages to 664m (2178ft)
  4. Directorate of Economics and Statistics, B'luru, 2013
  5. "Bidar City Census 2011 data". census2011.co.in. Retrieved 14 March 2015.
  6. "Bidar fort stands the test of time". Deccan Herald. 4 January 2010. Retrieved 5 March 2015.
  7. "India's cleanest: Where does your city stand?". News.rediff.com. 2010-05-13. Retrieved 2013-12-19.
  8. Karnataka Gazetteer (Second ed.). Govt. of Karnataka. 1 January 1983.
  9. Yazdani, 1947, pp. 20.
  10. "Geography and travel". Encyclopædia Britannica. Archived from the original on 4 December 2009. Retrieved 2009-11-08.
  11. Sherwani, Haroon Khan (1969). Cultural trends in medieval India: architecture, painting, literature & language. Asia Pub. House. pp. 14–16. ISBN 9780210981436. Retrieved 2009-11-07.
  12. "Gulbarga Fort". British Library On Line gallery. Archived from the original on 2012-10-18. Retrieved 2009-11-07.
  13. "Falling Rain Genomics, Inc – Bidar". Fallingrain.com. Retrieved 2013-12-19.
  14. Characterisation of sugarcane soils of Karnataka L.C.K. Naidu, National Bureau of Soil Survey and Land Use Planning. Regional Centre. Hebbal. Bangalore 560024.
  15. Bidar District Gazetteer, Govt. Printing Press, Bangalore, 1977.
  16. Agrarian Distress in Bidar, A report by NATIONAL INSTITUTE OF ADVANCED STUDIES, 1999
  17. Bidar Fort
  18. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-19. Retrieved 2020-12-23.
  19. "PM Modi to inaugurate Bidar-Kalaburgi railway line".
  20. "Bidar-Gulbarga rail service". Infrastructure Today, January 2012. Archived from the original on 1 జూలై 2015. Retrieved 21 December 2013.
  21. "Archived copy". Archived from the original on 11 October 2014. Retrieved 18 September 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  22. "Frequency of Bidar-Y'pur Train to be Increased". The New Indian Express. 23 December 2014. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 23 డిసెంబరు 2020.
  23. "First Bidar-Mumbai train to be flagged off today". The Hindu. Kasturi & Sons Ltd. 10 February 2015. Retrieved 10 February 2015.
  24. Bidar Air Force Station Archived 25 ఏప్రిల్ 2012 at the Wayback Machine OurAirports

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బీదర్&oldid=4356305" నుండి వెలికితీశారు